ఇక్కడ దొరుకుతుంది పుస్తకం!

List of books tores where you can obtain a copy Atluri PItcheswara Rao Kathalu
చావెరుగని ‘‘చిరంజీవి’’!

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు ఒక్క సారి చదివిచూడండి! కనీసం, “చిరంజీవి” అనే ఉదాత్తమయిన వ్యక్తిత్వం కలిగిన నావికుడి గురించి రాసిన “బ్రతకడం తెలియనివాడు” అనే ఒక్క కథానిక చదవండిచాలు!
ఈ కథలు… చదవటమొక అవసరం

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు (నాలుగవ పునర్ముద్రణ ) సంపుటి మీద నరేష్‌కుమార్ సూఫీ అభిప్రాయం ఇది.
దెయ్యాల వంతెన

వేణువు ఊదుకుంటున్న గోపాలుడికి ఆ సాయంత్రం పొద్దెక్కడం కొంచెం ఆలస్యంగా తెలిసింది. హడావుడి పడుతూ తన మేకలని కాలువ వైపుకి తోలాడు. ఊళ్ళో వాళ్ళెవరూ ఆ కాలువ, ఆ వంతెన వైపుకి చీకటి పడే సమయానికి రారు. భయం. ఎప్పుడో చెక్కతో కట్టిన వంతెన అది. ఇప్పుడో, అప్పుడో పడిపోయెటట్టుంది ఆ వంతెన. ఆ వంతెన ఇవతల గట్టుకి ఆనుకుని ఒక పెద్ద మఱ్ఱిచెట్టుంది. దాని మీద దెయ్యాలున్నాయిని ఆ ప్రాంతం ప్రజల నమ్మకం. చీకటి పడిన […]
సంగీతం – మూడు కథలు
వేదిక మిత్రులకు, ఈ శనివారం అంటే 27 అక్టోోబరున, 2018 నాడు “వేదిక” సాహిత్య సమావేశంలో సంగీత నేపధ్యంతో మూడు కథలు గురించి ముచ్చటించుకుందాము. కానుక – ముళ్ళపూడి వెంకటరమణ ( మోహిత) వాయులీనం – చా సో (ఊణుదుర్తి సుదాకర్) చూపున్న పాట – కె ఎన్ వై పతంజలి (శ్రీమతి. రామలక్షి) కధలను ఇక్కడ ఆన్‍లైన్‍లో చదువుకోవఛ్హు. http://bit.ly/Vedika27Oct2018 మరో ముఖ్యమైన విషయం అక్టోబరు 25 ఉదయాన, అధ్యాపకులు, రచయిత కవన శర్మ గారు […]
కొత్త కథ 2018 లో #మీ టూ, దాని నేపధ్యం

2016 లో వ్రాసుకున్న ఒక పెద్ద కథలో ఒక భాగం, ఈ ‘#మీ టూ’. ఆ కధ చాల పెద్దది. బహుశ జాల పత్రికలకి కూడా పెద్దదయ్యేదేమో. అందుకనే అందులో నుంచి ఒక భాగమే తీసుకున్నాను. కధా వస్తువు నా జీవితంలో నేను చూసిందే. నా బాల్యంలోనే. లోపల ఎక్కడో దాగుంది అది. 2016 లో బయట పడింది. మార్నింగ్ వాక్ లో పార్క్‌లో కనబడేవాళ్లోలో ఒకతను తన కూతుర్ని కూడా తీసుకుని వఛ్హేవాడు. ప్రతిరోజు వఛ్హేవాడు […]
క్లుప్తంగా ఇడ్లి, వడ, సాంబార్ కధ ఇది!

కొంత మంది పాఠకులకి నేను వ్రాసిన ఇడ్లి, వడ, సాంబారు కధ పూర్తిగా అర్ధం కాలేదన్నారు. ఈ టపా వారికోసం. ఈ క్రింద ఇఛ్హినవి సారంగ లో వఛ్హిన కధ ఇడ్లి, వడ,సాంబార్ లోని వాక్యాలు. ఇవన్ని అంతర్గతంగా కధాంశానికి సంబంధించిన సూచినలిస్తాయి. వీటన్నింటిని ఒక క్రమంలో చదువుకుంటే కధ అర్ధం కావాలి. ఈ వాక్యాలు చదివిన తరువాత, కధని మళ్ళీ ఒకసారి చదువుకోండి. దానికి లంకె ఈ కింది వాక్యాల తరువాత చివర ఇఛ్హాను. – […]
కధ 2014… కధకులు ముగ్గురూ…మరొకరు

చనుప, నెరవు, తెరువు, దడము, బడిమి, పుంత, నడవ, మయి, జాడ, ఓణి, కంతి, చొప్పు. వీటన్నింటికి ఒకటే అర్ధం, తెలుగులో దారి అని. తెరువు అనే పదాన్ని “అంద చెన్నై మానగరిత్తిలే,” వాళ్ళు వాడగా విన్నాను, నేను వాడాను. వాళ్ళు ఇంకా వాడుతున్నారు. కధ 2014.
కధ 2014…ఇంకో ముగ్గురు కధకులు కాక ఇంకొకరు

కధాసాహితి వారు రానున్న ఆదివారం సెప్టెంబరు 20న, 2015 తెనాలి లో ఆవిష్కరించనున్న కధ 2014 సంపుటిలోని కధకుల వివరాల పరంపరలో ఈ టపా మూడవది. ఈ సంపుటి సంపాదకులు పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్.
కథ 2014 … మరో ముగ్గురు కథకులు

కథ 2014, కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది. ఒక పరంపరగా ప్రతి సంవత్సరం వెలువడుతునే ఉంది. కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో. కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ. ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి. ఆ అధ్యక్షుల వారిది తెనాలి. పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.