“మహా సముద్రం లాంటి సినిమారంగంలో కూడా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న పిచ్చేశ్వరరావు మూడు నాలు దశాబ్దాలలో జరిగిన అంతర్జాతీయ సంఘటనలతో ప్రభావితుడై కథలు రాశాడు.
కళాకారుడికి శిల్పంలో పొదుపు అత్యవసరం. ఈ పొదుపుకు ఆదర్శప్రాయమనదగినది ‘నెత్తురు కథ.’ అయిదు పేజీలు పూర్తిగా లేని ఈ కథలో ఒక జీవితమే కాదు, ఎంతో చరిత్ర లిఖించి ఉన్నది.” – కొడవటిగంటి కుటుంబరావు