దాదాపుగా గత దశాబ్దం అంటే పదేళ్ళుగా నేను తెలుగు సాహిత్యం – పాఠకులు గురించి నేను ఒక ప్రతిపాదన చేస్తూవచ్చాను. ఆ ప్రతిపాదన మిత్రులతో పంచుకుంటూనే వున్నాను. అలాగే సాంఘిక మాధ్యమాలు అంటే Social Media. ప్రస్తుతం ఒక తరం విరివిగా వాడుతున్న ఫేస్‌బుక్, కొంతకాలం క్రితం ప్రాచుర్యంలో వున్న బ్లాగ్ ప్రపంచం, గూగుల్ వారి ఆర్కుట్, గుగుల్ ప్లస్ లాంటి వాటిల్లో నా అభిప్రాయాన్ని తెలియపరుస్తునే వచ్చాను.
అదేమిటంటే సాంఘిక ప్రసారమాధ్యమాలలో మాత్రమే తెలుగు సాహిత్య పిపాసువులు అంటే కవులు, రచయితలు, కళాకారులున్నారన్నది భ్రమ! తెలుగు సాంఘిక మాధ్యమాల వెలుపల విస్తారమైన ప్రపంచం వున్నదన్నీనూ, అందులో తెలుగులో రాసే రచయితలు, కవులు వగైరా మాత్రమే కాక తెలుగు పాఠకులు వున్నారన్నీను అని నా ప్రతిపాదన! అంతే కాదు ఆ ఫేస్‌బుక్‌లో యువత లేదని కూదా చెప్పాను. ఆ యువత తెలుగు చదివే ఆసక్తి వున్న యువత అని, తెలుగులో రాయాలని కోరిక ఆ యువతకి వున్నదని కూడా చెప్పాను.
కాకపోతే ఆ యువతకి తెలుగు సాహిత్యం చదవడం ఎక్కడ మొదలు పెట్టాలని తెలియదు. వారిలో కొంత మందితో మాట్లాడినప్పుడు వారు నన్ను అడిగారు కూడా.
“సార్, తెలుగు సాహిత్యం చదవాలంటే ఏ పుస్తకంతో మొదలు పెట్టాలి?”
దానికి అనేక మంది అనేక సలాహాలు ఇస్తూ వచ్చారు. ఇస్తున్నారు కూడా. ఆ జాబితాల వివరాలు భవిష్యత్తులో ఇక్కడే మీకు ఇస్తాను.
ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వాలని నేను ఎప్పట్నుంచో ఇవ్వాలని అనుకుంటూ వచ్చాను. అది ఇప్పటి ఈ రోజుకు కి కుదిరింది. ప్రస్తుతం దాదాపు పాతికేళ్ళ (పాతిక = 25, + ఏళ్ళు = సంవత్సరాలు = పాతికేళ్ళు) క్రితం కొంతమంది తెలుగు సాహిత్యాభిమానులు తయారు చేసిన జాబితా ఇది. దీనిని ఈమాట అనే తెలుగు జాల పత్రిక (interent / web / magazine) లో ప్రచురించారు. ఈ జాబితాను ప్రచురించినవారు వారి మాటల్లోనే ఇలా అన్నారు:
“లోకో భిన్న రుచిః! ఈ జాబితా మీకు సమగ్రంగా తోచకపోవచ్చు, అసంపూర్ణంగా అనిపించవచ్చు; మీ గొప్ప 100 పుస్తకాల జాబితా వేరే పుస్తకాలతో నిండి ఉండవచ్చు. ఈ జాబితా వెనుక ఏ రకమైన అధికారిక గుర్తింపు లేదు. ఇది కొంతమంది సాహిత్యాభిమానుల సమిష్టి ఎన్నిక. కొందరు పాఠకులతో ఈ పుస్తకాలను మొదటిసారో, మరోసారో చదివించటమే ఈ ఎన్నిక ఉద్దేశం.”
కాబట్టి మీకు మీ మిత్రులు, బంధువులు కాని ఇతరులు సూచించిన పుస్తకాలు గురించి కాని వివరాలు వుండకపోవచ్చు. దానికి కారణం మొదట్లోనే చెప్పినట్టు ఈ జాబితా దాదాపు 25 సంవత్సరాల క్రితంది. కాబట్టి ఇందులో సమకాలీన (contemporary) అంటే 1999 తరువాత వెలువడ్డ సాహిత్యం, పుస్తకాలు, కవితలు, కథలు, నవలలు, నాటకాలు వగైరా వుండవు.
ఇక ఈ జాబితాల సేకరణలో నాకు తోడ్పడిన మిత్రులు
డా జంపాల చౌదరి, ఏ వి రమణమూర్తి, సి . భాస్కరరావు గారలకు
నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఆ జాబితలు విడిగా ఇస్తాను. చాలా మంది చాలా జాబితాలు తయారు చేసారు కాని వాటిల్లో కొన్నింటిని నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
సరే, ఇక్కడ ఇందాక ప్రస్తావించిన ఈమాట లో వచ్చిన జాబితా చూడండి. మీకు ఏవైనా సందేహాలుంంటే నాకు ఇక్కడే comment బాక్స్‌లో తెలియజేయండి. నాకు తెలిసినంత మేరకు సందేహాలు తీర్చడానికి ప్రయత్నిస్తాను.
ఇక ఈ జాబితాల సేకరణలో నాకు తోడ్పడిన మిత్రులు డా జంపాల చౌదరి, ఏ వి రమణమూర్తి, సి . భాస్కరరావు గారలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Note; This post was written keeping in mind the Gen Z who are interested in reading Telugu books.
…లు
ఈ కథని దాదాపు పదేళ్ల క్రితం రాసాను.
ఇటీవలి కాలంలో ఒకానొక పత్రికా సంపాదకులు, మిత్రులు కథలుంటే ఒకటి పంపండి మా పత్రికలో ప్రచురిస్తాం అని అడిగితే. ఈ కథని పంపాను. ఇదిగో అదిగో అంటూ కొన్ని నెలలు జరిగిన తరువాత తన మిత్రులెవరో నచ్చలేదన్నారని తెలియజేసాడాయన.
అది ఇలా ఈ డిసెంబరు 17, 2023 ఆదివారం నాడు సంచిక లో ప్రచురణకి నోచుకుంది.
కథని ఈ లంకె ని క్లిక్ చేసి చదువుకోవచ్చు.
ఇక్కడ దొరుకుతుంది పుస్తకం!
అట్లూరి పిచ్చేశ్వరరావు కథల పుస్తకం ఈ క్రింది విక్రేతల దగ్గిర లభిస్తుంది. అమెరికాలో పాఠకులకి కూడా ఆ దేశంలో అందుబాటులో వుంది. ఇంకేమన్నా వివరాలు కావాలంటే కింద కామెంట్ లో తెలియజేయండి. జవాబిస్తాను. పుస్తకం వివరాలు కింద ఇచ్చాను చూడండి.
Sole Distributors:
Navodaya Book House,
Opp: Metro Pillar 14,
Kachiguda Cross Roads,
Hyderabad 500 027,
Telangana, India
Mobile: +91 – 90004 13413
వీరిదే ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు.
https://bit.ly/APRinNavodayaOnLine
విజయవాడలో
Pallavi Publications,
29-28-27, Dasari Vari St,
Moghalrajpuram, Suryaraopeta,
Vijayawada – 520 010,
Andhra Pradesh, India
Mob: 98661 15655
మీకు అమెజాన్‌లో కావాలనుకుంటే
Analpa Books ద్వారా ఇక్కడ తీసుకోవచ్చు:
35-69/1 2nd Floor GK COLONY (bus stop)
near Neredmet Cross Road, Saptagiri Colony,
Sainikpuri, Secunderabad – 500 094 Telangana, India
Mob: +91 70938 00678
https://amzn.to/3mnKBKN
https://bit.ly/APRonAnalpa
Logili Book House,
Guntur – 522 007
Andhra Pradesh, India
Mobile: +91 95501 46514
వారి ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ తీసుకోవచ్చు:
https://bit.ly/APRonLogili
విశాఖలో
Book Center
Gur Banga Complex,
Shop No.47-15-4,
Diamond Park Rd,
Dwaraka Nagar,
Visakhapatnam, 530 016
Andhra Pradesh, India
Landline: 0891 2562684
Mob: 98851 42894
విశాఖలో
Vagdevi
Gur Banga Complex, Door No.47-15-4, Diamond Park Rd,
Dondaparthy, Dwaraka Nagar, Visakhapatnam, 530 016
Mob : 93473 20588
Ph: +91 0891 2505785
చంద్రశేఖర అజాద్ పుస్తకం ‘కవిగారి అంతరంగాలు’ కి ఒక ముందుమాట
రెండో ముందు మాట
గతంలో మిత్రుడు చంద్రశేఖర అజాద్ రాసిన ఒక నవల విపరీత వ్యక్తులు కి ఒక ముందు మాట తన బలవంతం మీదే రాసాను. ఈ కవిగారి అంతరంగాలు కి రాసిన ముందుమాట తన పుస్తకమే. ఇందులో కూడా తన మిత్రులు కవిరాజు, , గఫార్ గారలతో పాటు ఎందుకో నాతో కూడా రాయించుకున్నాడు. ఇది నిన్న తనకోసం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాను. అది అందరికి అందుబాటులో వుండదని ఇక్కడ ఇస్తున్నాను.
ఇక్కడ ముందు మాటలో చెప్పినట్టు మిత్రుడు ఆజాద్ ప్రతిభావంతుడు కాకపోతే దాదాపు వంద నవలలు రాయగలడా? దాదాపు వెయ్యి కథలు రాయగలిగేవాడా? సరే అవన్ని పక్కన పెడితే సుమారుగా ఒక ఐదువేల టీ వీ సిరియల్ ఎపిసోడ్స్‌కి స్క్రిప్ట్ అందించగలిగేవాడా? కవితలు రాసి మెప్పించగలిగేవాడా?
బాల సాహిత్యం రాసి మరి కేంద్ర సాహిత్య పురస్కారం కూడా అందుకున్నవాడు.
మరి అటువంటి మనిషి ఇటీవలే విడుదలైన తన ‘కవిగారి అంతరంగాలు’ (తన ఆత్మకథ కాదు తన పరిశీలనకు అందిన వాటి గురించి)కు ముందుమాట రాయమని నా మీద ‘ప్రేమ’ తోనే అడిగాడని అనుకోవాలి. నా బలహీనత. గట్టిగా కాదనలేకపొయ్యాను. కాకపోతే కవులు, కాబోయే-కవులు, ‘కవి’ బిరుదు తగిలించుకోవాలనుకునేవారికి కొన్ని ‘ఘాటు’, కొన్ని ‘స్వీటు’ సలహాలతో నిండిన ప్రయణామవుతుంది తన ‘కవిగారి అంతరంగాలు’. అంతే కాక తన అంబుల పొది నుంచి కొన్ని బాణాలు కూడా సంధించాడు ప్రస్తుతం వున్న తెలుగు సాహిత్య ప్రపంచం మీద.
సరే. ఇక్కడికి ఇది ఆపుదాం. ముందు మాటలో కి పదండి.
ఇంకా వుంది
‘నేను ఆల్క హాలికుణ్ణి అయ్యాను.’ పద్యమే మద్యం కాదు ఈ రచయితకి. అలాగని సభానంతర
కార్యక్రమాలలో పాల్గొనలేదని కూడా చెప్పలేము. ఎందుకంటే ఈ కవి సాధారణంగా సాహితీజీవులతో కనపడడు. కాలానుగుణంగా కలాన్ని విదిలిస్తాడు.
అది పద్యమో, గద్యమో ఔతుంది. ‘శ్రీశ్రీ కవిత్వంలో మేధావులకు కూడా అర్థం కాని విషయాలున్నవి’ అని అందరు ఒప్పుకోని నిజాన్ని బద్దలుకొడతాడు. అందుకనే
కొన్ని సాహితీ సమూహాలు ఈ కవిని దూరంగా పెడతాయి.
నిజమైన విమర్శకులు ఒకప్పుడుండేవారు. బృందాలుగా దాడులు చేస్తున్న
కాలమిది, అని చెప్తూ ‘ఆ సమస్త దాడులకు నేను తయారుగా వున్నాను’ అని అంటున్నాడు.
నాకు అవార్డులు, రివార్డులు అక్కర్లేదు. కనీసం కొద్దిమంది పాఠకులైనా
నన్ను గుర్తిస్తే చాలంటున్నాడు. కవికి కావాల్సింది క్రిటిక్కులు కాదు, రెండు
‘వహ్వాలు’. అలాగని కవిత్వం రాయడం మార్నింగ్ వాక్ కాదు అని ఈ కవి
అంటున్నది నిష్టూర సత్యం.
తనలోకి తను చూసుకుంటున్న ఆత్మవిమర్శలో కవితకి ఏం కావాలో,
ఎలా కావాలో ఎలా వుండాలో అన్నది ఈ ‘కవిగారి అంతరంగాలు’లో వుంది.
తన ఏడుపదుల జీవితంలో వందల కథలు, నవలలు, కవితల నేపధ్యంలో
జీవితాన్ని వెలికి తీసి చెప్పుకుంటున్న డాక్యుమెంట్ ఇది. కలం పట్టుకున్న ప్రతివారు
ఈ ‘కవిగారి అంతరంగాలు’ని తెరిచి, తరచి చూడాల్సిందే.
/
‘కవిగారి అంతరంగాలు’
ధర: ₹100-00
ప్రతులకు:
నవోదయ, హైదరాబాద్ వారి ఆన్‌లైన్ బుక్‌స్టోర్ లో కూడా తీసుకోవచ్చు.
Navodaya Book House
3-3-865,Opp Arya Samaj Mandir,
Kachiguda,Hyderabad,
Pin Code: 500027
Mob:+91-9000413413,
*
విజయవాడలో :
కలిమిశ్రీ
Malleteega Prachuranalu,
3rd Floor, Subhasri Towers,
Vuyyoor Zamindar Street, Gandhi Nagar,
Vijayawada PIN 520 003
Mobile: 92464 15150
చాలు!
నేను తరచూ చెప్తుంటాను.
ఫేస్‌బుక్‌లో ప్రవేశించేవారికి చర్మం మందంగా వుండాలని. ఎంత మందంగా వుంటే అంత మంచిదనికూడా. ఎందుకంటే వాళ్ళూ, వీళ్ళు తెలిసీ, తెలియక నోరు పారేసుకుంటూవుంటారు. అలాంటి సందర్భాలలో ఒకొక్కసారి collateral damageలో భాగంగా పక్కనున్నవాళ్ళకి కూడా దెబ్బలు తగులుతుంటాయి. గాయలవుతాయి. అలా దెబ్బలు తిన్నవాళ్లని, గాయపడ్డవారిని చూస్తూనే వున్నాను.
గాయపడ్డ వాళ్ళ చర్మం మందాన్ని బట్టి, వారి మనసుకి బాధని భరించే శక్తిని బట్టి ‘హర్టు’ అవుతుంటారు. విషయం పూర్తిగా ఆకళింపు చేసుకోకుండా, నేపధ్యమూ, వివరమూ తెలియకుండా దారినపోయే దానయ్యలూ, దానమ్మలూ కూడ రాళ్ళు విసురుతారు!
వెనక్కి తిరిగి రాళ్ళు విసిరినవాళ్ళకి పబ్లిక్‌గా జవాబిచ్చే అవకాశం వున్నా, అది తమని దుర్గంధపూరితమైన మురికికూపంలోకి లాగుతుందని తెలిసి స్పందించకుండా పక్కకు తప్పుకుని వెళ్ళిపోవడం అత్యున్నతమైన మార్గమని తెలిసిన వాళ్ళు కొందరుంటారు. వీళ్ళు ఈ ఫేసుబుక్ లోకం ఏమనుకున్నా ఫరవాలేదనుకుంటారు! After all Facebook is not the only world! ఎందుకంటే తాము తప్పు చెయ్యలేదని వారికి స్పష్టంగా తెలుసు.
దాదాపు పది పదిహేనేళ్ళుగా ఈ ఫేసుబుక్‌లో అనేకమైన సందర్భాలలో అనేక మంది వ్యక్తులను, వారి వ్యక్టిత్వాలను, ప్రవర్తనను చూస్తూవస్తున్నాను. ఇటీవల రెండు సంఘటనలు చూసిన తరువాత చూసింది, విన్నది, అర్ధం చేసుకున్నది, స్పందించింది ఇక చాలు అనిపించింది.
అందులో ఒకటి ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినది. ఇద్దరూ విజ్ఞులే. తమ తమ రంగాలలో నిష్ణాతులు. తమ విద్వత్తుతో, జీవితానుభవంతో సమాజానికి తమ తోచినంతమేరకు సహాయ సహకారాలు అందిస్తున్నవారే! వాళ్ళిద్దరి మధ్య ‘బ్లాకు’!
మరో సందర్భంలో కూడా అలాంటిదే.
ఇంత చిన్న జీవితంలో కాలి మడమలు కూడ తడపలేని లోతున్న ఈ ఫేస్‌బుక్ ‘స్నేహ సముద్రం’లో వ్యక్తిగతంగా పరిచయంలేని (ఆఫ్ ది గ్రిడ్) ‘స్నేహా’లలో comments ని out of context కి twist చేసి తమకు అనుకూలంగా convoluted arguments చేసి దానితో ఆగక బురదజల్లుడు, దూషణలు, బ్లాకులు. అవసరమా?
మరొక సందర్భంలో అకారణంగా ద్వేషాన్ని పెంచుకోవడం! చిన్న పిల్లలా అంటే కాదు! తల్లులు, తండ్రులుగా వృత్తిపరంగా బాధ్యతలు, విధులూ నిర్వహిస్తున్నవారే! అపోహలకి, అపార్ధాలకి దారి తీసిన విషయాలను కూర్చుని సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకోగలిగిన వివేకవంతులే(?) కారేమో మరి!
ఈ పోస్ట్ కూడా అనవసరం అనుకున్నాను కాని ఇది off the grid, వ్యక్తిగతంగా నన్ను తెలిసిన దేశ విదేశాలలోవున్న మిత్రులకి తెలియజేయడం కోసం చెప్పాల్సి వస్తోంది. నేను ఇక్కడ కనపడటంలేదని అనుకోవద్దు. నాతో వ్యక్తిగత పరిచయం వున్నవారందరి వద్ద నా contact coordinates వుంటాయి కాబట్టి టచ్‌లో వుందాం. కుదిరినప్పుడు ఒక కప్పుటీ తో ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు వీలున్నప్పుడు కలుద్దాం.
BTW, ఇక్కడ నా అకౌంట్‌ని ప్రస్తుతానికి డిలీట్ గాని డీఆక్టివేట్‌గాని చెయ్యడం లేదు. వేదిక కార్యక్రమం ప్రకటనలుంటాయిగా!
Note: This Facebook post was made public disabling the comments on 15 Dec 2023.
మీ టూ
స్క్రీన్ బీ – త్రీ లోకి ప్రవేశించాడు జిష్ణు. షో అయిపోయినట్టుంది. ఖాళీగా ఉంది థియేటర్. తనకి దగ్గిర్లో కిందపడిఉన్న ఖాళీ ‘లేస్’ కవర్‌ని తీసేస్తున్న క్లీనింగ్ స్టాఫ్‌ని ఉద్దేశించి “నెక్స్ట్ షోకి ఇంకా ఎంత టైముంది?” అని అతను అడిగితే “టెన్ మినిట్స్” అని జవాబిచ్చింది ఆమె. అతను “థాంక్స్” అని గొణుగుతూ వెనక్కి తిరిగి ఫోయర్ ( థిఏటర్ ఆవరణ) లోకి నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్ళాడు.
డోర్స్‌కి రెండువైపులా గోడలకి ఆనించి పొడుగ్గా సోఫాసెట్‌లు ఉన్నవి. వాటికి ఎదురుగా ఫోయర్‌లోనే అక్కడక్కడ డిస్‌ప్లే విండోస్. వాటితో పాటే రిలీజ్ కాబొయ్యే కొత్త సినిమాల పోస్టర్లు, ఫొటో కార్డ్‌లు.
కుడి చేతివైపు సోఫాలో, ఆ చివర గోడకి ఆనుకుని ఒక యువతి కూర్చునుంది. ఆమె కాళ్ళు తన ముందున్న యువకుడి ఒడిలో ఉన్నాయి. వాళ్ళు తమదైన మరో ప్రపంచంలో ఉన్నారు.
జిష్ణు చిరాకుగా ఎడం వైపుకి తల తిప్పాడు.
ఎడం చేతి వైపు సోఫా వరుసలో అటు చివరగా ఒంటరిగా కూర్చుని ఉన్నాడు అతను. లౌడ్ కలర్స్ తో ఉన్న చెక్‌డ్ షర్ట్. స్లిమ్ ఫిట్ డార్క్ బ్లూ కలర్ జీన్స్‌లోకి టక్ చేసుకున్నాడు. లెదర్ బెల్ట్ కొంచెం బిగించినట్టున్నాడు. అయినా పొట్ట బెల్ట్ మీదుగా కొంచెం కిందకి జారి కనపడుతున్నది. కుడి కాలు తొడ మీద, ఎడం కాలేసుకుని కూర్చున్నతను కాస్త తీక్షణంగాను ప్రపంచాన్ని మరిచిపోయి మరీ చూస్తున్నాడు. రెప్పవెయ్యకుండా. అతను చూస్తున్నవైపే జిష్ణు తన దృష్టిని జారించాడు.
అక్కడ చూడ ముచ్చటగా ఉన్న జంట. వారితో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు. ఏడెమినిదేళ్ళుండవచ్చు. కొంచెం ఊరిన బుగ్గలతో, ఎర్ర్రని పెదాలతో, నిగ నిగ లాడుతూ ఆరోగ్యంగా ఉన్నాడు. బ్లేజింగ్ రెడ్ కలర్ టీ. కొంచెం టైట్‌గానే ఉన్నట్టుంది. ఛాతికి అతుకున్నట్టు ఉంది. అది వైట్ కలర్ షార్ట్స్ లోకి టక్ఇన్ చేసుంది. షార్ట్స్ కూడా టైట్‌గా ఉన్నట్టున్నాయి. పిర్రలకి అతుక్కుని లోపలి అండర్‌వేర్ కూడా కనపడి కనపడకుండా కనపడుతోంది. బొద్దుగా, క్యూట్‌గా కూడా ఉన్నాడు. ఆ పక్కనే ఉన్న ‘జస్టిస్ లీగ్’ సినిమా పోస్టర్ వాడిని ఆకర్షించినట్టుంది. 3డి సినిమా పోస్టర్ అది. వాడు అటు తిరిగి దాని దగ్గిరకు వెళ్ళాడు. ఈ లోపు ఆ బాబుతో ఉన్న ఆమె తనతో ఉన్నతనితో డ్రింక్స్‌కో, ఈటబుల్స్‌కో ఆర్డర్ ఇవ్వమన్నట్టుంది. అతను ఆ ఫోయర్‌లో కుడి చేతి వైపున్న స్టాల్స్ వైపు వెళ్ళాడు.
బాబు పోస్టర్‌ని చూస్తున్నాడు. రెప్ప మూసి తెరిచేటప్పడికి, బ్లూజీన్స్ వ్యక్తి బాబు పక్కనే నిలబడి పోస్టర్‌ని చూస్తూ కనపడ్డాడు. బాబు వైపు తిరిగి ఏదో అన్నాడు. వాడు నవ్వుతూ తల అడ్డంగా తిప్పాడు. అతను బాబు వెనక్కి వెళ్ళాడు. వాడి భుజాల మీద తన చేతులు వేసాడు. బాబు పక్కనే ఉన్న మరో పోస్టర్ దగ్గిరకి వెళ్ళాడు. అతను వాడి భుజాలమీద చేతులు తియ్యలేదు. అలాగే వాడి వెనకే నిలబడి బాబు అడుగులో అడుగువేస్తూ ఫాలో అయ్యాడు. ఇప్పుడు బాబు వెనక్కి ఆనుకుని నడుస్తున్నాడు. బాబు ఎడమ భుజం విదిలించుకున్నాడు. బ్లూ జీన్స్ వాడి భుజాలని వదలలేదు. ఇప్పుడు పూర్తిగా బాబు వెనుకభాగాన్ని బ్లూ జీన్స్ శరీరం ఆక్రమించేసింది. వాళ్ళిదరి మధ్య ఏ మాత్రం ఖాళీ లేదు.
ఇందాక బాబుతో ఉన్నామె ఇప్పుడు మరో పోస్టర్‌ని చూస్తోంది. ఆమెతో వచ్చినతను ఇంకా స్టాల్స్ దగ్గిరే ఉన్నాడు. బాబుని వాళ్ళిద్దరు పట్టించుకున్నట్టు లేరు.
జిష్ణు చూపు ఇప్పుడు ఫోయర్‌లో ఎడం చేతివైపుకి మళ్ళింది. అక్కడున్న ఆ అమ్మాయి ఎదురుగుండా వాల్ డిస్‌ప్లే లో వస్తున్న సినిమా ట్రైలర్ ని చూడడంలో నిమగ్నమై ఉంది.
బ్లూజీన్స్ ఇంకా బాబుని వెనకనుండి గట్టిగా హత్తుకున్నట్టే ఉన్నాడు. బాబు భుజాలు విదిలిస్తున్నాడు. అతని చేతులు వాడి భుజాల మీద బిగుతుగానే ఉన్నాయి. బాబు అసహనంగా కదులుతున్నాడు.
డోర్స్ దగ్గిరున్న జిష్ణు వాళ్ళిద్దరి వైపు కదిలాడు.
బాబు ఈ సారి గట్టిగా విదుల్చుకున్నాడు. బ్లూజీన్సతని చేతులు వాడి భుజం మీద నుంచి జారిపోయినవి. బాబు దాదాపుగా పరిగెత్తుకుంటూ ఆ స్త్రీ దగ్గిరకి వెళ్లిపోయి నడుం చుట్టూ చేతులు వేసేసి మొహాన్ని ఆమె వొడిలోకి దూర్చేసాడు.
జిష్ణు బయలుదేరిన చోటే ఆగిపొయ్యాడు.
బాబు భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఆమె ముందుకి వంగి బాబుకి మాత్రమే వినపడేటట్టుగా ఏదో అడిగింది. బాబు తల విసురుగా విదిలిస్తున్నాడు. బాబు భుజాలు పట్టుకున్న ఆమె కిందకి మోకాళ్ళమీదకి వంగి బాబుని సముదాయిస్తూ మాట్లాడుతోంది. బాబు తల పైకెత్తకుండా ఏదో చెబుతున్నాడు. ఆమె తల తిప్పి అటు ఇటు చూసింది. మళ్ళీ వాడి గెడ్డం పట్టుకుని తలని కొంచెం ఎత్తి వాడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఈ సారి వాడి కళ్ళనిండా నీళ్ళు. బుగ్గలమీద చారికలు కనపడ్డాయి జిష్ణుకి. వాడు కళ్ళు అటు ఇటు తిప్పి ఆ బ్లూ జీన్స్ వ్యక్తి వైపు సారించి ఆవిడతో ఏదో చెప్పాడు.
సరిగ్గా అప్పుడే స్టాల్స్ దగ్గిరున్నతను వెనుతిరిగాడు.
విసురుగా ఆమె లేచి నిలబడి బాబు కుడి చెయ్యి మణికట్టు దగ్గిరపట్టుకుని దాదాపుగా లాక్కుని వెళ్తున్నట్టు, బ్లూజీన్సతని వైపుకి బయలు దేరింది. స్టాల్ దగ్గిర నుండి వెనక్కు తిరిగినతను ఆమె హడావుడిని గమనించి అనుసరించాడు.
ఫోయర్‌కి ఎడం చేతివైపున్న (‘మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’) సినిమా వాల్ పోస్టర్‌ని చూస్తోంది, ఇందాక జిష్ణు చూసిన ఆ అమ్మాయి. పన్నెండు పదమూడేళ్లు ఉంటాయేమో! వైట్ హెయిర్ బాండ్ కింద నుంచి నల్లని పొడుగాటి జుత్తు, భుజాల మీదుగా వీపు మీదకి జారుతోంది. టాప్ టైట్‌గా ఉంది. వికసిస్తున్న (రానున్న) టీన్స్‌ని దాచలేక పోతోంది ఆ టాప్. రెడ్ కలర్ బెల్ట్ ఉన్న బ్లూ కలర్ జీన్స్‌కి ఆ టాప్‌కి మధ్య మెరుస్తూ కనపడుతున్న నడుం. రివెటెడ్ బటన్స్‌తో ఉన్న హిప్ హగ్గింగ్ జీన్స్ అవి!
బ్లూ కలర్ జీన్సతని దృష్టి ఆ అమ్మాయి మీద పడినట్టుంది. నెమ్మదిగా ఆ అమ్మాయి పక్కకి చేరుకున్నాడు. నవ్వుతూ ఆ అమ్మాయితో ఏదో అంటూ చనువుగా ఆమె ఎడం భుజం మీద తన ఎడం చెయ్యి వేసాడు.
జిష్ణు దృష్టిలో పడిందది. జిష్ణు దూకుడుగా వాళ్ళిదరి వైపుకి అడుగులు వేసాడు.
ఫెటేలన్న మోతతో ఆ ఫోయర్ దద్దరిల్లింది. ఒక్కసారిగా అందరు ఉలికి పడ్డారు. అప్పటికే బ్లూజీన్సతని దగ్గిరకి బాబు, ఆమె, అతనూ చేరారు. జిష్ణు కూడా.
జిష్ణుని చూడగానే ఒక్క గెంతులో అతని పక్కకి చేరి అతని కుడి చేతిని పెనవేసుకుంది ఆ వైట్ టాప్, బ్లూజీన్స్ అమ్మాయి, “మామయ్యా!” అంటూ ఏడుపు గొంతుతో. తన ఎడం చేత్తో ఆ అమ్మాయిని దగ్గిరకు తీసుకున్నాడు జిష్ణు.
ఎర్రగా కందిపోయిన ఎడమ చెంపని రుద్దుకుంటూ బ్లూజీన్స్ అక్కడి నుంచి పరుగువేగంతో ఫోయర్ లోని లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా, మెట్ల మీదుగా దూకుతూ కిందకి వెళ్లిపోయ్యాడు. బాబుతో ఉన్నావిడ ఆవేశంతో రొప్పుతోంది. ఆతను ఆమెను చూస్తూ నిలబడిపొయ్యాడు. కళ్ళు నులుముకుంటున్నాడు బాబు.
Footnote
దాదాపు ఐదేళ్ళక్రితం ఖదీర్‌బాబు, కె సురేశ్ , తాము 2018 నిర్వహించిన రైటర్స్‌మీట్‌లో పాల్గొన్న వారు రాసిన కథలను, కొత్తకథ 2018 మకుటంతో వెలువరించిన సంకలనంలో ప్రచురించిన కథ ఈ #మీటు. సంకలనంలో వచ్చిన కథలని కనీసం రెండు సంవత్సరాలు బయట ఎక్కడ ప్రచురించరాదని వారి సూచనని మన్నించి ఇప్పటివరకు దీనిని ప్రచురించలేదు. కథలలో సత్తా వుంటే పాఠకులు గుర్తుపెట్టుకుని, వెతుక్కుని మరీ చదువుతారనే బలమైన అభిప్రాయం మరొక కారణం. వెతుక్కోవడానికి ముందు వుండాలిగా అందుకని ఈ అంతర్జాలంలో ఈ బ్లాగులో...
౨ - ఈ కథ పూర్వాపరాలకు చెందిన మరికొంత అదనపు సమాచారం ఈ లంకె లో చదువుకోవచ్చు.
౩ - దిగువనున్నది కొత్తకథ2018 సంకలనాన్ని, 13 మే 12018 ఉదయం, తెలుగు విశ్వవిద్యాలయం, భాగ్యనగరంలో ఆవిష్కరించిన సందర్భలో, నా హితోభిలాషి, కవి దేవిప్రియగారి నుండి ప్రతి అందుకుంటున్నప్పటిది.
కొత్త కథ 2018 ప్రతులు ఇక్కడ దొరుకుతాయిః
ధర: రూ 149.00 మాత్రమే (24 కథలు)
♣ నవోదయ బుక్ హౌజ్
3-3-865,Opp Arya Samaj mandir, Kachiguda,Hyderabad, Pin Code: 500027,
Telangana,India. Mob:+91-9000413413, Office:040-24652387
Email:[email protected]
Web: www.TeluguBooks.in