మొన్న డిట్రాయిట్లో జరిగిన తెలుగు లిటరరి క్లబ్ వారు ఘనంగా, కుటుంబరావు, శ్రీ శ్రీ, గోపిచంద్ గార్ల శత జయంతి సభని జరుపుకున్నారు.
స్వాతంత్ర్య స్వరూపం – రచన “శారద”
ఒకప్పుడు, ఒక పిల్ల దేశం ఇంకోపెద్దదేశం నించి నానా అవస్థలు పడి స్వతంత్రం సంపాయించింది. ఆ పిల్లదేశంలో ప్రజలు స్వతంత్రం వొచ్చినందుకు గుర్తుగా ఓ స్వతంత్ర విగ్రహం చేయించి రాజధాని నగరంలో ప్రతిష్టించుదామని తమ స్వతంత్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా తమ ప్రజల ఆలోచన బాగానే వుందని ఒప్పుకుని, ఒక శిల్పిని పిలిపించింది. ఆ శిల్పి అఖండమైన కళోపాసకుడు. అదివరకు చాలా విగ్రహాలు చేశాడు. అతను చేసిన విగ్రహాలు జీవకళ వుట్టిపడుతూ ఉండేవి. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఆ శిల్పి ఒక సుముహుర్తంలో, మంచి చలువ రాయితో విగ్రహం చేసేందుకు వుపక్రమించాడు.
స్వతంత్రాన్ని ప్రజలు పోరాడి తెచుకున్నారు గనుక, స్వతంత్ర విగ్రహం, తమ పోరాటాల చరిత్రని ఎల్లప్పుడు జ్ఞప్తిచేస్తో, తమ సుఖవంతమైన స్వతంత్ర భవిష్యత్తును చూపుతూ వుండే ఒక మహా వీరుని విగ్రహంగా చెక్కమని వాళ్ళు శిల్పికి తీర్మానాలు చేసి పంపారు. శిల్పి అలాగేనని ఒక మహావీరుని విగ్రహం చెక్కడం ప్రారంభించాడు.
కాని మొదట్నుంచీ, సామాన్య ప్రజల పోరాటాలు చేసి స్వతంత్రం సంపాయిస్తే తమ ప్రాబల్యం ఎట్టాగు మంటగలుస్తుందని భయపడుతూ వచ్చిన డబ్బు స్వాములు, తమ మీద అధికారం చెలాయిస్తున్న పరాయిదేశం డబ్బు స్వాములతో గుసగుసలూ, వికవికలూ చేసి, అధికారం తమ హస్తగతం చేసుకున్నారు. ఈ డబ్బుస్వాములు, “స్వతంత్ర విగ్రహం” ప్రజలకి నూతనంగా వచ్చిన స్వతంత్ర ప్రభుత్వం యెడ నమ్రత, విదేయతా నేర్పే చిహ్నంగాను, అల్లరి ఆగం చేయకూడదని బోధించే గురువు లాగుండాలి. అందుకని ఆ విగ్రహం ఓ ప్రశాంత తపస్విలాగానో లేక సన్యాసిలాగో ఉండాలి” అని శిల్పిని అజ్ఞాపించారు. శిల్పి “చిత్తం” అని మహావీరుడి విగ్రహం చెక్కినంతవరకు ఆపి, దాన్నే ఓ సన్యాసి రూపంలోకి చెక్కుతున్నాడు.
ఆ దేశంలోని డబ్బుస్వాములల్లోనే ఇంకా కొందరు మహత్ములు, దేశాన్ని, దాని ఆర్ధిక పరిస్థితిని తమ జేబుల్లోను,
భోషాణాల్లోను ఇరికించుకొని వున్నారు. వాళ్ళకి ఈ సలహాలేవి నచ్చలేదు. వాళ్ళందరు కలిసి, “ఆ విగ్రహం, మన విశాలమైన దేశం యొక్క స్వతంత్ర వ్యాపార ప్రతిపత్తిని విస్తరింపజేసేదిగా ఒక గొప్ప ఓడల వర్తకుని రూపంలో వుండాలి” అని ఆ శిల్పికి ఆదేశం పంపారు. శిల్పి ఆ ఆదేశం వెనుక వుండే ఆర్ధిక బలాన్ని వూహించుకుని “అలాగే బాబు” అని తను తయారుచేస్తున్న సన్యాసి విగ్రహాన్నే గొప్ప వ్యాపారస్తుడి విగ్రహంగా మారుస్తున్నాడు.
కాని అసలు ప్రభుత్వంలో వుండే అ ప్రముఖులు ఇవన్నీ పనికిరావని రెండు మూడు సబ్ కమిటీలు, నాలుగైదు విచారణ సంఘాలువేసి, వాటి రిపోర్టులన్ని కలేసి చదివి, వాటనన్నిట్నీ తీసేసిం తర్వాత “ ‘స్వతంత్ర విగ్రహం’ ప్రభుత్వం ఎడ భక్తినీ, నమ్రతని నేర్పేట్టు వుండవలసిందే కాని అది సన్యాసి లాగు ప్రజలకి నీరసం బోధించేట్టు ఉండరాదు. అది ప్రజలకి ప్రభుత్వం యెడల భయము, భక్తిని, శ్రద్దా, గౌరవాల్ని నేర్పే సాయుధ సైనికుడి విగ్రహంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజమైన ప్రజాశాంతిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రభుత్వ సైన్యమే. అదీ కాకుండా ప్రజలలో కొందరు ఎల్లప్పుడూ ఆకలని, గుడ్డలని అల్లర్లు చేస్తో ఆర్ధిక సమానత్వం అని లేనిపోని ప్రచారం చేస్తో, ప్రజల ప్రశాంత జీవితాల్నీ భగ్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి స్వతంత్ర ప్రభుత్వంలోనైనా వాళ్ళ ఆటలు సాగవని హెచ్చరికలుతెల్పుతూ ‘స్వతంత్ర విగ్రహం’ ప్రభుత్వ సాయుధ సైనికుడి రూపంలో వుండాలి,” అని బహిరంగ ప్రకటన ఒకటి చేసి శిల్పికి హుకుం ఇచ్చారు, సైనికుని విగ్రహం చెక్కమని. “అట్లానే,” అని శిల్పి తను ఇదివరలో చెక్కుతున్న వర్తకుడి రూపాన్నే సాయుధ సైనికుని రూపంలోకి మార్చుతున్నాడు. ప్రభుత్వం సలహాని డబ్బు స్వాములు హర్షించారు. వ్యాపారస్తులు అహ్వానించారు. అటూ ఇటూ మాట్లాడే పెద్దమనుషులు అమోదించారు. ప్రజలు మాత్రం ప్రభుత్వ ధోరణికి ముక్కుమీద వేలేసుకున్నారు.
అయితే, శిల్పి మాత్రం ఎడతెరిపి లేకుండా శ్రమించి స్వాతంత్ర విగ్రహాన్ని తయారుచేసాడు. ఒక సుదినమున స్వాతంత్ర విగ్రహాన్ని రాజధాని నగరంలో ప్రతిష్టించడానికి తీసుకువచ్చారు. అదివరకే తయారైన శిలావేదికపై స్వాతంత్ర విగ్రహాన్ని వుంచారు. ప్రభుత్వ అధ్యక్షుడు, స్వతంత్రాన్ని గూర్చి ఒక మహోపన్యాసం జేసింతర్వాత స్వతంత్ర విగ్రహానికి వున్న ముఖమల్ గుడ్డని తొలగించాడు. స్వాతంత్ర విగ్రహం ఆధునిక ఆయుధాలతో సాక్షాత్కరించింది. భయంకరమైన దయ్యం రూపంలో.
(జూలై 1948, విశాలాంధ్ర )
సూచిక: ఇటీవలి కాలం లో “శారద” సాహిత్యం పునర్ముద్రణ కి నోచుకోలేదు. “శారద” సాహిత్యాన్ని మీకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కధని ఇక్కడ ప్రచురించడం జరిగింది. శ్రీ అరి సీతారామయ్య గారు ఇచ్చిన వివరాలతో, తెనాలి లోని శ్రీ వర్ధనరావు గారిని (English Lecturer (Retd), V.S.R College, Tenali) రక్తస్పర్శ (“శారద” కధల సంకలనం) గురించి ఆరాతీస్తే వారికి కూడా వివరాలు తెలియవని అన్నారు. చాలా మంది మిత్రులని, సాహిత్యాభిమానులని, ప్రచురణకర్తలని కూడ సంప్రదించడం జరిగింది. సంప్రదించిన వారు ఎవరూ కూడ పూర్తి వివరాలు ఇవ్వలేక పొయ్యారు. ప్రజాసాహితి మాసపత్రికలో (ఆగస్టు 2009) ఈ కధ ని ప్రచురించారు. సంపాదకులు శ్రీ కొత్తపల్లి రవిబాబు గారి అనుమతితో ఈ కధని ఇక్కడ ఉంచడం జరిగింది. దీనిమీద నాకు ఎటువంటి హక్కులు లేవు.
తాజా కలంః ఇటివలే శారద నటరాజన్ వారసుల గురించి సాక్షి దినపత్రిక (గుంటూరు) వార్తని ప్రచురించింది. వివరాలు ఇక్కడ.
తెలుగు విలిలోః శారద
డెట్రాయిట్‍లో త్రిపురనేని గోపీచంద్ సాహితి సదస్సు
కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, త్రిపురనేని గోపీచంద్
శత జయంతి సందర్భంగా
సెప్టెంబరు 26,27, ౨౦౦౯ (శని, ఆదివారలలో)
సాహితి సభలు నిర్వహిస్తున్నారన్నది మీకు తెలిసేఉంటుంది.
*
శనివారం 26 న శతజయంతి ఉత్సవ ప్రారంభం
ఆరోజు సభలో
త్రిపురనేని గోపీచంద్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు,
తెలుగు సాహిత్యం – గోపీచంద్
అనే అంశాల మీద వారి కుమారుడు
త్రిపురనేని సాయిచంద్ ప్రసంగం ఉంటుంది.
తదుపరి
గోపీచంద్ (లఘుచిత్రం) ప్రదర్శన
(GOPICHAND [A humble colossus]).
*
మరుసటి రోజు, 27 సెప్టెంబరు, ఆదివారం ఉదయం
వేలూరి వెంకటేశ్వర రావు గారు
సమన్వయకర్తగా
త్రిపురనేని గోపిచంద్ సాహిత్యం మీద ఒక సాహితీ సదస్సు ఏర్పాటు చేసారు.
అందులో:
వేలూరి వెంకటేశ్వరరావు
గోపీచంద్ కథలు మీద
కొత్త ఝాన్సీలక్ష్మి
పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా గురించి
ఏపూరి భక్త
గోపీచంద్ జీవితంలో తాత్విక పరిణామం మీద
వేములపల్లి రాఘవేంద్రచౌదరి
చీకటి గదులు మీద
ప్రసంగిస్తారు.
ప్రతి ప్రసంగం తరువాత పది ని||లు చర్చాగోష్టి ఉంటుంది.
//
id = 20806;
// ]]>
అమెరికాలో గోపీచంద్ సాహిత్యం
1659 Squirrel Valley Drive,
Bloomfiel Hills, MI 48304 USA
మరిన్ని వివరాలకు
Email: [email protected]
//
id = 20806;
// ]]>
అమెరికాలో గోపీచంద్ సాహిత్యం

త్రిపురనేని గోపీచంద్ సంపుటాలు వెలువడినవి
Ring Road, Vijayawada,
Andhra pradesh 520008 –


P NO 5, BANJARA HILLS, UBI Colony,
RD NO 3,Banjara Hills,
Hyderabad – 500034
పోన్: +91 (40) 27804626
email: [email protected]
Apsara Road, Vishakhapatnam – 530002
Andhra Pradesh
ఫోన్; +91 (0891) 2561055, 2565995
//
id = 20806;
// ]]>
గోపీచంద్ శతజయంతి ప్రారంభ సభకి ఆహ్వానం
గమనించగలరు.
సాహితీ అభిమానులైన మీకు ఇదే మా అహ్వానం.
హైదదాబాదులోని రవీంద్ర భారతి లో
మంగళవారం, 8 సెప్టెంబరు 2009 న
సాయంత్రం 6.30 కి.
ఆవిష్కరణ కూడా!
మీరు తప్పక రావాలి!
కవిరాజు జయంతి రోజున
త్రిపురనేని రామస్వామి 66 వర్ధంతి సభ (తెనాలిలో)
రచయిత – రచన
రచయిత – రచన
జీవితం లో పాల్గొనే ప్రతి వ్యక్తి, ప్రజల్లో సజీవంగా మెలగుతున్న ప్రతి మనిషీ రచయిత కాగలడా? కాడు ! మానవ సమాజం తప్పటడుగులు వేస్తున్నప్పుడు ప్రతి కళాసృష్టి లోనూ సమాజం అంతా పాల్గొనేది. అప్పుడు రచయితకీ ప్రజలకి భేదం లేదు. అలాంటి పరిస్థితుల్లో రచయిత ” స్వయం ప్రతిభ ” అనే ప్రశ్నే లేనేలేదు. అప్పుడు “ఉత్పత్తి : కొనుగోలు” లకి భేదం ఉండేది కాదు ఆర్ధికరంగం లో, అదే సాహిత్యంలో కూడా ప్రతిబింబించేది.
అంచేతనే ఆనాటి సాహిత్యంలో – అదంతా జానపద సాహిత్యమని జమకట్టవచ్చు– చైతన్యం సున్నాగా కనిపించింది; వ్యక్తిత్వం గూడా కనిపించదు. ఐనా ఆ సాహిత్యం లో ‘ఎకాగ్రత‘ అద్భుతంగా ఉండేది. ప్రకృతికి మనిషికీ జరిగే పోరాటంలోని పరస్పర వైరుధ్యాలు అన్నీ యెత్తిచూపుతూ మానవ యత్నానికి చక్కటి దోహదం యిచ్చేది.
కాని –
ఇప్పుడో! రచయితకీ, పఠితకి ప్రత్యక్ష సంబంధం లేదు. రచయిత తాను రచించింది మార్కెట్‌లోకి పంపుతాడు. చదివేవాడు కొనుక్కుని తనగదిలో చదువుకుంటాడు. ఇప్పుడు గూడా మనిషికి ప్రకృతికీ పోరాటం జరుగుతునే ఉంటుంది. రచయిత ఇప్పుడు కూడా మనిషి కొమ్మే కాయాలి. పూర్వం జరిగిన ఫలితమే – ఏకాగ్రత – ఇప్పుడు కూడా వ్యక్తులుగా విడిపోయిన పాఠకుల్లో కలగాలి. ఇందుకు పూర్వం సంఘానికి రచయితకి వున్న ప్రత్యక్ష సంబంధమూ , రచనలో ఉన్న సమిష్టి యత్నమూ, పాల్గొనే సమిష్టి ప్రజల ‘ స్వార్ధం ‘ లో ఉన్న సామ్యము యెక్కువగా సహకరించేవి. ఇదివరకున్న ఆ ప్రత్యక్ష సంబంధం , సమిష్తి యత్నాల స్థానాన్ని, రచయిత ‘ స్వయం ప్రతిభ ‘ స్వంతం చేసుకోవాలి. ఎవరన్నా ఇదే ‘ఇంస్పిరేషన్‘ అన్నా అభ్యంతరం లేదు; అలా అనే వాళ్ళు ‘ఇంస్పిరేషన్‘ కి ‘ పర్స్పిరేషన్ ‘ కి బేధం తెలిసినవాళ్ళయితే.
ఆదిమ సాహిత్యానికి పునాదులుగా నిలబడ్డ మంత్రశక్తి, జ్యోతిషమూ, ఆవేశమూ, దూరదృష్టీ, సమిష్టీ స్వార్ధమూ, పూలకం లాంటి ఆవేశమూ, యీనాటి రచయితకి అవసరమే! కాని ఆనాటి మానవుడు ‘ ఆదర్శం ‘ ప్రధానంగా ‘కుక్షింభరత్వం‘ మాత్రమే! అయితే మానవుడు పురోగమించుతూ అనేక విలువల్ని, గుణపాఠాల్ని నేర్చుకున్నాడు. ఈ అనుభవాలకీ, విలువలకీ, రచయిత వారసుడు కావాలి. కాగా ఆ రచయిత శాస్త్రజ్ఞానమూ, హేతువాదమూ, గతి తార్కిక భౌతిక జ్ఞానమూ, వర్తమానానికి భవిష్యత్తుకీ ఉన్న సంబంధ పరిచయమూ మూర్తీభవించాలీ. ప్రజలకీ నాయకుడికీ ఉన్న భేదమే రచయితలో వివిధ రూపాల్లో కనిపించుంతుంది.
ఒక సందర్భంలో ఇబ్సన్ అంటాడు; ప్రశ్నలడగటమ్వరకే నా కర్తవ్యం, వాటికి సమాధానాలు చెప్పడం నా పని గాదు. సమస్య్లని పరిష్కరించడం నా వల్ల అయ్యే పని గాదు. మనుష్యుల్ని, వాళ్ళకుండే విభిన్న గుణగణాల్ని, వీటన్నటిని నిర్ణయించే ఆధునిక సాంఘిక సంబంధాల్నీ, సిధ్హాంతాల్నీ చూపించగలిగితే నేను కృతకృత్యుణ్ణయినట్టే.
ఇంతగా నియమిత ఆదర్శాన్ని ముందుంచుకున్న ఇబ్సన్ ప్రముఖ రచయితల్లో ఒకడిగా పరిగణించబడ్డాడు. కాని యీ నాటికి రచయితలూ అదే ఆదర్శంతో రచనా యత్నానికి పూనుకుంటే పప్పులో కాలువేసిన వాళ్ళవుతారు.
ఎంచేతనంటే మనిషి ఇబ్సన్ ని వదిలిపెట్టి చాలా ముందుకి వచ్చాడు. ఇబ్సన్ రోజుల్లో గందరగోళాల బురదలో మినుకు మినుకు మంటు కనిపించిన సామాజిక సత్యాలూ, సిద్ధాంతాలూ, ఇవ్వాళ్ళ కాళ్ళుని నిలబడ్డాయి. ఇబ్సన్ రోజుల్లో మనిషి సాంఘిక సంబంధాలని మరింత గందరగోళం చేసుకుంటూ పురోగమించేవాడు. ఆ గందరగోళాలన్ని ఈ రోజు మురుగు కంపు కొడ్తున్నాయి. ఆధునిక రచయితలు కూడా ఈ గందరగోళం వెనుకవున్న సంఘాన్ని, సాంఘిక సంబంధాన్ని చూడలేక ఈ గందరగోళం సంఘమని, సాంఘిక సంబంధమనీ, వాస్తవమనీ మసక కళ్ళతో చూసి విశ్వసిస్తున్నారు. ఆధునిక రచయిత, అబివృద్ధయిన పరిణామ సిధ్హాంతాన్ని, హేతువాదాన్ని, గతితార్కిక భౌతికవాదాన్నీ కళ్ళజోడుగా పెట్టుకుని, చేయూతగా తీసుకుని, మసకలోనుమంచి, పొగలోనుంచి బయటపడగలగాలి.
ఇలా బయటపడుతున్న రచయితల్లో పరిఢవిల్లే ప్రకాశం, ఆ పొగను, మసకను భేదిస్తాయి. భేదించుతున్న ప్రకాశం మరింత పదునెక్కుతుంది. ఈ ప్రకాశం మృగ్యమైనప్పుడు రచయితకున్న ఇన్స్పిరేషన్ పెర్స్పిరేషన్‌గా తయారవుతుంది. ఇన్స్పిరేషన్ “వేడి” లాంటిది, అనుకుంటే ఆ రాగితీగలో ప్రవహించే సర్వమానవాభ్యుదయ వాంచ్హ అనే విద్యుచక్తి తనలోవున్న “వేడి” నంతటిని సేకరించుకుని అవిరామంగా తిరుగుతూవుంటుంది. తనకంటే బలంగావున్న ప్రకాశంతో కుస్తిపట్టేటప్పుడు అందరికీ ఉపయోగించే వెలుతురు పుట్టుకొస్తుంది. ఇదీ రచయితలలో కనిపించాల్సిన “స్వయంప్రతిభ…”
రచయితలకు పునాదులుగా వుండవల్సిన ఈ “ప్రతిభ” వస్తు నిర్ణయంలోను, సంవిధాన యత్నంలోనూ, కళ్ళకు కట్ట్టినట్లు కనిపించుతుంది. ఇందులో ఎక్కడ లోపమున్న అది రచనలో ఎక్కడో ఒక చోట పొక్కుతుంది.
మేం బోలు మనుషులం
మేం గడ్డిబొమ్మలం
మా వంటి నిండా వరిగడ్డే
మేమేం చెయ్యం? మేమేం చెయ్యగలం?
మేం గుసగులం; మేం గునుస్తాం
మా గుసగుసల్లో, మా గునుకుల్లో వేగం లేదు:
వేడీ లేదు; అర్ధం సున్నా!
మా గొంతుల్లో పొడి
మా పదాలు పగిలిన అద్దాల మీద నడిచే యెలుకల చతుష్పాదాలు
మా పదాలు యెండుగడ్డి కదిపేగాలి పిల్లల కెరటాలు!
ఇలాంటి బోలు మనుష్యులు, గడ్డిబొమ్మలు కావల్సినంత మంది వున్నారు.వీళ్ళు పెద్ద పులుల్తో “సత్యాగ్రహాలు” చేయించగలరు.”స్వర్గానికి నిచ్చేనలు” వేయగలరు. వీళ్ళే సర్వమానవ నాశన కారణాలయ్యే “తుపాను” లు వీయించుతారు. కారణం?
స్వయంప్రతిభ సాధనంవల్ల కలిగేదని వీళ్ళు నమ్మరు. యీ ప్రతిభ, పుట్టుకతోనే కలుగుతుంది కాబట్టి ప్రపంచం యీ ప్రతిభని యీఇనాటికాక్కుంటే రేపటికైనా గుర్తిస్తుందని నమ్ముతారేమో! వీరికున్న ప్రతిభ విలక్షణమైనది. సాధన విపరీతమైనది. వర్తమానాన్ని అర్ధం చేసుకోలేక, భవిష్యత్తువైపు తేరిపారా చూడలేక గతంలో తలదూర్చి బ్రతుకుతుంటారు.
పుట్టుకకి ప్రతిభకి సాపత్యం లేదని, సంబంధం ఉండదని యెవరూ అనరు. కాని అంతటితోనే అది అంతమవుతుందంటే అభ్యంతరం వస్తుంది.
సాహిత్యం కూడ ఒక వృత్తి లాంటిదే. మిగతా వృత్తుల విలువలకి, యీ విలువలకి వ్యత్యాసముంది. నిజమే. కాని మిగతా వృత్తులలో, నైపుణ్యం సంపాదించటం ఎంత కష్టమో, యీ వృత్తిలో ఆరి తేరెందుక్కుడా అంత దీక్షా, సాధనా అవసరమే. ఈ సాధన గడిచిన చరిత్రని, భాషాబేషజాన్ని పరిశీలించి, సొంతం చేసుకున్నంత మాత్రాన సిద్దించేది కాదు. చరిత్ర వెనుకవున్న సత్యాన్ని, భాషకున్న చరిత్రనీ, ప్రయోజనాన్ని గూడా గుర్తించగలగాలి. ఇదంతా సమకూడాలంటే యెడతెగని కృషి వుండాలి.
ఇందుకు రచయితలందరు కృషికున్న విలువని గుర్తించాలి; కృషి అంటే వున్న చిన్నచూపుని సంస్కరించుకోవాలి. రచయిత కూడ కొన్ని హద్దులో కార్మికుడేనన్న విషయాన్ని మరిచిపోగూడదు. అప్పుడే కష్టజీవుల అండని నిలబడటంలో వున్న గౌరవం అర్ధమౌతుంది. అప్పుడు గాని ఈట్స్ అన్న మాటల్లోని యదార్ధం అవగతం కాదు; ” You must learn your trade.”