ఇక్కడ దొరుకుతుంది పుస్తకం!

List of books tores where you can obtain a copy Atluri PItcheswara Rao Kathalu
చావెరుగని ‘‘చిరంజీవి’’!

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు ఒక్క సారి చదివిచూడండి! కనీసం, “చిరంజీవి” అనే ఉదాత్తమయిన వ్యక్తిత్వం కలిగిన నావికుడి గురించి రాసిన “బ్రతకడం తెలియనివాడు” అనే ఒక్క కథానిక చదవండిచాలు!
పిచ్చేశ్వరరావు – ‘‘జీవచ్ఛవాలు’’

మెదడుకు పదును పెట్టే మంచి కథలను కోరుకునే పాఠకులు పిచ్చేశ్వరరావును మరిచిపోలేరనుకుంటాను. తెలుగు కథ ఏపుగా ఎదిగి మంచి పువ్వులు పూస్తున్న తొలిరోజులలో ఎర్రటి మందార మాలను అందంగా గుదిగుచ్చిన జాతి కథకుడు పిచ్చేశ్వరరావు. అతని సమకాలీన కథలను చాలామంది పోల్చి చూస్తే పిచ్చేశ్వరరావు వ్రాసిన కథలు బహుకొద్ది మాత్రమే.
ఈ కథలు… చదవటమొక అవసరం

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు (నాలుగవ పునర్ముద్రణ ) సంపుటి మీద నరేష్‌కుమార్ సూఫీ అభిప్రాయం ఇది.
బాటసారి – వెండితెర నవల – అట్లూరి పిచ్హేశ్వరరావు

తెలుగువారికి వెండితెర నవలలను పరిచయం చేసింది అట్లూరి పిఛ్హేశ్వర రావు. ఆ కోవలోనే ‘బాటసారి’ చలనచిత్రాన్ని వెండితెర నవలగా తెలుగువారికి అందించింది అట్లూరి పిఛ్హేస్వర రావు. శతావధాని .’కవిరాజు’ త్రిపురనేని రామస్వామి కి అల్లుడు.
…అమెరికా పుస్తకాల మీద బ్రహ్మాండమైన దాడిని ప్రారంభించింది!
‘అక్కడాహుతౌతున్నది వట్టి కాగితాల కట్టలు కాదు. మానవజాతి కష్టించి ఆర్జించుకున్న సంస్కృతీ, సంస్కార, సంప్రదాయాలు దగ్ధమౌతున్నాయి. మానవజాతి సంపాదించుకున్న మధుర స్మృతులన్నీ మసైపోతున్నాయి’ అని అక్రోశిస్తాడు ధియోడాటస్.
‘నువ్వేమి చెయ్యకుండా కూర్చుంటే రాబొయ్యే తరాలవారు నిన్ను పుస్తకాల విలువ కూడా తెలుసుకోలేని మూర్ఖుడిగాను, ఆటవిక సైనికుడిగాను జమ కడతారు సుమా!’ అని సీజర్ని హెచ్చరిస్తాడు. అట్లూరి పిచ్చేశ్వరా రావు ‘విన్నవి – కన్నవి’ నుంచి.
ఇంద్రజాలికుడు
మళ్ళీ నాకు ఏవో కబుర్లు చెప్పాడు. తల నిమిరాడు. బుగ్గలు నిమిరాడు. కళ్ళు తుడిచాడు. నా స్నేహితుడి లాగా బుజ్జగించాడు.
వెండి తెర నవలలు – అట్లూరి పిచ్చేశ్వరరావు
సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు. వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేషన్‌లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు. అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద చిత్రాలే గతి. ఒకటికి పది సార్లు చూడటానికి అవకాశం లేని వారు, ఎన్టీవోడి డవిలాగు, ఏ ఎన్ ఆర్ ఎస్‌వీఆర్ […]
చిటికెన వేలు పట్టుకుని…
చిటికెన వేలు పట్టుకుని అప్పుడు నడిచాను, తెల్లవారు ఝామున. భుజం భుజం రాసుకుంటూ నడిచి ఉంటే ఎంత బాగుండేదో, మిట్ట మధ్యాహ్నం ,చెట్ల నీడ కింద. నా అరిచేతితో ఆయన అరిచేతిని పట్టుకుని, ఆ పార్కులోనో , మెరినా ఒడ్డునో అడుగులో అడుగు వేసుకుంటూ, నడుస్తూంటే ఎంత హాయిగా ఉండేదో, ఈ రోజు సాయంత్రనా ! ** ఉండి వుంటే 90 లోకి అడుగుపెట్టసివుండేవారు. వెళ్ళిపోయి నలభై ఎనిమిది ఏళ్ళు, ఈ పూటకి.
అన్వర్ కి ధాంక్స్‌తో..
విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్, ఐపోయ్యిందా? డిక్లేర్ చేసేద్దామా”? అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది. మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.