“కలర్స్” (Colors)అంటే అందరికి ఇష్ట మే! అలాగని అన్నిసందర్భాలలోను కలర్స్ పనికి రావు.
అవసరం లేని చోట కలర్స్ అన్నామనుకోండి, “రంగు పడుద్ది”.
రెజ్యుమె ఆకర్షణీయంగా ఉండాలని, ప్రత్యేకంగా కనపడాలని రంగులు వాడవద్దు,
అని నేను వ్రాసిన దాన్ని చదివి కొంత మంది, “ఐతే మరి గ్రాఫిక్స్, అనిమేషన్,
విజుయలైజేషన్ ఉద్యోగాలకి ఎలాంటి రెజ్యుమేలని పంపాలి?” అని అడిగారు.
దానికి జవాబుగా ఈ టపా.(Post (పోస్ట్). Blog బ్లాగ్లో వ్యాసాన్ని పోస్ట్ గా వ్యవహరిస్తారు).
రెజ్యుమె లో మీరు ఆ ఉద్యోగానికి కావల్సిన అర్హతలన్ని తో పాటు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్స్ ఏవైనా నేర్చుకుని ఉంటే వాటిని గురించి తెలియజేవచ్చు. అలాగని రెజ్యుమెని
రంగులతో నింపడమో, బొమ్మలని రెజ్యుమెలో ఇన్సర్ట్ (Insert) చేసి పంపరాదు.
కొన్ని కారణాలు:
- కొన్ని వెబ్మైల్స్ (web mails) పెద్ద ఫైల్స్ ని అనుమతించవు.
- అవతల అందుకునేవారి కంప్యూటర్లో సాఫ్ట్వేర్ మీరు పంపుతున్న ఫైల్ని అంగీకరించకపోవచ్చు. (ఉదా: ఔట్లుక్ (Outlook), థండర్బర్డ్ (Thunderbird) ,యుడోరా (Eudora) వగైరాలు.
- అలాగే, అవతల వారు వాడుతున్న ఆంటీవైరస్ ప్రోగ్రామ్ (Anti virus program) మీ ఫైల్ని నిరోధించవచ్చు.
మరి అలాంటి పరిస్థితులలో మనం చేయగలిగినది ఒకటి ఉంది. ఆన్లైన్ ఫొటో హొస్టింగ్ సర్విసెస్ (online photo hosting services) వారి సేవలను వాడుకోవచ్చు. చాల మట్టుకు అవన్ని కూడ ఉచితంగా లభించే సదుపాయాలే!
ఉదాహరణకి: యాహూ వారి ఫ్లికర్ (Yahoo – Flickr), గూగుల్ వారి పికాస (Google – Picasa) , మైక్రోసాఫ్ట్ వారి విండోస్ లైవ్ ఫోటోస్ (Microsoft Windows Live Photos) ని వాడుకోవచ్చు. ఇవన్ని కూడా ఉచితమే! మీ ఫొటోలని వాటికి అప్లోడ్ (upload) చేసుకుని, ఆ బొమ్మలకిచ్చే లింక్ (link) ని మీ రెజ్యుమే లో ఇవ్వచ్చు. ఈ పద్ధతి అందరికి అమోదయోగ్యమైనది.
మరొక పద్దతి:
రెజ్యుమె కి అటాచ్మెంట్ (attachment)గా వాటిని జతచేసి పంపండి. మరి పెద్ద ఫైల్స్(files) ని పంపొద్దు. తప్పదు అనుకుంటే, వాటిని జిప్ (zip) చేసి పంపండి. ఉచితంగా లభించే ఒక చక్కని జిప్ సాఫ్ట్వేర్ 7 ZIP కోసం ఇక్కడ క్లిక్ చేయ్యండి. ఇది తెలుగులో కూడ లభ్యం. (ఇ తెలుగు వారి సౌజన్యం)
మీ కోసం వెతుకుతూ ఉంటే, ఈ ఆన్లైన్ రెజ్యుమే ఒకటి కనపడింది. ఇది మరొక పద్ధతి. ఇది మైకెల్ ఆండర్సన్ అనే డిజైనర్, తయారుచేసిన రంగుల రెజ్యుమె. ఇందాక నేను అన్నట్టు ఒక రంగుల రెజ్యుమె ని తయారు చేసుకుని ఆన్లైన్లో పెట్టేసుకున్నారు.
అవసరం ఐనవారికి చక్కగా లింక్ ఇస్తే సరిపోతుందన్నమాట. భలే గుంది కదూ, ఈ ఆలోచన !
graphic anaga emiti danini ela vadali
దృశ్యరూపంలో చూపించేది ఏదైనా గాఫిక్స్ అని పిలుచుకోవచ్చు. ఉదహరణకి ఒక ఫోటో, కుంచెతో వేసిన ఒక బొమ్మ, ఒక పవర్ పాయింట్ ప్రెజంటేషన్, ఒక రేఖాచిత్రం, ఒక మాప్,ఒక సంజ్ఞ, ఒక సంకేతం, వివరణలలో వాడే ఒక బొమ్మ. గాఫిక్స్ కళాత్మం అయ్యివుండవచ్చు. లేదా ఒక పరిశ్రమ, ఒక ప్రక్రియకి చెందినదై ఉండవచ్చు. ఒక శాస్త్రవేత్త పరిశోధనకి చెందిన వివరాలు తెలిపే పట్టిక కావచ్చు. ఈ గ్రాఫిక్స్ అనేవి ఎటువంటి ఉపరితలంమీద వేసినవైనా కావచ్చు. ఉదాహరణకి, బియ్యపు గింజ మీద ఒక బొమ్మ, అలగే ఒక సైకత శిల్పం (ఇసుకతో చేసిన బొమ్మ), రాయిని చెక్కి ఒక కళాకారుడు శిల్పాన్ని సృష్టించవచ్చు. దుస్తుల మీద వాడే కలంకారి ముద్రణలో వచ్చే రకరకాల డిజైన్లు, కొండపల్లి బొమ్మలు, వీటన్నింటిని గాఫిక్ అని చెప్పుకోవచ్చు.