ఉద్యోగం కోసం అటు నుండి నరుక్కు రావడం గురించి తెలుసా?

మీ  ముందే ఉంది.  మీరు ప్రతి రోజు వెడుతున్న ఆ రోడ్డులోనే ఉంది.  మీరు  వెళ్ళే గుడిలోకూడా ఉంది. మీరు  రోజు వెళ్ళే భోజనం చేసే మెస్సులో ఉంది ఉద్యోగం.

కుక్కపిల్లలా తోకాడిస్తూ మీ వెంటే..

మీరే  దాని వంక చూడటం లేదు.  దానిని పట్టించుకోవడం లేదు.  పిల్లిని చంకలొ పెట్టుకుని ఊరంత వెదికినట్టు, ఒళ్ళొ ఉన్న ఉద్యోగవకాశాన్ని వదిలేసి దేశం అంతా

తిరుగుతా నంటున్నారు.

మీముందు కూర్చుని మీ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూస్తున్న మీరు  గుర్తించడంలేదు.

ఆ మధ్య వచ్చిన హచ్ పప్పిలా అది మిమ్మల్ని వెంటాడుతోంది.  తోకాడిస్తూ మరి వెంటాడుతుంది.  మీరే దాన్ని పట్టించుకోకుండా ఇంకేటోచూస్తున్నారు.

అబ్బా అపండి, మీ సోది..అసలు విషయం చెప్పండి అంటారా?

“Wanted” కాలం కనబడటం లేదా?

మీ జిమైల్‌ / యాహూ మైల్‌లోనూ కనపడటం లేదా?

గుడిలో ఆ కార్పరేట్ ష్టై‌లో టీ వేసుకున్న పెద్దమనిషిని ఆయన సంస్థలో ఉద్యోగవకాశాలున్నాయా అని అడగలేక పొయ్యారా?

ఫ్రంట్ ఆఫీసులో “సెక్రటరి” గా చేస్తున్న పక్కి ఫ్లాట్ “ఆంటీ” ని అడిగారా? మెస్సులో ఎదురుగా సాంబారుని జుర్రుకుంటున్న ఆయన్ని అడిగారా?

మొదట్లోనే అనుకున్నాము కదా, మనకి తెలియని ఖాళీలు చాలా పూర్తి ఐపోతున్నావని?  మరి వాటిని అందుకోవడాఅనికి ఏం చేసారు?

సరే, మనవైపు నుంచి నరుక్కుంటూ వెడితే ఉద్యోగం ఉందని తెలుస్తుంది..కాని అటువైపు నుండి నరుక్కు రావడం గురించి తెలుసా?

అదేమి పెద్ద బ్రహ్మ విద్యేమి కాదు. మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధి అని వారికి తెలియజేయాలి కదా?  లేకపోతే వారికి ఎలా తెలుస్తుంది, మీకు ఉద్యోగం కావాలని?

ఆలూ లేదు చూలు లేదు, కొడుకుపేరు సోమలింగం

ఏం ఉద్యోగం తెలవదు, ఎక్కడో తెలవదు, ఎందుకో తెలియదు, ఇక అప్పుడే రెజ్యుమే అంటారేంటి అని అనొద్దు!  6వ క్లాస్ నుండి , స్పెషల్ క్లాసుల్లో,

10 Google Interview Questions

టెక్నికల్ స్కూల్స్ లో ఐ.ఐ.టిల కోసం, మెడిసిన్ కోసం మీ వాళ్ళు మిమ్మల్ని కష్టపడి, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా చదివించారు.

ఈ  రోజు ఈ ఉద్యోగం నాకు ఎంత జీతం ఇస్తుంది, నేను కోరుకున్నంత జీతం ఇస్తుందా అని అలోచించుకునేటప్పుడు, మనకి ఎలాంటి ఉద్యోగం

ఐతే మంచిది అన్న కనీసపు అవగాహన లేకుండా ఎలా ఉద్యోగం కోసం వెతుకుతారు?  ఎక్కడని వెతుకుతారు?

అది గమనించండి.  ముందు

మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీ కావల్సినంత జీతం ఇచ్చే ఉద్యోగ లక్షణాలను గుర్తించండి! తరువాత మిగతా విషయాలు ఆలోచిద్దాం!

అది తెలిస్తే, ఈబ్లాగు చదవతూ కాలాన్ని వృధా చేసుకోవడం ఎందుకంటారా?  ఐతే ఆగండి, మళ్ళీ టపాలో అవేంటో చెబుతాను.

ఈలోపు బోరు కొట్టకుండా ఈ పది గూగుల్ ఇంటర్యూ ప్రశ్నలు చదువుకోండి!

రంగుల రెజ్యుమె

“కలర్స్” (Colors)అంటే అందరికి ఇష్ట మే! అలాగని అన్నిసందర్భాలలోను కలర్స్ పనికి రావు.

అవసరం లేని చోట కలర్స్ అన్నామనుకోండి, “రంగు పడుద్ది”.

ఇది మైఖెల్ తయారు చేసిన ఒక ఆన్‌లైన్ రంగుల రెజ్యుమె. Michael Anderson - a designer, photographer, illustrator and writer originally from West Virginia

రెజ్యుమె ఆకర్షణీయంగా ఉండాలని, ప్రత్యేకంగా కనపడాలని రంగులు వాడవద్దు,

అని నేను వ్రాసిన దాన్ని చదివి కొంత మంది, “ఐతే మరి గ్రాఫిక్స్, అనిమేషన్,

విజుయలైజేషన్ ఉద్యోగాలకి ఎలాంటి రెజ్యుమేలని పంపాలి?” అని అడిగారు.

దానికి జవాబుగా ఈ టపా.(Post (పోస్ట్).  Blog బ్లాగ్‌లో వ్యాసాన్ని పోస్ట్ గా వ్యవహరిస్తారు).

రెజ్యుమె లో మీరు ఆ ఉద్యోగానికి కావల్సిన అర్హతలన్ని తో పాటు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్స్ ఏవైనా నేర్చుకుని ఉంటే వాటిని గురించి తెలియజేవచ్చు.  అలాగని రెజ్యుమెని

రంగులతో నింపడమో, బొమ్మలని రెజ్యుమెలో ఇన్సర్ట్ (Insert) చేసి పంపరాదు.

కొన్ని కారణాలు:

  • కొన్ని వెబ్‌మైల్స్ (web mails) పెద్ద ఫైల్స్ ని అనుమతించవు.
  • అవతల అందుకునేవారి కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్ మీరు పంపుతున్న ఫైల్‌ని అంగీకరించకపోవచ్చు. (ఉదా: ఔట్‌లుక్ (Outlook), థండర్‌బర్డ్ (Thunderbird) ,యుడోరా (Eudora) వగైరాలు.
  • అలాగే, అవతల వారు వాడుతున్న ఆంటీ‌వైరస్ ప్రోగ్రామ్ (Anti virus program) మీ ఫైల్‌ని నిరోధించవచ్చు.

మరి అలాంటి పరిస్థితులలో మనం చేయగలిగినది ఒకటి ఉంది.  ఆన్‌లైన్ ఫొటో హొస్టింగ్ సర్విసెస్ (online photo hosting services) వారి సేవలను వాడుకోవచ్చు.  చాల మట్టుకు అవన్ని కూడ ఉచితంగా లభించే సదుపాయాలే!

ఉదాహరణకి: యాహూ వారి ఫ్లికర్ (Yahoo – Flickr), గూగుల్ వారి పికాస (Google – Picasa) , మైక్రోసాఫ్ట్ వారి విండోస్ లైవ్ ఫోటోస్ (Microsoft Windows Live Photos) ని వాడుకోవచ్చు.  ఇవన్ని కూడా ఉచితమే!  మీ ఫొటోలని వాటికి అప్‌లోడ్ (upload) చేసుకుని, ఆ బొమ్మలకిచ్చే లింక్ (link) ని మీ రెజ్యుమే లో ఇవ్వచ్చు.  ఈ పద్ధతి అందరికి అమోదయోగ్యమైనది.

మరొక పద్దతి:

రెజ్యుమె కి అటాచ్‌మెంట్ (attachment)గా వాటిని జతచేసి పంపండి.  మరి పెద్ద ఫైల్స్(files) ని పంపొద్దు.  తప్పదు  అనుకుంటే, వాటిని జిప్ (zip) చేసి పంపండి. ఉచితంగా లభించే ఒక చక్కని జిప్ సాఫ్ట్‌వేర్ 7 ZIP కోసం ఇక్కడ క్లిక్ చేయ్యండి. ఇది తెలుగులో కూడ లభ్యం.  (ఇ తెలుగు వారి సౌజన్యం)

మీ కోసం వెతుకుతూ ఉంటే, ఈ ఆన్‌లైన్ రెజ్యుమే ఒకటి కనపడింది.  ఇది మరొక పద్ధతి. ఇది మైకెల్ ఆండర్సన్ అనే డిజైనర్, తయారుచేసిన రంగుల రెజ్యుమె.  ఇందాక నేను అన్నట్టు  ఒక రంగుల రెజ్యుమె ని తయారు చేసుకుని ఆన్‌లైన్‌లో పెట్టేసుకున్నారు.

అవసరం ఐనవారికి చక్కగా లింక్ ఇస్తే సరిపోతుందన్నమాట. భలే గుంది కదూ, ఈ ఆలోచన !

షరా మామూలే: ఏదైనా అడగాలనుకుంటే క్రింద వ్యాఖ్యల ద్వారా తెలియజేయండి.  తెలుగులో కూడా వ్రాయవచ్చు అక్కడ.  తప్పకుండా జవాబిస్తాను.

ఆ ఉద్యోగాలు లేవు! మళ్ళీ రావు!

నా చిన్నప్పుడు సెలవులకి మా ఊరు వెళ్ళాను. బహుశ ఉహ తెలిసిన తరువాత అదే అనుకుంటా మొదటి సారి నేను వెళ్ళడం.  మహానగరం నుండి కుగ్రామానికి వెళ్ళడం కదా, బంధువులందరూ చాలా జాగ్రత్తగా, ప్రేమతో

Cheese Cotton Shirt Design
చీజ్ కాటన్ షర్ట్

చూసుకునేవారు.   ఏదో పండగ వచ్చింది.  సంక్రాంతి అనుకుంట.  మా మావయ్య నాకు అప్పుడు ఒక జత బట్టలు కొన్నాడు.  ఆ ఊళ్ళో బట్టల కొట్టు లేదండి!  నాలుగు మైళ్ళు (mile) అవతల ఉన్న ఊళ్ళో ఒక దుకాణంలో మా మావయ్యకి ఖాతా ఉండేది.  ఆది కోసం నావి ఒక జత బట్టలు తీసుకుని ఒక ఉదయం పూట బయలుదేరి నాలుగు మైళ్ళూ నడుచుకుంటూ ఆ ఊరు వెళ్ళాడు.  ఆ కొట్టులో టైలర్ (Tailor) దగ్గిరే బట్టలు కుట్టించడం.  పాపం మా మావయ్య!  మళ్ళీ సాయంత్రం అయ్యింది, వెనక్కి వచ్చేటప్పడికి.  ఒక వారంలో వచ్చినవి లెండి ఆ బట్టలు.  టెర్లిన్ (Terylene)  షర్ట్ ( చొక్క, అంగి), టెర్లిన్ నిక్కర్ (knickers = లాగు, మొకాలు దాటని పంట్లాము).  అవి వేసుకుంటే గాలి అడేది కాదు.  చమట పట్టినప్పుడు ఒంటికి అతుక్కుని పొయ్యేవి ఆ బట్టలు.  చాలా చిరాకు వేసేది.  కాని వాళ్ళు ప్రేమతో కుట్టించినవి కదా!  అందుకని భరించేవాడిని. అదొక అనుభవం.

తరువాతి రోజులలో టెర్రి కాటన్ (Terry cotton) గుడ్డ అందుబాటులోకి వచ్చింది.   అవి బాగానే ఉండేవి. ఆ బట్టలు కూడా టైలర్ కి ఇచ్చి కుట్టిం‌చుకోవడమే.  మంచి టైలర్ కోసం వెతుక్కుంటూ బట్టలు కుట్టించుకోవడాఅనికి ఊళ్ళూ తిరిగే వారు.  అప్పటి ఆంధ్ర ప్రదేశ్ లో, హీరో ఎన్.టి.ఆర్ కి కాస్ట్యూమ్ (Costumes)  డిజైన్ చేసిన యాక్స్ (Yax) టైలర్స్ ఒక వెలుగు వెలిగారు.  యాక్స్ టైలర్స్ బ్రాంచెస్ ఉండేవి.  అంత గొప్పగా నడిచింది వాళ్ళ వ్యాపారం.

తరువాత రెడి మెడ్ దుస్తులు ఊపందుకున్నవి.  గురు షర్ట్లు, చీజ్ కాటన్ (cheese cotton) షర్ట్స్ వచ్చినవి.  వాటితో పాటు డెనిం (denim)పాంట్స్ (pants).  1980 ఆ ప్రాంతల్లో చెన్నై, ఢిల్లీ, ముంబై మహానగరాలలో పేవ్‌మెంట్ మీద గుట్టలుగా పోసి అమ్మేవారు.  కావల్సినవి ఏరుకుని కొనుక్కునేవాళ్ళం.  మనకి ఇక టైలర్స్‌తో పని తగ్గింది.  అన్ని రెడి మేడ్స్.  కుమార్ షర్ట్‌ ఒకవైపు, చెర్మా‌స్ ఒకవైపు మొదలయ్యారు.  పది రూపాయలకి షర్ట్.  పాతిక రూపాయలకి పాంట్.  అప్పటికి ఇంకా ఐ.టి (IT, Information Technology) ఉద్యోగాల  జోరు మొదలవ్వ లేదు.  కాబట్టి ఎంతో కొంత తక్కువ ధరలో కొనుక్కునేవారు సామాన్య ప్రజానీకం.

జెన్ట్స్ (gents) టైలర్స్ కి ప్రాముఖ్యత బాగా  తగ్గిపోయింది.  ముఖ్యంగా యువతకి. రెడిమేడ్‌లో అన్ని దొరికేస్తున్నవి.  కావల్సిన రంగులు, డిజైన్‌లు,  కావల్సిన బట్ట, ఖరీదుకి తగ్గ నాణ్యత.  ఈ రోజున స్త్రీలు కూడా అదే దోవన వెడుతున్నారు తమ దుస్తుల ఎంపిక విషయంలో.  🙂

ఉద్యోగాలు అంతే!  ఒకప్పుడు ఉద్యోగం కావాలనుకుంటే, ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ (employment exchange) కి వెళ్ళాలి.  ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుని సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది.  ఆ రోజుల్లో ఉద్యోగం లో చేరితే, దాదాపు జీవితాంతం అదే సంస్థ లో చెయ్యడం అదే సంస్థ లో రిటైర్ (retire) అవ్వడం.  ప్రైవేట్ (private) సంస్థలైతే టైపిస్ట్ (typist)తో  అప్ప్లికేషన్ (application) టైప్ (type)చేయించుకోవడం, అప్లై (apply) చేసుకోవడం.  రికమండేషన్ (recommendation) కోసం వెతుక్కోవడం.

ఒకప్పుడు మంచి టైలర్ కోసం వెతుక్కునేవాళ్ళు.  ఈ రోజున ఒక మంచి రెడిమేడ్ (ready made) బట్టల షాప్ (shop) కోసం వెతుక్కుంటున్నారు. మంచి బ్రాండ్ (brand) కోసం వెతుక్కుంటున్నారు.  మీకు కావల్సిన రంగు, డిజైన్ (design), సైజ్ (size)లలో బట్టలు లభ్యం అవుతున్నవి.  ఇవి కాక డిజైనర్ లెబిల్స్ (designer labels) ఉండనే ఉన్నవి.  జేబులో డబ్బుండాలే కాని పాతికవేలకి ఒక పాంటు (pant)కొనుక్కోవచ్చు.  లక్ష రూపాయలకి ఒక చీర కొనుక్కోవచ్చు.

ఈ రోజు చదువులు అంతే! ఉద్యోగాల కోసం చదవడమే!  ఏడవ తరగతి నుండి ఐ.ఐ.టి (I I T)కి కోచింగ్ (coaching). మంచి ఉద్యోగాలు. షర్ట్‌లు మార్చినంత సులభంగా ఉద్యోగాలు మారడం.  ఆదాయం కొద్ది బ్రాండెడ్ డ్రెస్‌లు (branded dress).  ఉద్యోగాలు అంతే! టెర్లిన్ ఉద్యోగాలు.  ఆ రోజుల్లో ఇష్టం ఉన్నా లేకున్నా చెయ్యడమే! ఒకప్పుడు టైపిస్ట్ లేని ఆఫీసుండేది కాదు.  తరువాత ఎల‌క్ట్రిక్ టైప్‌రైటర్ (Electric Typewriter), ఎల‌క్ట్రానిక్ టైప్‌రైటర్‌గా  (Electronic Typewriter) రూపాంతరం చెందింది.  ఈ రోజు మీరే ఒక టైపిస్ట్ ఐపొయ్యారు.  కంప్యూటర్‌ మీద.  టైపు చెయ్యకుండా కుదరదు.  ఈ రోజున వంట పాత్రలకి కళాయి వేసేవారు కనపడుతున్నారా మీకు?  లేని ఉద్యోగం కోసం వెతికితే లాభం ఏమిటి?  ఉన్న ఉద్యోగాల గురించి ఆలోచించాలి గాని. మితృడు కృష్ణప్రసాద్ అంటున్నట్టు, జీవనానికి ఉద్యోగాలు లేవు అనడం సబబు కాదు.  ఉద్యోగాలున్నవి.  మనం చెయ్యగలమా, లేదా అన్నదే ప్రశ్న!

మరి ఆ ఉద్యోగాలేక్కడున్నవా?

మళ్ళీ టపాలో చెబుతా!

* గతంలో ఉన్న ఉద్యోగాలు / వృత్తులు, ఇప్పుడు లేనివి మీకు తెలిసినవి ఏవైనా ఉన్నవా?  మీకు గుర్తుంటే క్రింద వ్యాఖ్యల ద్వారా తెలియజేయండి.  తెలియని వాళ్ళకి తెలుసుకునే అవకాశం కలిగించిన వారవుతారు.  వాటిని గురించి వివరంగా తరువాత మాట్లాడుకుందాం!

ఆ ఉద్యోగానికి తగిన అభ్యర్ధి ఎవరు?

రిటైర్‌మెంట్ (retirement)ద్వారా ఖాళీ ఐన ఉద్యోగాన్ని నింపడానికి యాజమాన్యాలు కొన్ని పద్దతులని అవలంబించుతాయి.

ఒకటి. సంస్థలోనే ఉన్న ఉద్యోగస్తులలోనే అర్హతలున్నవారిని ఎంచుకోవడం.  వారికి ప్రస్తుతం ఖాళీ ఐన పదవి మీద

Continue reading “ఆ ఉద్యోగానికి తగిన అభ్యర్ధి ఎవరు?”

What are Life Skills?

ఆంధ్రజ్యోతి దిన పత్రికలో , దిక్సూచి అనుబంధంలో సెప్టెంబరు 19న ప్రచురించబడ్డ వ్యాసం ఇది.  లైఫ్ స్కిల్ అవసరం గురించి నా కెరీర్ కార్నర్  వ్యాస పరంపరలో వెలువడినది.  క్రింది బొమ్మ మీద క్లిక్ చెయ్యండి. చదువుకోవడానికి సులువుగా ఉంటుంది.

Telugu film artis Benerjee
చలన చిత్ర నటుడు – బెనర్జి

This is my way of sayingthank you‘ to Benerjee, a good friend of mine who had given me immense support when it was needed the most. This is also to tell the whole world ‘yes, he considers me to be one of his good friends”.