చదవదగ్గ తొలి వంద తెలుగు పుస్తకాలు

దాదాపుగా గత దశాబ్దం అంటే పదేళ్ళుగా నేను తెలుగు సాహిత్యం – పాఠకులు గురించి నేను ఒక ప్రతిపాదన చేస్తూవచ్చాను. ఆ ప్రతిపాదన మిత్రులతో పంచుకుంటూనే వున్నాను. అలాగే సాంఘిక మాధ్యమాలు అంటే Social Media. ప్రస్తుతం ఒక తరం విరివిగా వాడుతున్న ఫేస్‌బుక్, కొంతకాలం క్రితం ప్రాచుర్యంలో వున్న బ్లాగ్ ప్రపంచం, గూగుల్ వారి ఆర్కుట్, గుగుల్ ప్లస్ లాంటి వాటిల్లో నా అభిప్రాయాన్ని తెలియపరుస్తునే వచ్చాను.

అదేమిటంటే సాంఘిక ప్రసారమాధ్యమాలలో మాత్రమే తెలుగు సాహిత్య పిపాసువులు అంటే కవులు, రచయితలు, కళాకారులున్నారన్నది భ్రమ! తెలుగు సాంఘిక మాధ్యమాల వెలుపల విస్తారమైన ప్రపంచం వున్నదన్నీనూ, అందులో తెలుగులో రాసే రచయితలు, కవులు వగైరా మాత్రమే కాక తెలుగు పాఠకులు వున్నారన్నీను అని నా ప్రతిపాదన! అంతే కాదు ఆ ఫేస్‌బుక్‌లో యువత లేదని కూదా చెప్పాను. ఆ యువత తెలుగు చదివే ఆసక్తి వున్న యువత అని, తెలుగులో రాయాలని కోరిక ఆ యువతకి వున్నదని కూడా చెప్పాను.

కాకపోతే ఆ యువత‌కి తెలుగు సాహిత్యం చదవడం ఎక్కడ మొదలు పెట్టాలని తెలియదు. వారిలో కొంత మందితో మాట్లాడినప్పుడు వారు నన్ను అడిగారు కూడా.
“సార్, తెలుగు సాహిత్యం చదవాలంటే ఏ పుస్తకంతో మొదలు పెట్టాలి?
దానికి అనేక మంది అనేక సలాహాలు ఇస్తూ వచ్చారు. ఇస్తున్నారు కూడా. ఆ జాబితాల వివరాలు భవిష్యత్తులో ఇక్కడే మీకు ఇస్తాను.

ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వాలని నేను ఎప్పట్నుంచో ఇవ్వాలని అనుకుంటూ వచ్చాను. అది ఇప్పటి ఈ రోజుకు కి కుదిరింది. ప్రస్తుతం దాదాపు పాతికేళ్ళ (పాతిక = 25, + ఏళ్ళు = సంవత్సరాలు = పాతికేళ్ళు) క్రితం కొంతమంది తెలుగు సాహిత్యాభిమానులు తయారు చేసిన జాబితా ఇది. దీనిని ఈమాట అనే తెలుగు జాల పత్రిక (interent / web / magazine) లో ప్రచురించారు. ఈ జాబితాను ప్రచురించినవారు వారి మాటల్లోనే ఇలా అన్నారు:

లోకో భిన్న రుచిః! ఈ జాబితా మీకు సమగ్రంగా తోచకపోవచ్చు, అసంపూర్ణంగా అనిపించవచ్చు; మీ గొప్ప 100 పుస్తకాల జాబితా వేరే పుస్తకాలతో నిండి ఉండవచ్చు. ఈ జాబితా వెనుక ఏ రకమైన అధికారిక గుర్తింపు లేదు. ఇది కొంతమంది సాహిత్యాభిమానుల సమిష్టి ఎన్నిక. కొందరు పాఠకులతో ఈ పుస్తకాలను మొదటిసారో, మరోసారో చదివించటమే ఈ ఎన్నిక ఉద్దేశం.”

కాబట్టి మీకు మీ మిత్రులు, బంధువులు కాని ఇతరులు సూచించిన పుస్తకాలు గురించి కాని వివరాలు వుండకపోవచ్చు. దానికి కారణం మొదట్లోనే చెప్పినట్టు ఈ జాబితా దాదాపు 25 సంవత్సరాల క్రితంది. కాబట్టి ఇందులో సమకాలీన (contemporary) అంటే 1999 తరువాత వెలువడ్డ సాహిత్యం, పుస్తకాలు, కవితలు, కథలు, నవలలు, నాటకాలు వగైరా వుండవు.

ఇక ఈ జాబితాల సేకరణలో నాకు తోడ్పడిన మిత్రులు
డా జంపాల చౌదరి, ఏ వి రమణమూర్తి, సి . భాస్కరరావు గారలకు
నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

జాబితలు విడిగా ఇస్తాను. చాలా మంది చాలా జాబితాలు తయారు చేసారు కాని వాటిల్లో కొన్నింటిని నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

సరే, ఇక్కడ ఇందాక ప్రస్తావించిన ఈమాట లో వచ్చిన జాబితా చూడండి. మీకు ఏవైనా సందేహాలుంంటే నాకు ఇక్కడే comment బాక్స్‌లో తెలియజేయండి. నాకు తెలిసినంత మేరకు సందేహాలు తీర్చడానికి ప్రయత్నిస్తాను.

ఇక ఈ జాబితాల సేకరణలో నాకు తోడ్పడిన మిత్రులు డా జంపాల చౌదరి, ఏ వి రమణమూర్తి, సి . భాస్కరరావు గారలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

Note; This post was written keeping in mind the Gen Z who are interested in reading Telugu books.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.