ఇక్కడ దొరుకుతుంది పుస్తకం!

List of books tores where you can obtain a copy Atluri PItcheswara Rao Kathalu
చావెరుగని ‘‘చిరంజీవి’’!

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు ఒక్క సారి చదివిచూడండి! కనీసం, “చిరంజీవి” అనే ఉదాత్తమయిన వ్యక్తిత్వం కలిగిన నావికుడి గురించి రాసిన “బ్రతకడం తెలియనివాడు” అనే ఒక్క కథానిక చదవండిచాలు!
పిచ్చేశ్వరరావు – ‘‘జీవచ్ఛవాలు’’

మెదడుకు పదును పెట్టే మంచి కథలను కోరుకునే పాఠకులు పిచ్చేశ్వరరావును మరిచిపోలేరనుకుంటాను. తెలుగు కథ ఏపుగా ఎదిగి మంచి పువ్వులు పూస్తున్న తొలిరోజులలో ఎర్రటి మందార మాలను అందంగా గుదిగుచ్చిన జాతి కథకుడు పిచ్చేశ్వరరావు. అతని సమకాలీన కథలను చాలామంది పోల్చి చూస్తే పిచ్చేశ్వరరావు వ్రాసిన కథలు బహుకొద్ది మాత్రమే.
ఈ కథలు… చదవటమొక అవసరం

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు (నాలుగవ పునర్ముద్రణ ) సంపుటి మీద నరేష్‌కుమార్ సూఫీ అభిప్రాయం ఇది.
క్లుప్తంగా ఇడ్లి, వడ, సాంబార్ కధ ఇది!

కొంత మంది పాఠకులకి నేను వ్రాసిన ఇడ్లి, వడ, సాంబారు కధ పూర్తిగా అర్ధం కాలేదన్నారు. ఈ టపా వారికోసం. ఈ క్రింద ఇఛ్హినవి సారంగ లో వఛ్హిన కధ ఇడ్లి, వడ,సాంబార్ లోని వాక్యాలు. ఇవన్ని అంతర్గతంగా కధాంశానికి సంబంధించిన సూచినలిస్తాయి. వీటన్నింటిని ఒక క్రమంలో చదువుకుంటే కధ అర్ధం కావాలి. ఈ వాక్యాలు చదివిన తరువాత, కధని మళ్ళీ ఒకసారి చదువుకోండి. దానికి లంకె ఈ కింది వాక్యాల తరువాత చివర ఇఛ్హాను. – […]
కథ 2014 … మరో ముగ్గురు కథకులు

కథ 2014, కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది. ఒక పరంపరగా ప్రతి సంవత్సరం వెలువడుతునే ఉంది. కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో. కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ. ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి. ఆ అధ్యక్షుల వారిది తెనాలి. పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.
పగలని గోళీ

కుడిచేతి చూపుడు వేలుని ఎడమచేతి చూపుడు వేలుతో పూర్తిగా వెనక్కి లాగి, ఆరు జానలవతలున్న నీలం రంగు గోళీ మీదకి తన పసుపురంగు గోళీని గురిచూస్తున్నా, వాడి చెవులిక్కడ లేవు. అక్క ఫియట్ కారు హార్న్ చప్పుడు వినడం కోసం ఎదురు చూస్తున్నవి. వాడి దృష్టి నీలం రంగు గోళీ మీదున్నా, పక్కన చెవిపోగు గాడి చెమట కంపు నాసికల ద్వారా అందుతున్నా, అక్క పూసుకునే కునేగా సెంటుతో వాడి బుర్ర నిండిపోయింది. వాడి దృష్టికిప్పుడు అక్క కనబడుతోంది! వాడి కుడి భుజం మీద చెలికాడి అరిచేయి స్పర్శ వాడికి అక్క నునువెచ్చని స్పర్శనే గుర్తుచేస్తోంది.
మొన్న సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా హైద్రాబాద్‌కి వచ్చాడు

The Loneliness of Being Rajesh Khanna DARK STAR – ఇంగ్లిష్ పుస్తకం.
దాదాపు దశాబ్దం క్రితం వరకు దక్షిణాది చలనచిత్రాలకు కేంద్రంగా ఉండేది మద్రాసు. ఉత్తరాది వాళ్ళు కూడ మద్రాసులో సినిమా నిర్మాణాలు చేసుకునేవారు. వాళ్ళకి పంపిణీ కార్యాలయాలు కూడ అక్కడ ఉండేవి. ఆంద్రప్రదేశ్ వారికి కూడ మద్రాసే అప్పుడు…
హాతీ మేరే సాథి లో రాజేష్ ఖన్నాకి “ఉద్యోగం కావాలి, ఉందా?” అని అడిగితే, “లేదు పో,” పొమ్మనడం కూడ ఉంది. పాండిబజార్లో రాణి బుక్ సెంటర్, దాని ఎదురుగుండా ఉండే రాజేశ్వరి ఎలక్ట్రికల్స్‌లోను, హమీదియా హోటల్ & బేకరి లో కూడా ఉద్యోగాలు లేవని ఈ కాకా / జతిన్ ఖన్నా ని తరిమేస్తారు.
ఆ హాతీ మేరే సాథి సినిమా గురించి, రాజేష్ ఖన్నా గురించి పుస్తకం రాసిన రచయిత ఈ #hydlitfestival కి వస్తున్నాడు కదా అని వెళ్ళాను.
* రాజేష్ ఖన్నా ఎవరితో పడుకున్నాడు?
* ఏ నిర్మాతని ఏడిపించాడు?
* రోజుకుని ఎన్ని పెగ్గులు తాగేవాడు?
* పేక ఆడేవాడా?
పుస్తకం విడుదలైన అతి తక్కువ సమయంలోనే మలి ముద్రణకి నోచుకుంది. భారతీయ చలనచిత్ర రంగంలోని తొలి “సూపర్ స్టార్” మీద వెలివడిన పుస్తకం ఇది.
1950 ప్రాంతలలో పుట్టిన వాళ్ళకి హిందీ సినిమా అభిమానులకు, ‘సూపర్ స్టార్’ రాజేష్ ఖన్నా ఫాన్‌లకు గొప్ప బహుమతి ఈ పుస్తకం.
దిద్దుబాటలు – దిద్దుబాటుకు ముందు కథలు 92
దిద్దుబాటు తొలి తెలుగు కథ అని అనుకున్నాం. కాదు ఇంకా ముందే కథలున్నాయి అని అన్నారు. సరే, దిద్దిబాటు కన్నా ముందు కథల సంగతి తేల్చుకుందాం అని అనుకున్నారు, వి వి న మూర్తి గారు.
మరి కథ కి నిర్వచనం!
ప్ర: ఏది కథ?
జ: వ్రాసిన రచయిత గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులు గాని కథ అనడం.
ఇంకా మన దృష్టికి రాని కథలు ఉండవచ్చా?
జ: భవిష్యత్తులో బయటపడవచ్చు.
ప్ర: తొలి కథ?
జ: చిలక గురించిన సంభాషణ 1879 జనవరి జనవినోదిని
ప్ర: తొలి కధా సంపుటం?
జ: చిత్రమంజరి 1902 మే. రచయిత రాయసం వెంకటశివుడు.
అయ్యా, ఇంకా చాలా వివరాలున్నవి. ప్రస్తుతానికి ఈ వివరాలు ఈ సేకరణ కి మాత్రమే పరిమితం. ఇందాక అన్నట్టు.. మరి కొన్ని వివరాలు భవిష్యత్తులో బయటపడవచ్చు. ముందు పుస్తకం కొని చదువుకోండి. మళ్ళీ దొరుకుతుందో లేదో!
కతల గంప – స వెం రమేశ్
నేను పరిగెత్తి తెరువులోకి పొయినాను. ఒక అవ్వ పెద్దగంపను తలమీద
మోస్తా “కతలమ్మా కతలూ…” అని అరస్తా వస్తుండాది. నేను గబ గబ ఆ
అవ్వకు ఎదురుపోయినాను. నన్ను చూసి నిలిసి “అబయా, కతలు కావాల్నా.
మంచి మంచి క్తలుండాయి. అరవళ్ళిసూరవళ్ళి కత, నల్లతంగ కత,
కాంతరాజు కత, కాత్తవరాయని కత, కమ్మపణితి కత, ఈడిగసత్తెమ్మ కత,
కాటమరాజు కత, మదురవీరుడి కత, మాచాలమ్మ కత, రేణిగుంట రామిరెడ్డి
కత… ఇంకా చానా చానా కతలుండాయి. అరపడి వడ్లకు ఒక కత, పడి
తైదులకు ఒక కత. కావాలంటే అవ్వనడిగి వడ్లో తైదులో తేపో కొడుకా”
అనింది ఆ అవ్వ.