కథ 2014 కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది. ఈ పాతిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వెలువడింది. కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో. కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ. ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి. ఆ అధ్యక్షుల వారిది తెనాలి. పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.
ఇక ఆ ముగ్గురు కథకులు ఎవరో చూద్దాం.
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి తొలి కథ సీతన్న తాట. ఇది 1962 లో ఆంధ్రప్రభ వారు ప్రచురించారు. వీరి ఇతర కథలు, నవలలు గురించిన వివరాలు కథానిలయంలో
ఇక్కడ తెలుసుకోవచ్చు.
వాల్ పోస్టర్, సర్మా, గారడీ, రామేశ్వరం కాకులు ఇదివరలో ఆయా కథ వార్షిక సంకలనాలలో ప్రచురించారు.
వీటిలో వేదిక లో రామేశ్వరం కాకులు మీద చర్చ జరిగింది. ఆ కధని ఇక్కడ చదువుకోవచ్చు.
అద్దేపల్లి ప్రభు, కాకినాడ వాస్తవ్యులు. వీరి తొలి కధ విలువలు 1984 లో అరుణతార మాస పత్రికలో వెలువడింది. వారి ఇతర సాహిత్యం కథానిలయంలో ఇక్కడ చూడండి.
1986 స్వాతి వార పత్రికలో ప్రచురించిన మూషికార్జునీయం కథకులు పి వి. సునీల్ కుమార్. లఘుచిత్రం గా వెలుగుచూసిన కథ దెయ్యం వీరిదే. వేదిక లో వీరి తోక దెయ్యం చెప్పిన డిసిప్లి మీద 2015 మే నెలలో చర్చించుకున్నారు. ఆ కథని ఇక్కడ చదువుకోవచ్చు.
వీరు ముగ్గురూ, నిన్న ముగ్గురు కధకులు మాత్రమే కాదు. ఇంకా ఉన్నారండి. వారిలో మరో ముగ్గురు కధకులని మీకు రేఫు పరిచయం చేస్తాను.
రానున్న ఆదివారం, సెప్టెంబరు 20, 2015 న తెనాలిలో జరగనున్న ఆవిష్కరణ సభకి ఇదిగో ఆహ్వానం.
2 Replies to “కథ 2014 … మరో ముగ్గురు కథకులు”