పిచ్చేశ్వరరావు – ‘‘జీవచ్ఛవాలు’’

APR anthology boo cover page

మెదడుకు పదును పెట్టే మంచి కథలను కోరుకునే పాఠకులు పిచ్చేశ్వరరావును మరిచిపోలేరనుకుంటాను. తెలుగు కథ ఏపుగా ఎదిగి మంచి పువ్వులు పూస్తున్న తొలిరోజులలో ఎర్రటి మందార మాలను అందంగా గుదిగుచ్చిన జాతి కథకుడు పిచ్చేశ్వరరావు. అతని సమకాలీన కథలను చాలామంది పోల్చి చూస్తే పిచ్చేశ్వరరావు వ్రాసిన కథలు బహుకొద్ది మాత్రమే.

కోపం వచ్చి వ్రాసిన కథ ‘అదితి’

అదితి - aditi - telugu short story by Anil Atluri

అప్పుడెప్పుడో నేనేదో వ్రాస్తే దాన్ని చదివి ఒకానొక రచయిత “మీరే వ్రాసారా? ఎవరైనా ఎడిట్ చేసారా?” అని అడిగితే ఆ ప్రశ్నకి కోపంవచ్చి వ్రాసుకున్న కథలలో ఈ ‘అదితి’ ఒకటి. “…నట్లు కొట్టకుండా, ఆపకుండా చదివించింది మీ కథ,” చాలా మంది పాఠకులు నాకు తెలియజేసిన అభిప్రాయం ఇది.

నేనైన నీకు నీవైన నేను

“నేనైన నీకు నీవైన నేను” అని 2006 లో అన్నాడామాట. పైగా అతి రమణీయం గాను.
“రాయడం ఒక దురద,” అని కూడ అన్నాడు.
“ఆ మాట చాలా చీప్ గా ఉంది,” అని ఒకానొక పాఠకుడి ఒక వ్యాఖ్య.
“నా కథల్లో అంతర్లీనంగా తార్కికత, తాత్వికత కనిపించడానికి నా చిన్నప్పటి అధ్యయనం కారణం కావచ్చు,” అని నిన్న అన్నాడు.
మరి విముక్తి మూలంగా ఈ ప్రత్యేకత వచ్చిందో..లేక విముక్తి కి జనార్ధన మహర్షి నవ్య సంయుక్తంగా ఇచ్చిన బహుమతి వల్లవచ్చిందో కాని నవ్య కళ్ళకి ఇతని రూపు ప్రత్యేకం గా కనపడింది. ఆ ప్రత్యేకం ఇక్కడ చదువుకోండి.

కొత్త వంతెన

“కొత్త వంతెన” నిన్న సాయంత్రం “కొత్తవంతెన” పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది.  “ఆంధ్రజ్యోతి” దిన పత్రిక సంపాదకుడు.  కె.శ్రీనివాస్, ఈ వ్యాసాలను తొలుత “ప్రజాతంత్ర” పత్రికలో దాదాపు ఒక దశాబ్దం క్రితం ప్రచురించారు.  వాటన్నింటిని ఇప్పుడు మళ్ళీ ఒక సంకలనం కింద “అనేక పబ్లికేషన్స్” ప్రచురించింది. ఘంటా చక్రపాణి నిర్వహించిన ఈ సభలో “కొత్తవంతెన‌” అచ్చు పుస్తకాన్ని టిజాక్ అధ్యక్షులు కోదండరామ్ ఆవిష్కరించగా,  “కినిగె‌” ఈబుక్ ని ఆచార్యులు జి హరగోపాల్ ఆవిష్కరించారు. రచయిత కె శ్రీనివాస్ […]

ABN ఆంధ్రజ్యోతి టి వి చానెల్‌ల్లో రెజ్యుమె మీద నా ప్రోగ్రామ్

జూన్ 15 వ తారిఖున ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి టివి (ABN Andhrajyothy) వారి దిక్సూచి ప్రోగ్రామ్ లో రెజ్యుమె గురించి ఒక అరగంట లైవ్ ప్రోగాం లో పాల్గొన్నాను. ప్రోగ్రాం సాయత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్య జరిగింది. చాలా మందికి రెజ్యుమ్ కి రెజ్యుమే
కి
తేడా తెలియదు. అంతే కాక అవగాహానారాహిత్యం వల్ల ఇంకా చాలా తప్పులు చేస్తు, తమకు ఉద్యోగాలు రాకపోవడానికి అనేకి మైన ఇతర కారణాలను చూపిస్తుంటారు. టి వి ఒక చక్కని ప్రసార మాధ్యమం. దానిద్వారా నేను చెప్పాలనుకునేవి చెప్పడమే కాదు, లైవ్ పోన్-ఇన్ ప్రోగ్రాం కాబట్టి చూసే వారి అనుమానాలను కూడా నివృత్తి చేయవచ్చు.