I found Telugu literature dead

ఏప్రిల్ నెలలో విడుదలైన మిసిమి లో వెలగా వెంకటప్పయ్య గారు ఒక వ్యాసం వ్రాసారు.  దాని మకుటం “విదేశీయులు ప్రచురించిన తెలుగు గ్రంధాలు“.  (పుట 58 – 62).  అందులో బ్రౌన్ దొర గారి ప్రస్తావన కూడా ఉంది.  1825 లోనే దొర ” I found  Telugu literature dead ” అని వ్యాఖ్యానించాడు.  దాదాపు 30 సంవత్సరాల తరువాత ” In thirty years raised it to life” అని కూడా అన్నాడు.

Charles Philip Brown

చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్, ఒక ఇంగ్లిష్ దొర మన భాష కోసం పడ్డ కష్టం ముందు, మనదెంత.  మనకున్న వనరుల ముందు ఆ దొరకున్నదెంత?  ఆయన చేయగాలేనిది, మనం ఈ రోజున ఉమ్మడిగా నైనా చెయ్యలేమా?

కినిగె లో మిసిమి ని ఇక్కడ కొనుక్కోవచ్చు, లేదా అద్దెకి చదువుకోవచ్చు!

6 Replies to “I found Telugu literature dead”

  1. ఎందుకు నేర్చుకున్నాడు?

    ఎందుకంటే ప్రాంతీయ బాషలో మత ప్రచారం కోసం కనీ మన దరిద్రం మనం అతన్ని ఎత్తున ఉంచుతున్నాము.

  2. ఎందుకు నేర్చుకున్నాడు?

    ఎందుకంటే ప్రాంతీయ బాషలో మత ప్రచారం కోసం కనీ మన దరిద్రం మనం అతన్ని ఎత్తున ఉంచుతున్నాము.

    ప్రసాద్ గారూ
    మీరు చాలా తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. బ్రౌన్ మతప్రచారకుడిగా లేడు. అతనిని క్రిష్టియనులే విమర్శించేవారు. బ్రాహ్మణ పండితులతో కూడా బ్రౌన్ కు పొసిగేది కాదు. కాస్తో కూస్తో నాస్తిక భావాలున్నాయనికూడా విమర్శలకు గురయ్యాడు. (విశ్వాసి అయినప్పటికీ కూడా) తెలుగులో బైబిలులు ఇతని కంటే వందేళ్ళ ముందే వ్రాయబడ్డాయి.

    చచ్చిపడున్న తెలుగు సారస్వతాన్ని పైకి లేపాను అని బ్రౌన్ చెప్పుకొన్న మాటలు అక్షర సత్యాలు. కొన్ని వేల తెలుగు గ్రంధాలను, నయాన భయాన, సామధానబేధ దండోపాయాలను ఉపయోగించి బ్రౌన్ సేకరించాడు. నేడు మనం మన ప్రాచీనసాహితీ సంపద అని చెప్పుకొంటున్న ప్రతీ కావ్యంపై బ్రౌన్ ముద్ర ఉంది. ఒక్కొక్క కావ్యానికి అనేక ప్రతులు వచ్చినపుడు వాటిని పక్కపక్కన పెట్టి అసలైన దానిని శాస్త్రీయంగానిర్ధారించి ప్రక్షిప్తాలను తొలగించి చాపు చేసిన మహనీయుడు అతడు. వేమన పద్యాలు బ్రౌన్ అప్పట్లో సేకరించకపోయినట్లయితే ఈ నాడు మనకు ఉండేవి కావనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే వేమన పద్యాలంటే పండితులు ఒక జబ్బుపని గా తలచి ముందుకొచ్చేవారు కాదట.
    మనుచరిత్ర, పల్నాటియుద్దం, బొబ్బిలి యుద్ధం, కడపస్థానికచరిత్ర, భాగవతం, డిక్షనరీలు ఒకటా రెండా బ్రౌన్ మాత్రమే చేసిన పనులు.
    తెల్లవాళ్ళందరూ దోపిడీదారులు, మతప్రచారకులు అన్న కండిషనింగ్ నుంచి బయటపడండి సార్. వారిలో కూడా కొంతమంది ప్రత్యేకులు ఉన్నారు. వారిని గుర్తించి సముచిత స్థానం ఇవ్వటం నేటి కాలావసరం.
    బ్రౌన్ ఇందియానుంచి లండన్ వెళిపోయి మరో ముప్పై సంవత్సరాలు బ్రతికాడు అప్పుడు కూడా తన తెలుగు సేవను మరువక, పుస్తకాలసేకరణ, డిక్షనరీ ఆధునీకరణ వంటి పనులు చేసాడు. ఆ పనులను ఇప్పటి వరకూ ఇండియాకు తెచ్చుకోలేని దౌర్భాగ్యులం మనం. అంతేకాదు, బ్రౌన్ సేకరించిన సుమారు పాతికవేల గ్రంధాలు ఆర్చైవులలో మూలుగుతున్నా (ప్రతీదానికి పేజీపేజీలో బ్రౌన్ విశ్లేషణ, వివరణలతో కూడినట్టివి) ఈనాటికీ సంపూర్ణంగా వెలికి తీసుకురాలేకపోతున్న వెధవాయిలం మనవాళ్ళం.

    మీకువీలైతే ఆరుద్ర సమగ్రాంధ్ర చరిత్రలో బ్రౌన్ చాప్టరు చదవండి (ఆరుద్ర బ్రౌన్ సేవంతా అతని వద్ద పండితులుగా పనిచేసిన వారి ఘనతే అన్న అర్ధం వచ్చేలా వ్రాయటం జరిగింది – కానీ బ్రౌన్ స్వదస్తూరీతో ప్రతీ గ్రంధానికీ చేసిన వ్యాఖ్యలు, అప్పటి జర్నల్స్ లో వ్రాసిన వివిధ పేపర్లగురించి తక్కువగా ఉంటుంది – గమనించవచ్చు)- అంతర్జాలంలోనే లభించే బండి గోపాలరెడ్డి బంగొరె (ఇతనిదో విషాదగధ పాపం) సంకలన పరచిన భ్రౌన్ లేఖలు చదవండి. వీలైతే

    ఇక ప్రస్తుతకాలంలో అయితే బ్రౌన్ లాగ చేసే పరిస్థితులు కనిపించవు. ఆఫ్ట్రాల్ ఒక కధా సంకలనం తీసుకొస్తే వెంటనే మా ప్రాంతం కధలు లేవు, జిల్లా కథలు లేవు, కులం మతం ప్రతిబింబించలేదు, అతని కధలున్నాయి ఇతనికంటా గొప్పా అంటూదుమ్మెత్తి పోసే రోజులోకి వచ్చాం. బహుసా ఆస్థాయి కృషి జరపటం ఎవరివల్లా కాదు. ఎందుకంటే మితిమీరిన డెమోక్రిసీ దశకు చేరుకున్నామేమో మనం అందరం.

    ఇంత పెద్ద వ్యాఖ్యకు కారణం బ్రౌన్ మతప్రచారం కోసం తెలుగుసేవ చేసాడు అన్నవ్యాక్య అలానే ఉండకూడదని, తెలియని వారికి తప్పుడు అర్ధాలు ఇస్తుందనీ……..
    భవదీయుడ్
    బొల్లోజు బాబా

  3. బొల్లోజు బాబా గారూ,
    చాలా చాలా ధన్యవాదాలు.
    మీ వ్యాఖ్య వల్ల కొన్ని కొత్త విషయాలు తెలిసాయి నాకు.

  4. మాన్యులు శ్రీ అనిల్ గారికి,

    ఈ రోజు చాలా వఱకు మీ వేదిక రచనలను చదివాను. ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఫోటోలు, రచయితల కంఠస్వరాలను పదిలపఱిచి ఎంతో మేలుచేశారు.

    మీ అమ్మగారి ఫోటోను చూస్తుంటే చిన్నప్పటి ఆ రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. “భారతి”ని నా కోసం, సెట్టి ఈశ్వరరావు గారి కోసం అట్టేపెట్టి చదివించేవారు. ఎన్ని పుస్తకాలో. ఎంత విజ్ఞానసంపదో. ఎందరు వారికి ఋణపడి ఉంటారో.

    మీ నాన్నగారి రచనలు జ్ఞాపకానికి వచ్చాయి.

    భవతు!
    సర్వ శుభాకాంక్షలతో,
    ఏల్చూరి మురళీధరరావు

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.