క్లాసు పుస్తకాలు, నోటుబుక్కులు, హోం వర్కులు చేస్తూ కనబడ్డవాడేకాని చేతిలో చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలతో చూసిన గుర్తు లేదు. (చదివే ఉంటాడు, చదవకుండా ఎలా!) ఇద్దరమూ, మిగతా మిత్రులతో కలిసి, గోళీలు ఆడుకున్నాం. బిళ్లం గోడు కూడా అడుకున్నాం. క్రికెట్టు కూడా. కొట్టుకున్న, తిట్టుకున్న సందర్భాలు లేవు.
తరువాతెప్పుడో, మెడిసిన్ లో సీటు వచ్చింది చదువుకుంటున్నాడని తెలుసు. సరే, ఇక పెళ్ళి. బజుల్లా రోడ్డు ఇంట్లో సత్యనారాయణ వ్రతం. ఒకటి రెండు సార్లు, ఆంధ్రా బాంకులో కనపడ్డాడు. వాళ్ళ నాన్నగారు ఉన్నన్నిన్నాళ్ళు తన కబుర్లు కొన్ని తెలుస్తుండేవి. తరువాత ఎప్పుడో స్పర్ టాంక్ రోడ్ మూలమీద కనపడ్డాడు. ఇంగ్లాడ్‌లో ఉంటున్నానన్నాడు.
అప్పుడప్పుడు వెతుక్కునేవాడిని, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో అని! ఆ తరువాతెప్పుడో తెలిసింది అమెరికాకి వెళ్ళాడని. వాళ్ళ్ అన్నయ్యనుకుంటాను చెప్పాడు.
అనుకోకుండా రెండు, మూడేళ్ల క్రితం, హైద్రాబాదులో ఎయిర్‍పోర్టుకి వెళ్తూ దారిలో కధాసాహితి నవీన్ ఫోనులో పలకరించాడు. మూలింటామె గురించి మాట్లాడాడు. ఆశ్చర్య మేసింది. “సాహిత్యమేమిటి, తెలుగు సాహిత్యమేమిటి, మూలింటామె ఏమిటి? దాన్ని నువ్వు సమీక్షించడమేమిటి,” అన్న నా ప్రశ్నల పరంపరకి, “దేశానికి దూరంగా ఉన్నప్పుడు, ప్రేమలు, ఆపేక్షలు పెరుగుతాయిగా…నాకు అలా తెలుగు మీద ప్రేమ, సాహిత్యం మీద అనురాగం పెరిగింది,” అన్నాడు. సరేలే అనుకున్నాను.
మొన్న జంపాల గారు ఫేస్‌బుక్ లో, DTLC పేజిలో ఒక ఫోటోలో ఉన్నారు. అది గ్రూప్ ఫోటో. అందులో కనబడ్డాడు. వార్ని, భలే దొరికాడుగా అనుకున్నాను. ఆ ఫోటో కి కామెంట్ లో ఆ మిత్రుడికి తెలియజేయమని కోరాను.
మర్నాడు 22 అక్టోబరు. ఉదయం తన ఫోను కాల్ తో నిద్రలేపాడు. ఆ తేది, ఆ రోజు మర్చిపోను.
గొప్ప విషయం ఏమిటంటే, DTLC లో ఉన్నాడు. 2005 నుంచి. దాదాపు పదమూడేళ్ళు! ఇద్దరికి తెలిసిన వారు, పరిచయం ఉన్నవారు, సాహిత్య పిపాసులు. తెలుగు, తెలుగు సాహిత్యం! అయినా నాకు తెలియక పోయింది! బహుశ ఏ సోషల్ మెడియాలోను ప్రోఫైల్ లేదనుకుంటాను! లేకపోతే నేనెప్పుడో తగులుకునేవాడిని. (బహుశ నాలాంటి వాళ్లు తగులుకుంటారనే తప్పుకునుంటాడు.
ద హ )
“రాత్రి నిఘంటువు చూసా,” అని అందులో అంటూ నన్ను ‘రిపబ్లిక్ గార్డెన్స్‘ కి తీసుకువెళ్లిపొయ్యాడు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం. తన భాష, యాస, పలుకుబడి, ఆ నవ్వు, ఆ తల ఊపడం, దేన్ని వదులుకోలేదు! “ఆంధ్ర సాహిత్య పరిషత్తు” గురించి ప్రస్తావిస్తూ, “మా ఊరు మద్రాసు” అని అన్నాడు! ప్రాణం ఒక్కసారి లేచి వచ్చింది! చి న
Amazing, రాఘవేంద్ర…చౌదరి! అసలు నువ్వు తెలుగులో, ఆ సామెతలు, ఆ కోటబుల్ కోట్స్ , ఆ వ్యంగ్యం, ఆ చమత్కారం…భలే! You know something! DTLC స్పూర్థి నాకు వేదిక ని మొదలుపెట్టడానికి. అఫ్ కోర్సు, మద్రాసులో మేము (అమ్మ, నేను, ఇతర సాహితీమిత్రులు) దాదాపు మూడు దశాబ్దాలు నిర్వహించిన సాహితీ సమావేశాల అనుభవం ఉందనుకో!
It is nice to know of your association with DTLC and love for your Telugu language! You made my day.
ఇక్కడ DTLC లో తన మాటలని వినండి.
BTW, that is…
పోఁగాలము దాపించినవారు దీప నిర్వాణగంధము నరుంధతిని మిత్రవాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు. చి న
నేస్తం, నీ ఆప్యాయతకు పరవశం చెందాను. బాల్య స్నేహపు మహిమా, మాధుర్యం అది. నీ టపా చిరంజీవి యార్లగడ్డ శివరాం పంపితే చూశాను. నీకు అప్పుడు పదేళ్ళైనా ఉంటాయో, ఉండవో, అట్లూరి పుండరీకాక్షయ్య గారింట్లో పేద్ద, పెద్ద అడుగులేసుకొంటూ షేక్స్పియర్ మాటలు ” ఈ జీవితమే ఒక నాటకరంగం” అనీ, ప్రతాపరుద్రుని మంత్రి గారి మాటలూ నువ్వు అరవటం నాకు గుర్తొస్తాయి. జంపాల చౌదరి గారికీ, శివరాంకూ Facebook Page ఉండటం నాకు కలిసి వచ్చింది. వారిద్దరికీ నెనర్లు. – రాఘవేంద్ర చౌదరి.