నిన్న రవీంద్ర భారతిలో జరిగిన కిన్నెర వారి తెలుగు వెన్నెల కవిత మహోత్సవాల సందర్భంలో కొందరు కవులు తమ తమ కవితలతో సదస్యులను రంజింపజేసారు. నిన్నటి సభలో కీలకోన్యాసం ఇచ్చిన శ్రీ కె. శివారెడ్డి గారి ఉపన్యాసం కూడా మీరు ఇక్కడ విన వచ్చు.
శివారెడ్డి కవిత ఆయనే ఆలాపించాడు.
గమనిక
మనవాళ్ళు వొట్టి వెధావాయలోయ్
ఇది నా దగ్గిర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో స్ప్రీకర్ అనే అప్ తో రికార్డ్ చేసింది. మధ్యలో వచ్చిన ఫోన్ కాల్సు మూలంగా రికార్డింగ్ దెబ్బతిన్నది. సాంకేతిక కారణాలు నా నియంత్రణలో లేవు. అందుకని ప్రసంగంలో కొన్ని భాగాలు మీకు అందివ్వలేక పోతున్నాను. మిగతా కవులందరి కవితలను వారి గొంతులతోనే మీకు వినిపించే అవకాశం కలిగించాలి అన్నది కూడ నా ఉద్దేశం. ఈ రెండు మూడు రోజులలో ఆ పని కూడా ముగిస్తాను.
శివారెడ్డి గారి ఉపన్యాసం పూర్తిగా విన్నాను. తెలుగు సాహిత్యానికి దశ దిశ అనే అంశంపై వారి ఉపన్యాసం దాదాపుగా 15 నుండి 20 నిముషాల పాటు సాగింది. కాని అందులో సాహిత్యం గురించి కంటే సమకాలీన సమస్యలు, తెలుగు కు న్యాయం జరగటం లేదని, ఇందుకు ప్రభుత్వం తగినంతగా ప్రోత్సాహించడం లేదని తెలిపారు. ఒకప్పటి కవులు కంటే నేటి కవులు అద్భుతంగా రాస్తున్నారని తెలిపారు .వారు మాట్లాడింత సేపు ఎంతో అద్భుతంగానే మాట్లాడారు కూడా. కాని వారికి ఇచ్చిన అంశం, మాట్లాడిన అంశానికి సరిగా అతకలేదేమో అనిపించింది. సాదారణంగా అందరికీ తెలిసే విషయాలే తెలిపారు అనిపించింది. సాధారణంగా కవులు కొత్త విషయాల కోసం వస్తారు. కాని అవేవి వారి ప్రసంగంలో కనిపించలేదు అనేది నా అభిప్రాయం.