మొన్న అంటే, ౨౩ మే, రవింద్ర భారతి లో కిన్నెర వారి తెలుగు కవిత మహోత్సవాలు లో భాగంగా రాళ్ళబండి కవితా ప్రసాద్ రూపొందించిన ‘తెలుగు వెన్నెల‘ లో “అనువాద కవిత్వం – దశ – దిశ‘ అనే అంశంపై వాడ్రేవు చిన వీరభద్రుడు చేసిన కీలకోపన్యాసం సభికులను విశేషంగా ఆకర్షించింది.అంతే కాకుండా అంతకు క్రితం రోజున విశిష్ట కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రత్యేకత ఏమిటంటే వేదిక నెక్కిన ప్రతి కవి తన కవితని తనే చదివి సభకు వినిపీంచాలి.
వేదిక నెక్కిన కవులు, వారి కవితలు వారి గళాలలోనే, మీ కోసం ఇక్కడ.
ఆచార్య గోపి
రాళ్ళబండి కవితా ప్రసాద్
అనిల్ భయ్యా .. నా కవిత …
ఎదురుగానే ఉన్నా ఏదో తెలియని దూరం మనమధ్య
నవ్వుతూనే ఉన్నా ఎదో మోయలేని భారం ఈమధ్య
కాటుక కళ్ళంతా కలయతిరిగినా కనిపించనేం నేనెక్కడ
గుండె గూటిలో అణువణువూ వెతికినా లేనేం ఏప్రక్కన
ఎందుకు మరిఎప్పుడూ ఎద తలుపులు తడుతుంటావ్
చనువుగా చెంతచేరి మాటలతో మతి పోగొడుతుంటావ్
నీ తలపుల చెట్టుకి కట్టి విడిపించడానికి తడబడుతుంటావ్…..
పసుపు వన్నె పులుముకున్న బియ్యపు గింజలు కావవి
ముత్యపు జల్లులై వధూవరులపై కురుస్తున్న తలంబ్రాలవి
ముడిపడిన మనసులను తాకుతున్న మమతల విరులవి
జతపడిన జీవితాలుపై జారుతున్న బాసల ఝరులవి
మూగమనసులు కుప్పపోస్తున్న ఊసుల రాసులవి
సొంతమౌబోతున్న సొగసుకు సాదర స్వాగాతాలవి
సాంప్రదాయం పెళ్లి పీటలపై ..ఆప్యాయతాభిషేకాలవి
ప్రసాద్,
మీ కవితకి ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుడ్ని.
ఫేస్‌బుక్ లోని కవిసంగమం సమూహం మీ కవితలకు సరైన వేదిక కాగలదు.
మీ కవితలని అక్కడ పంచుకోండి. లంకె ఇదిగో:
https://www.facebook.com/groups/kavisangamam/
మీకు చక్కని సూచనలు సలహాలు సద్విమర్శలకు అదే సరైనది.