గత పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా వెలువడుతున్న కధాసాహితి వారి 25 వార్షిక కథా సంకలనం కథ 2014 లో ఈ ముగ్గురి కథలున్నవి.
బత్తుల రమాసుందరి మొదటి కథ ఇక్కడ
చదువుకోవచ్చు; మనిద్దరమే ఉందాం అమ్మా!
ఆంధ్రజ్యోతి దిన పత్రిక వారి ఆదివారం అనుబంధం (01-09-2013లో ప్రచురితం)
ఇక రెండవ వారు పాలగిరి విశ్వప్రసాద్, వీరి మొదటి కథ
బోలు మనుషులు రచన మాస పత్రిక సెప్టెంబరు 1991లో
ప్రచురితం. నేను వెతికినంతలో అది నాకు జాలంలో దొరకలేదు.
ఇక మూడవ కథకుడు భగవంతం.
వీరి మొదటి కథ వెయిటింగ్ ఫర్ యాద్గిరి.
ఈ కథ తొలిసారిగా 2006లో వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
చలన చిత్ర దర్శకుడు వంశీ, నా కెందుకు నచ్చిందంటే అనే శీర్షికతో
గోతెలుగు డాట్ కాం లో ఈ కథని మెచ్చుకుంటూ పరిచయం చేసిన కథ. భగవంతం పాడిన పాట ఇక్కడ వినొచ్చు. సా.వెం.రమేశ్ స్వరం కూడా!
రానున్న ఆదివారం 20న, తెనాలి లో జరగనున్న కథ 2014 ఆవిష్కరణ సభలో బహుశ వీరందరిని మీరు కలుసుకోవచ్చు. వీరు ముగ్గురే కాదు ఇంకా ఉన్నారు. వారిలో కొంతమంది గురించి రేపు చెబుతాను.
ఇదిగో కథ 2014 కి అహ్వాన పత్రిక.
3 Replies to “కథ 2014…ముగ్గురు కథకులు”