తప్పెవరిది (2) ?

ఆ విద్యార్ధి సాఫ్ట్ స్కిల్ల్స్‌లో ట్రైనింగ్ ఇచ్చాను అని చెప్పుకుంటున్న సాఫ్ట్ స్కిల్ల్స్ ట్రైనర్ ది. ఆ ట్రైనర్ ఇచ్చే ట్రైనింగ్, దాని పర్ఫార్మన్స్ని మానిటర్ చెయ్యని మేనజ్‌మెంట్‌ది. “పేరు గొప్ప , ఊరు దిబ్బ” అన్నట్టు ఆ ఆ కాలేజికి, వివిధ నగరాలలో చాలా బ్రాంచెస్ ఉన్నవి. అబ్బొ, సానా లావు పేరు కూడా ఉన్నది. ఫీజుల్స్ గ ట్రా కూడా బానే గుంజుకుంటారు.
అంతేనా అంటే కాదు.

మా కాలేజిలొ చదువుకున్న వారందరికి ” ఉద్యొగాలు గారంటీ “అంటారు. ఎందుకంటే వారి కాలేజిల్లో “కాంపస్ ఇంటెర్వ్యు” లు వచ్చేస్తవి కాబట్టి.

తప్పెవరిది ?

మా కాలేజీ విద్యార్ధికి సగటున 15 వేలు తగ్గకుండా జీతం వస్తుంది అని కాలరెగరేసుకుంటు చెప్తారు.
బేనిఫిట్స్, ఫ్రింజ్ బెనిఫిట్స్ కూడా వుంటాయని ఆకర్షణియంగా చెబుతారు.

అంతటితో ఐపొయిందా అంటే అబ్బే కాదు.
ఒకవేళ ఎవరి ద్వారానో, ఎందుకులేండి, విద్యార్ధి శక్తి యుక్టులకు మెచ్చి ఎవరన్నా ఉద్యొగం ఇస్తే, అందులో చేరనివ్వరు.

అదేందుకు అని అడగండి.

ఎందుకంటే ఒక విద్యార్ధి తక్కువ జీతానికి అంగీకరిస్తే మిగతా సంస్థలు కూడా అదే జీతం ఆఫర్ చెస్తే తమ కాలేజ్ ఉనికికి ప్రమాదం కదా.
అందుకని.
ముందు ఓపికగా నచ్చచెబుతారు. ఒద్దమ్మా అని.
నువ్వు జాఇన్ ఐపోతావు, మరి నీ తొటి వారి సంగతేమిటీని మాట మార్చి ‘సెంటిమెంట్’ని వొదులుతారు, నెమ్మదిగా.
తరువాత, మొదలవుతుంది.
బెదిరింపుల సెక్షను.
నువ్వు జాయిన్ అవ్వకూడదు, అని హుకుం పారేస్తారు.

ఈ మధ్యతరగతి కుటుంబంలోని వారు, తమ పిల్లలకు ఎటూ ఆస్తులివ్వలేము, కనీసం చదువులన్నా ఇద్దామని అనుకోవడంలో తప్పులేదుగా.

అందుకని, వాడి కాళ్ళు, వీడి కాళ్ళు పట్టుకుని, ఆ బాంకు వాడిని, ఈ బాంకు వాడిని దేవిరించి ఎంతొకొంత అప్పు చేసి, వారిని చదువించుకుంటారు. ఆ అప్పు తీచే బాధ్యత తమదని ఎరిగిన పిల్లలు ఎదో ఒక ఉద్యొగంలో జాఇన్అయి, ఆ అప్పు తీర్చుకోవాలనుకొవడం తప్పా?

వారికి తగిన ఉద్యొగాలను వారు ఎంచుకుని జాఇన్ అవుదామనుకుంటే వారిని అందులో జాఇన్ కాకుండా అపే ఈ కాలేజ్ మేనేజ్‌మెంట్‌ని ఏమనాలి?

* * *

“శిలలపై శిల్పాలు చెక్కినారు” అని మనకి ఒక సినిమా పాట ఉంది. “శిలలైతే చెక్కవచ్చు సార్, వీళ్ళు శిలలు కాదు, గులక రాళ్ళు. వీళ్ళని తీర్చి దిద్దడం మా వల్ల కాదు. ఎదో మా బ్రతుకు తెరువు కోసం, ఈ ఉద్యొగం చేసుకుంటున్నాము. ఎదో చూసి , చూడనట్టు నెట్టేయండి సార్”, అన్న ఆ సాఫ్ట్ స్కిల్ల్స్ ట్రైనర్ మాటలు గుర్తొస్తున్నాయి.

తప్పేవరిది?

మారుతున్న కాలంతొ బాటు వస్తున్న మార్పులని గమనించి,జీవనానికి కావలసిన కనీసపు నైపుణ్యాలను అందించలేని ఈ విద్యా వ్యవస్థదా?

కాలేజి చదువులదాకా, బయట ప్రపంచాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న విద్యార్ధులదా?

కనీసపు స్కిల్ల్స్ లేని విద్యార్దులని తీసుకోలేమంటున్న కార్పరేట్ రంగానిదా?

విపరీతమైన పోటీలున్న ఈ జీవితంలో ఈ ఒంటరి విద్యార్ధి ఓటమిని అంగికరించలేక, క్షణికమైన మానసిక దౌర్బల్యంతొ, ఏదేని అఘాయిత్యానికి ఒడిగడితే ఎవరు జవాబుదారి?

ఎవరు ?

One Reply to “తప్పెవరిది (2) ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.