తెలుగు సాహిత్య వేదికకు ఆహ్వానం!
తెలుగు సాహిత్యం, ముఖ్యంగా తెలుగు కథలు మీకు ఇష్టమా?
అయితే, ఈ వేదిక మీకోసమే.
ఇక్కడ సాహిత్యాభిమానులు తమ తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు.
📌 Event Information
సమావేశ వివరాలు:
తెలుగు సాహిత్యంపై చర్చ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి సమావేశంలో ఒక తెలుగు కథా పరిచయం, ఆ కథ మీద చర్చ వుంటుంది. అలాగే, ఇతర భాషల్లోని నవల గురించి కూడా మాట్లాడతారు. మీరు కూడా చర్చలో పాల్గొనవచ్చు. సమావేశం సాధారణంగా రాత్రి 7:00 నుండి 8:30 వరకు ఉంటుంది. కొన్నిసార్లు 9:00 లేదా 9:30 వరకు కూడా కొనసాగవచ్చు.
📌 Google Meet Info:
గూగుల్ మీట్ వివరాలు:
ప్రతి నెల రెండో శనివారం సాయంత్రం 7 గంటలకు గూగుల్ మీట్ ద్వారా ఆన్‌లైన్‌లో కలుద్దాం.
📌 Facebook Page:
ఫేస్‌బుక్ పేజీ వివరాలు:
ఈ వేదికను గత పదేళ్లుగా సాహిత్యాభిమానులు నడుపుతున్నారు. సమావేశాల వివరాలు ఫేస్‌బుక్ పేజీలో ఉంటాయి. 3000 మందికి పైగా ఈ పేజీని ఫాలో అవుతున్నారు. మీరు కూడా ఫాలో అవ్వండి.
వాట్సాప్ గ్రూప్ వివరాలు:
📌 WhatsApp Group:
వేదిక వివరాల కోసం వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇందులో సమావేశాల వివరాలు మాత్రమే ఉంటాయి. గూగుల్ మీట్ లింక్, తదుపరి సమావేశ వివరాలు, చర్చించే కథ/నవల లింకులు ఈ గ్రూప్‌లో ఉంటాయి.
క్రింద వ్యాఖ్యల విభాగంలో మీ ఆసక్తి తెలియజేస్తే మీకు వాట్సాప్‌గ్రూప్ లంకె అందుతుంది. మీరు కూడా అందులో సభ్యులు కావచ్చు.
One Reply to “వేదిక – సాహిత్యం తో మనం”