Tag Archives: #telugu

గర్భస్రావం

గర్భస్రావం

రచయితా, విమర్శకుడు మిత్రులే చాలా కాలం నుంచి.

“రచన బాగుండ లేదంటే ఏమైనట్లు? అలాగేనా విమర్శించవలసినది?” అన్నాడు విమర్శకుడు. అని “ఐనా నాలో నా రచనల్లో ఆ ఛాయలు ఉన్నాయి – యీ ఛాయలున్నాయన్నావు నువ్వు. ఛాయలు మనుషుల్లోనూ రచనల్లోనూ వుండవు. సూర్యుడో, చంద్రుడో దీపమో వుంటే ఛాయలు పడతాయిగాని వూరికే పడవు. విమర్శకుడికామాత్రం గూడా తెలియకపోతే యెట్లా?” అనడిగాడు కవ్వించుతూ విమర్శకుణ్ణి.

విమర్శకుడు మాట్లాడలేదు.

“ఇదిగో ఇటు చూడు నేస్తం! రచన చెయ్యడం అంటే మాటలు గాదు; బిడ్డను కనడం లాంటిది. బిడ్డను కనేందుకు ఎంత కష్టపడాలో నీకు తెలియంది కాదు” అన్నాడు అర్ధించుతున్నట్లు.

“నిజవే నాయన! కానీ యేం చేయ్యను? నువ్వు కన్నది మృతశిశువుని. చచ్చిపోయి గర్భం బయటపడ్డ బిడ్డను చూచి ‘ఆహా! యెంత బావుంది! అని యెట్లా అనను?” అన్నాడు విమర్శకుడు.

రచయిత మరి మాట్లాడలేదు.
అట్లూరి పిచ్చేశ్వరరావు

ఈ రోజుకి అట్లూరి పిచ్చేశ్వరరావు మరణించి 54 సంవత్సరాలు. (Sept 26, 2020)