క్లుప్తంగా ఇడ్లి, వడ, సాంబార్ కధ ఇది!

కొంత మంది పాఠకులకి నేను వ్రాసిన ఇడ్లి, వడ, సాంబారు కధ పూర్తిగా అర్ధం కాలేదన్నారు.  ఈ టపా వారికోసం. ఈ క్రింద ఇఛ్హినవి సారంగ లో వఛ్హిన కధ ఇడ్లి, వడ,సాంబార్ లోని వాక్యాలు. ఇవన్ని అంతర్గతంగా కధాంశానికి సంబంధించిన సూచినలిస్తాయి.  వీటన్నింటిని ఒక క్రమంలో చదువుకుంటే కధ అర్ధం కావాలి. ఈ వాక్యాలు చదివిన తరువాత, కధని మళ్ళీ ఒకసారి చదువుకోండి.  దానికి లంకె ఈ కింది వాక్యాల తరువాత చివర ఇఛ్హాను.  – […]

కోపం వచ్చి వ్రాసిన కథ ‘అదితి’

అదితి - aditi - telugu short story by Anil Atluri

అప్పుడెప్పుడో నేనేదో వ్రాస్తే దాన్ని చదివి ఒకానొక రచయిత “మీరే వ్రాసారా? ఎవరైనా ఎడిట్ చేసారా?” అని అడిగితే ఆ ప్రశ్నకి కోపంవచ్చి వ్రాసుకున్న కథలలో ఈ ‘అదితి’ ఒకటి. “…నట్లు కొట్టకుండా, ఆపకుండా చదివించింది మీ కథ,” చాలా మంది పాఠకులు నాకు తెలియజేసిన అభిప్రాయం ఇది.

కోరిక

ఫోను మోగింది.  ఆరున్నరయ్యింది.  తెలియని నెంబర్.  బహుశ కాబ్ డ్రైవరే అయ్యుంటాడు.  కాబ్ డ్రైవరే! 43 ఈస్ట్ దగ్గిర్లోని ప్లాజా సెంట‌ర్‌లో ఉన్నాడంట. అతనికి ఫ్లాట్‌కి ఎలా చేరాలో డైరక్షన్స్ ఇచ్చాడు. మళ్ళీ ఫోను.  కాబ్ డ్రైవరే.  క్రింద పార్కింగ్ లాట్ లో వెయిటింగ్.  పావుగంటలో చేరాడు. ఫరవాలేదు.  ప్లాను చేసుకున్న అరగంటలో దింపేస్తాడు. సాండల్స్ విడిచి షూస్ తగిలించుకున్నాయి పాదాలు. కుడిచేతివేపు విండ్ షీల్డ్‌ని తుడుచుకుంటున్న డ్రైవర్, అతను తన కాబ్ వైపుకి రావడం చూసి […]