చాలు!

enough is enough చాలు

నేను తరచూ చెప్తుంటాను.

ఫేస్‌బుక్‌లో ప్రవేశించేవారికి చర్మం మందంగా వుండాలని. ఎంత మందంగా వుంటే అంత మంచిదనికూడా. ఎందుకంటే వాళ్ళూ, వీళ్ళు తెలిసీ, తెలియక నోరు పారేసుకుంటూవుంటారు. అలాంటి సందర్భాలలో ఒకొక్కసారి collateral damageలో భాగంగా పక్కనున్నవాళ్ళకి కూడా దెబ్బలు తగులుతుంటాయి. గాయలవుతాయి. అలా దెబ్బలు తిన్నవాళ్లని, గాయపడ్డవారిని చూస్తూనే వున్నాను.

గాయపడ్డ వాళ్ళ చర్మం మందాన్ని బట్టి, వారి మనసుకి బాధని భరించే శక్తిని బట్టి ‘హర్టు’ అవుతుంటారు. విషయం పూర్తిగా ఆకళింపు చేసుకోకుండా, నేపధ్యమూ, వివరమూ తెలియకుండా దారినపోయే దానయ్యలూ, దానమ్మలూ కూడ రాళ్ళు విసురుతారు!

వెనక్కి తిరిగి రాళ్ళు విసిరినవాళ్ళకి పబ్లిక్‌గా జవాబిచ్చే అవకాశం వున్నా, అది తమని దుర్గంధపూరితమైన మురికికూపంలోకి లాగుతుందని తెలిసి స్పందించకుండా పక్కకు తప్పుకుని వెళ్ళిపోవడం అత్యున్నతమైన మార్గమని తెలిసిన వాళ్ళు కొందరుంటారు. వీళ్ళు ఈ ఫేసు‌బుక్ లోకం ఏమనుకున్నా ఫరవాలేదనుకుంటారు! After all Facebook is not the only world! ఎందుకంటే తాము తప్పు చెయ్యలేదని వారికి స్పష్టంగా తెలుసు.

దాదాపు పది పదిహేనేళ్ళుగా ఈ ఫేసు‌బుక్‌లో అనేకమైన సందర్భాలలో అనేక మంది వ్యక్తులను, వారి వ్యక్టిత్వాలను, ప్రవర్తనను చూస్తూవస్తున్నాను. ఇటీవల రెండు సంఘటనలు చూసిన తరువాత చూసింది, విన్నది, అర్ధం చేసుకున్నది, స్పందించింది ఇక చాలు అనిపించింది.

అందులో ఒకటి ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినది. ఇద్దరూ విజ్ఞులే. తమ తమ రంగాలలో నిష్ణాతులు. తమ విద్వత్తుతో, జీవితానుభవంతో సమాజానికి తమ తోచినంతమేరకు సహాయ సహకారాలు అందిస్తున్నవారే! వాళ్ళిద్దరి మధ్య ‘బ్లాకు’!

మరో సందర్భంలో కూడా అలాంటిదే.

ఇంత చిన్న జీవితంలో కాలి మడమలు కూడ తడపలేని లోతున్న ఈ ఫేస్‌బుక్ ‘స్నేహ సముద్రం’లో వ్యక్తిగతంగా పరిచయంలేని (ఆఫ్ ది గ్రిడ్) ‘స్నేహా’లలో comments ని out of context కి twist చేసి తమకు అనుకూలంగా convoluted arguments చేసి దానితో ఆగక బురదజల్లుడు, దూషణలు, బ్లాకులు. అవసరమా?

మరొక సందర్భంలో అకారణంగా ద్వేషాన్ని పెంచుకోవడం! చిన్న పిల్లలా అంటే కాదు! తల్లులు, తండ్రులుగా వృత్తిపరంగా బాధ్యతలు, విధులూ నిర్వహిస్తున్నవారే! అపోహలకి, అపార్ధాలకి దారి తీసిన విషయాలను కూర్చుని సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకోగలిగిన వివేకవంతులే(?) కారేమో మరి!

ఈ పోస్ట్ కూడా అనవసరం అనుకున్నాను కాని ఇది off the grid, వ్యక్తిగతంగా నన్ను తెలిసిన దేశ విదేశాలలోవున్న మిత్రులకి తెలియజేయడం కోసం చెప్పాల్సి వస్తోంది. నేను ఇక్కడ కనపడటంలేదని అనుకోవద్దు. నాతో వ్యక్తిగత పరిచయం వున్నవారందరి వద్ద నా contact coordinates వుంటాయి కాబట్టి టచ్‌లో వుందాం. కుదిరినప్పుడు ఒక కప్పుటీ తో ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు వీలున్నప్పుడు కలుద్దాం.

BTW, ఇక్కడ నా అకౌంట్‌ని ప్రస్తుతానికి డిలీట్ గాని డీఆక్టివేట్‌గాని చెయ్యడం లేదు. వేదిక కార్యక్రమం ప్రకటనలుంటాయిగా!

Note: This Facebook post was made public disabling the comments on 15 Dec 2023.

#చాలు #EnoughIsEnough

నేనైన నీకు నీవైన నేను

“నేనైన నీకు నీవైన నేను”  అని  2006 లో అన్నాడామాట. పైగా అతి రమణీయం గాను.
రాయడం ఒక దురద,” అని కూడ అన్నాడు.
“ఆ మాట చాలా చీప్ గా ఉంది,” అని ఒకానొక పాఠకుడి ఒక వ్యాఖ్య.
“నా కథల్లో అంతర్లీనంగా తార్కికత, తాత్వికత కనిపించడానికి నా చిన్నప్పటి అధ్యయనం కారణం కావచ్చు,” అని నిన్న అన్నాడు.
ఇంకా ఆరుపదులకి ఆమడ దూరంలోనే ఉన్నా..ఒక ఆరుపదులవరకు రాసేసాడు, కథలు.
ట్విన్నవలలు.  అసలు ఆ మాట విన్నారా? ఇవిగో ఇక్కడున్నవి.

<img class="wp-image-19 size-full" src="https://telugu.anilatluri.com/wp-content/uploads/sites/3/2014/12/TwinnavalaluByAnaamakuduRamasastri_Anil_Atluri.jpg?w=656" alt="ట్విన్నవలలు " originalw="656" width="808" height="1220" scale="2">
ట్విన్నవలలు – రాతగాడు అనామకుడు

పోయినేడాది…దాదాపు ఇవే రోజుల్లో…వాళ్ళిద్దరు కలిసి ఒకొళ్ళపుస్తకాన్ని మరొకరికి అంకితం ఇచ్చుకున్నారు.
పరిణయం చేసుకుని పాతికేళ్ళే..కాని అంతకుముందే పరిచయం అనొచ్చా?  అనకూడదేమో! బంధుత్వం ఉందిగా మరి.

మరి విముక్తి మూలంగా ఈ ప్రత్యేకత వచ్చిందో..లేక విముక్తి కి జనార్ధన మహర్షి, నవ్య సంయుక్తంగా ఇచ్చిన బహుమతి వల్లవచ్చిందో కాని నవ్య కళ్ళకి ఇతని రూపు ప్రత్యేకం గా కనపడింది.  ఆ ప్రత్యేకం ఇక్కడ చదువుకోండి.

చాలా మందికి తెలియని మరొక విషయం.  ఇతను ఆంగ్లంలో కూడ కథలు వ్రాసాడు. ఇదిగో ఇక్కడుంది ఒకటి చదువుకోండి.

నవ్య వార పత్రిక. తేది డిసెంబరు 10, 2014.  పుటలు 15 నుంచి 20 దాకా.