అప్పట్లో దేవ భాష అన్నారు. గ్రాంధికం అన్నారు. వ్యావహారికం అన్నారు. మాండలీకం అన్నారు. నుడి అన్నారు. ప్రాంతీయం అన్నారు. యాస అన్నారు. ఇదే మా బాస అంటున్నారు. భాషకి బాసకి తేడా తెలియకుండా పోయింది. వెల్లు, (వెళ్ళు అని అర్ధం చేసుకోవాలి). ఇలా కోకొల్లల్లు. జ్నానమా..జ్ఞానమా? ఇదే ప్రామాణికామా?
ప్రతి ప్రాంతానికి, ఒక భాష, ఒక మాండలికం ఉన్నట్టు, ప్రతి రచయితకి ఒక స్పెల్లింగ్ స్టైల్ ఉంటుందా? భాష కి ఎల్లలు లేవు. ఉండకూడదూ కూడా! రచయితకి అచ్చుతప్పులుండవా? అసలు తప్పులేకుండానే వ్రాస్తున్నాడా? ఆ రచయిత వ్రాసినదే ప్రామాణికమా? జ్నానమా..జ్ఞానమా? ఏది ఒప్పు? ఏది తప్పు?
కంప్యూటరులో టైపింగ్, టైము లేదనడం సరికాదు. అంత అర్జంటు గా ఆ సెండ్ బటని నొక్కకపోతే ఏమయ్యింది? ఎందుకని ఈ అసహనం? ఇది అడిగినవాడు చాందసుడా, సనాతన వాదా? అది మీకే తెలియాలి!
వ్రాసేవాడికి చదివేవాడంటే లోకువ! మరి అంతలోకువా? పాఠకుడంటే అంత నిర్లక్షమా? తాను ఏది వ్రాసినా, చదివేసే గాడిదా? అంత అహంకారమా? మనకొక సామెత ఉంది. అన్ని ఉన్న ఆకు, అణిగి మణిగి ఉంటుంది అని! ఎదిగిన కొద్ది, తగ్గి ఉండటం అంటే అదే మరి!