చనుప, నెరవు, తెరువు, దడము, బడిమి, పుంత, నడవ, మయి, జాడ, ఓణి, కంతి, చొప్పు. వీటన్నింటికి ఒకటే అర్ధం, తెలుగులో దారి అని. తెరువు అనే పదాన్ని “అంద చెన్నై మానగరిత్తిలే,” వాళ్ళు వాడగా విన్నాను, నేను వాడాను. వాళ్ళు ఇంకా వాడుతున్నారు. రెండు వందల పదహారు పేజిల కతల గంప లో
18 కతలున్నాయి. అందులోని ఆఖరి కతే, విశాలాక్షి మాస పత్రిక తమ అక్టోబర్ 2014 సంచికలో ప్రచురించింది. ఆ కధే కథ 2014 లో కూడా చోటు చేసుకుంది.
ఉత్తరపొద్దు (2003), ఊడల్లేని మర్రి (2006 ), రయికముడి ఎరుగని బతుకు(2012), సిడిమొయిలు (2013), ఇదిగో ఈ రెండువేల పద్నాలుగులో ఈ దారమ్మ చెప్పిన కత. మొన్న అంటే రెండవ ఆదివారం సెప్టెంబరు 13 న ఈ కథను గురించి కూడా వేదిక సభ్యులు చర్చించుకున్నారు. కధానిలయంలో ఈ కథకుడి కథల పట్టిక ఇక్కడ చూడోచ్చు.
తొలికధ మీసర వాన. 2002 లో నడుస్తున్న చరిత్ర లో ప్రచురితం. నడుస్తున్న చరిత్ర ఇప్పుడు అమ్మనుడి గా సామల రమేశ్ బాబు గారే మాస పత్రికగా ప్రచురిస్తున్నాను. చేతులు మారలేదు.
ఇక కధానిలయం లో కల్పన రెంటాల కథలు మూడు మాత్రమే నమోదయ్యాయి. తన తొలి బ్లాగ్ నవల తన్హాయి. కొంత అలజడిని, ఆసక్తిని కలిగించిన ఆ నవల గురించి ప్రస్తావన లేదు మరి ఎందుకనో. వీరి తొలి కధ ఋతుభ్రమణం వార్త వారి ఆదివారం అనుబంధంలో 2003-12-14 లో ప్రచురించారు. కధ 2014 లోకి ఎన్నుకున్న ఈ కధ ప్రాతినిధ్య 2014 కధాసంపుటంలో కూడ ఉంది. వేదిక కూడ ఈ కధని చర్చించుకుంది. కల్పన బ్లాగ్ ఇక్కడ.
“ఇండియాకి వస్తున్నాను,” అని అనగానే వేదిక సభ్యులతో ఒక సాయంత్రం ఏర్పాటు చేస్తాను మీకు వీలుంటే అనగానే సంతోషంగా ఒప్పేసుకున్నారు ఈ కథకుడు. అలాగా ఏప్రిల్, 2015 లో ఒక ఆదివారం, 5వ తారిఖున గొర్తి సాయిబ్రహ్మానందం – వేదిక కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.
ఈ కధకుడి కధలు కొన్ని ఇదివరకు కధాసాహితి సంపుటిలో చేరినవి; అతను (2009), సరిహద్దు (2011), ఈ సారి కూడా. కధకోసం ఆ సంపుటిని చూడాల్సిందే! 🙂
1978 లో తొలి కధ ప్రచురించుకున్న కవి విమల. ఆ పత్రిక నూతన. అవును కవి.
కధలు కూడా వ్రాస్తారు.
2015 మార్చ్ ఒకటిన, వేదిక నిర్వహించిన కధ నిన్న – నేడు – రేపు లో వీరు కూడ నిర్వాహకులుగా తమ సహాయాన్ని అందించారు. వేదిక వీరి కధను కూడ చర్చకు తీసుకుంది. ఆ కధే ఈ కధ 2014 లో కూడా ఉంది.
మొన్న ముగ్గురు కథకులు, మరో ముగ్గురు కధకులు గురించి చెప్పాను. ఇక ఇంకో ముగ్గురు కాక ఇంకొకరు కధకుల గురించి తెలుసుకున్నారు. ఈ టపాతో కధ 2014 లోని కధకులు ముగ్గురూ మరొకరు కధకులందరి గురించి కొంత చెప్పాను. ఇక కధ 2014 వివరాలు రేపు కొన్ని చెప్తాను.
కధ 2013
ప్రతులకు
కధాసాహితి, 164, రవి కాలని, Tirumalgherry, Secunderabad 500 015.
ధర: అరవై రూపాయలు / పది అమెరికన్ డాలర్లు
గమనిక: తపాల / కొరియర్ ఖర్చులు అదనం