కుక్క బిస్కత్తులు కుక్కలు తింటాయ్.
యజమాని బిస్కత్తులు ఎప్పుడు విసురుతాడా అని ఎదురుచూస్తూ ఉంటాయ్.
అచ్చం మనుషుల్లాగానే, నక్కలు, తోడేళ్ళు కూడా ఉంటాయి, కుక్కల్లాగా తింటాయి!
కాని సింహం అలా కాదు.
ఎవరో వొచ్చి పెడతారని ఎదురు చూడదు.
ఆకలి వేస్తేనే వేటాడుతుంది.
ఆకలి వేసినప్పుడు సింహాం పంజా విసురుతుంది.
మెడని విరిచి, చంపి తాపీగా తింటుంది.
తను తినగా మిగిలితే వదిలేస్తుంది.
కడుపునిండినా కుక్కుకుంటూ కూర్చుని తినదు.
నక్కలకి తోడేళ్ళకి, రాబందులకి, డేగలకి ఇతర ప్రాణకోటికి వదిలేస్తుంది.
కుక్కలాగా మనిషి కాళ్ల దగ్గిర కూర్చుని దేబిరిస్తూ ఉండదు, సింహం.
సింహం మృగరాజు. రారాజు.
ఏనుగులాగా చచ్చినా బ్రతికిఉన్నా దాని విలువ దానిదే!
జీవించినంత కాలం సింహం లా జీవించాలి!
ఉద్యోగం కోసం అటు నుండి నరుక్కు రావడం గురించి తెలుసా?
మీ ముందే ఉంది. మీరు ప్రతి రోజు వెడుతున్న ఆ రోడ్డులోనే ఉంది. మీరు వెళ్ళే గుడిలోకూడా ఉంది. మీరు రోజు వెళ్ళే భోజనం చేసే మెస్సులో ఉంది ఉద్యోగం.
మీరే దాని వంక చూడటం లేదు. దానిని పట్టించుకోవడం లేదు. పిల్లిని చంకలొ పెట్టుకుని ఊరంత వెదికినట్టు, ఒళ్ళొ ఉన్న ఉద్యోగవకాశాన్ని వదిలేసి దేశం అంతా
తిరుగుతా నంటున్నారు.
మీముందు కూర్చుని మీ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూస్తున్న మీరు గుర్తించడంలేదు.
ఆ మధ్య వచ్చిన హచ్ పప్పిలా అది మిమ్మల్ని వెంటాడుతోంది. తోకాడిస్తూ మరి వెంటాడుతుంది. మీరే దాన్ని పట్టించుకోకుండా ఇంకేటోచూస్తున్నారు.
అబ్బా అపండి, మీ సోది..అసలు విషయం చెప్పండి అంటారా?
“Wanted” కాలం కనబడటం లేదా?
మీ జిమైల్ / యాహూ మైల్లోనూ కనపడటం లేదా?
గుడిలో ఆ కార్పరేట్ ష్టైలో టీ వేసుకున్న పెద్దమనిషిని ఆయన సంస్థలో ఉద్యోగవకాశాలున్నాయా అని అడగలేక పొయ్యారా?
ఫ్రంట్ ఆఫీసులో “సెక్రటరి” గా చేస్తున్న పక్కి ఫ్లాట్ “ఆంటీ” ని అడిగారా? మెస్సులో ఎదురుగా సాంబారుని జుర్రుకుంటున్న ఆయన్ని అడిగారా?
మొదట్లోనే అనుకున్నాము కదా, మనకి తెలియని ఖాళీలు చాలా పూర్తి ఐపోతున్నావని? మరి వాటిని అందుకోవడాఅనికి ఏం చేసారు?
సరే, మనవైపు నుంచి నరుక్కుంటూ వెడితే ఉద్యోగం ఉందని తెలుస్తుంది..కాని అటువైపు నుండి నరుక్కు రావడం గురించి తెలుసా?
అదేమి పెద్ద బ్రహ్మ విద్యేమి కాదు. మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధి అని వారికి తెలియజేయాలి కదా? లేకపోతే వారికి ఎలా తెలుస్తుంది, మీకు ఉద్యోగం కావాలని?