ఏం ఉద్యోగం తెలవదు, ఎక్కడో తెలవదు, ఎందుకో తెలియదు, ఇక అప్పుడే రెజ్యుమే అంటారేంటి అని అనొద్దు! 6వ క్లాస్ నుండి , స్పెషల్ క్లాసుల్లో,
టెక్నికల్ స్కూల్స్ లో ఐ.ఐ.టిల కోసం, మెడిసిన్ కోసం మీ వాళ్ళు మిమ్మల్ని కష్టపడి, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా చదివించారు.
ఈ రోజు ఈ ఉద్యోగం నాకు ఎంత జీతం ఇస్తుంది, నేను కోరుకున్నంత జీతం ఇస్తుందా అని అలోచించుకునేటప్పుడు, మనకి ఎలాంటి ఉద్యోగం
ఐతే మంచిది అన్న కనీసపు అవగాహన లేకుండా ఎలా ఉద్యోగం కోసం వెతుకుతారు? ఎక్కడని వెతుకుతారు?
అది గమనించండి. ముందు
మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీ కావల్సినంత జీతం ఇచ్చే ఉద్యోగ లక్షణాలను గుర్తించండి! తరువాత మిగతా విషయాలు ఆలోచిద్దాం!
అది తెలిస్తే, ఈబ్లాగు చదవతూ కాలాన్ని వృధా చేసుకోవడం ఎందుకంటారా? ఐతే ఆగండి, మళ్ళీ టపాలో అవేంటో చెబుతాను.
ఈలోపు బోరు కొట్టకుండా ఈ పది గూగుల్ ఇంటర్యూ ప్రశ్నలు చదువుకోండి!