చంద్రశేఖర అజాద్ పుస్తకం ‘కవిగారి అంతరంగాలు’ కి ఒక ముందుమాట

రెండో ముందు మాట

గతంలో మిత్రుడు చంద్రశేఖర అజాద్ రాసిన ఒక నవల విపరీత వ్యక్తులు కి ఒక ముందు మాట తన బలవంతం మీదే రాసాను. ఈ కవిగారి అంతరంగాలు కి రాసిన ముందుమాట తన పుస్తకమే. ఇందులో కూడా తన మిత్రులు కవిరాజు, , గఫార్ గారలతో పాటు ఎందుకో నాతో కూడా రాయించుకున్నాడు. ఇది నిన్న తనకోసం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాను. అది అందరికి అందుబాటులో వుండదని ఇక్కడ ఇస్తున్నాను.

  

ఇక్కడ ముందు మాటలో చెప్పినట్టు మిత్రుడు ఆజాద్ ప్రతిభావంతుడు కాకపోతే దాదాపు వంద నవలలు రాయగలడా? దాదాపు వెయ్యి కథలు రాయగలిగేవాడా? సరే అవన్ని పక్కన పెడితే సుమారుగా ఒక ఐదువేల టీ వీ సిరియల్ ఎపిసోడ్స్‌కి స్క్రిప్ట్ అందించగలిగేవాడా? కవితలు రాసి మెప్పించగలిగేవాడా? 
బాల సాహిత్యం రాసి మరి కేంద్ర సాహిత్య పురస్కారం కూడా అందుకున్నవాడు.
మరి అటువంటి మనిషి ఇటీవలే విడుదలైన తన ‘కవిగారి అంతరంగాలు’ (తన ఆత్మకథ కాదు తన పరిశీలనకు అందిన వాటి గురించి)కు ముందుమాట రాయమని నా మీద ‘ప్రేమ’ తోనే అడిగాడని అనుకోవాలి.  నా బలహీనత. గట్టిగా కాదనలేకపొయ్యాను.  కాకపోతే కవులు, కాబోయే-కవులు, ‘కవి’ బిరుదు తగిలించుకోవాలనుకునేవారికి కొన్ని ‘ఘాటు’, కొన్ని ‘స్వీటు’ సలహాలతో నిండిన ప్రయణామవుతుంది తన ‘కవిగారి అంతరంగాలు’. అంతే కాక తన అంబుల పొది నుంచి కొన్ని బాణాలు కూడా సంధించాడు ప్రస్తుతం వున్న తెలుగు సాహిత్య ప్రపంచం మీద. 
సరే. ఇక్కడికి ఇది ఆపుదాం. ముందు మాటలో కి పదండి. 

   
ఇంకా వుంది
‘నేను ఆల్క హాలికుణ్ణి అయ్యాను.’ పద్యమే మద్యం కాదు ఈ రచయితకి. అలాగని సభానంతర
కార్యక్రమాలలో పాల్గొనలేదని కూడా చెప్పలేము. ఎందుకంటే ఈ కవి సాధారణంగా సాహితీజీవులతో కనపడడు. కాలానుగుణంగా కలాన్ని విదిలిస్తాడు.
అది పద్యమో, గద్యమో ఔతుంది. ‘శ్రీశ్రీ కవిత్వంలో మేధావులకు కూడా అర్థం కాని విషయాలున్నవి’ అని అందరు ఒప్పుకోని నిజాన్ని బద్దలుకొడతాడు. అందుకనే
కొన్ని సాహితీ సమూహాలు ఈ కవిని దూరంగా పెడతాయి.

నిజమైన విమర్శకులు ఒకప్పుడుండేవారు. బృందాలుగా దాడులు చేస్తున్న
కాలమిది, అని చెప్తూ ‘ఆ సమస్త దాడులకు నేను తయారుగా వున్నాను’ అని అంటున్నాడు.
నాకు అవార్డులు, రివార్డులు అక్కర్లేదు. కనీసం కొద్దిమంది పాఠకులైనా
నన్ను గుర్తిస్తే చాలంటున్నాడు. కవికి కావాల్సింది క్రిటిక్కులు కాదు, రెండు
‘వహ్వాలు’. అలాగని కవిత్వం రాయడం మార్నింగ్ వాక్ కాదు అని ఈ కవి
అంటున్నది నిష్టూర సత్యం.

తనలోకి తను చూసుకుంటున్న ఆత్మవిమర్శలో కవితకి ఏం కావాలో,
ఎలా కావాలో ఎలా వుండాలో అన్నది ఈ ‘కవిగారి అంతరంగాలు’లో వుంది.
తన ఏడుపదుల జీవితంలో వందల కథలు, నవలలు, కవితల నేపధ్యంలో
జీవితాన్ని వెలికి తీసి చెప్పుకుంటున్న డాక్యుమెంట్ ఇది. కలం పట్టుకున్న ప్రతివారు
ఈ ‘కవిగారి అంతరంగాలు’ని తెరిచి, తరచి చూడాల్సిందే.
  
/
‘కవిగారి అంతరంగాలు’
ధర: ₹100-00
ప్రతులకు:
నవోదయ, హైదరాబాద్ వారి ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌ లో కూడా తీసుకోవచ్చు. 
Navodaya Book House 
3-3-865,Opp Arya Samaj Mandir,
Kachiguda,Hyderabad, 
Pin Code: 500027
Mob:+91-9000413413,
 * 
విజయవాడలో : 
కలిమిశ్రీ  
Malleteega Prachuranalu,  
3rd Floor, Subhasri Towers,  
Vuyyoor Zamindar Street, Gandhi Nagar,   
Vijayawada PIN 520 003  
Mobile: 92464 15150

A book titled kavigaari aMtaraMgaalu by Chandrasekhara Azad. Cover page along with an image of the foreword text by Anil Atluri



  