శ్రీదేవి అయ్యప్పన్ తో నా పరిచయం

శ్రీదేవి ఆ క్రితం రాత్రి చనిపోయిందన్న వార్త Facebook లో చదవగానే ఒక చిన్న షాక్!  అప్రయత్నంగానే “అయ్యో!” అనిపించింది.  అంత చిన్న వయసులోనే పోవడం, పైగా ఊహించని విధంగా! ఎంత వరకు నిజం అని తెలుసుకోవడానికి, వెంటనే గూగుల్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంటే…ఆమె తండ్రి, అయ్యప్పన్ గారు, తల్లి రాజేశ్వరి, చెల్లెలు శ్రీలత గుర్తు వఛ్హారు.  అంతేకాదు, బహుశ వారి బంధువు మరొకమ్మాయి కూడా గుర్తు వఛ్హింది. వీళ్లందరితో పాటు అయ్యప్పన్ గారిని పరియం […]

స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

Telugu author Volga at Vedika Literary Meet

ఓల్గా గారి కథల సంపుటి ‘విముక్త’కు కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడమనేది ఒక వాదాన్ని చెప్పడంతో పాటు, ఆ వాదాన్ని చెప్పడానికి ఎంచుకున్న ఒక సరైన సాహితీ ప్రక్రియ వల్లే సాధ్యమైందని భావిస్తున్నట్లు ఒక అభిప్రాయం వినిపించింది. దాంతో పాటు ఈ సాహితి ప్రక్రియలో మీదైనా ముద్రను తేవడానికి ఎలాంటి కృషి చేశారు? అన్న ప్రశ్నకు ఓల్గా గారు సమాధానమిస్తూ.. “ఒక వాదాన్ని చెప్పేందుకు ఎంచుకునే భాషలో కూడా ప్రయోగం, కొత్తదనం చూపాలి. అప్పుడే అందరికీ ఆ ఆలోచన చేరడంతో పాటు దానికి ఒక అర్థం వస్తుంది. నా వరకూ నేను నా భాష పరంగా ఎదగడం ఎప్పటికప్పుడు సాహిత్యంతో స్నేహం వల్లే సాధ్యమైంది” అన్నారు.