వెండి తెర నవలలు – అట్లూరి పిచ్చేశ్వరరావు
సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు. వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేషన్లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు. అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద చిత్రాలే గతి. ఒకటికి పది సార్లు చూడటానికి అవకాశం లేని వారు, ఎన్టీవోడి డవిలాగు, ఏ ఎన్ ఆర్ ఎస్వీఆర్ […]