కధ 2014…ఇంకో ముగ్గురు కధకులు కాక ఇంకొకరు

katha 1990 to 2009

కధాసాహితి వారు రానున్న ఆదివారం సెప్టెంబరు 20న, 2015 తెనాలి లో ఆవిష్కరించనున్న కధ 2014 సంపుటిలోని కధకుల వివరాల పరంపరలో ఈ టపా మూడవది. ఈ సంపుటి సంపాదకులు పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్.

ఈ దశాబ్దం నవలది, తెలుగు కథ ది!

ముందున్నది మూడు చెరువులు. ఒడ్డున్న ఉన్నది అప్పుడే వాటిల్లో మునిగి, ఈది, తేలి, గట్టుకు చేరిన సుశిక్షుతులైన గజ ఈతగాళ్ళు. ఆ చెరువులు చెరువులేనా?.. ద్రోహ వృక్షం, నల్లమిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం. ఒడ్డున్న ఉండి మళ్ళీ దూకడానికి ఉద్యుక్తుడవుతున్న నవయువకుడు శివారెడ్డి..కానీండి ఇంకా చూస్తారే?..నేనైతే ‘జీవని‌’ లోకి దూకాను. ‘ఐదు హంసలు‌’ని కూడా చూసాను. దూకడమే..అలా ఒడ్డున నిలబడిపోతే మీ జీవితంలో ఒక ఎపిక్ ప్రపోర్షన్‌ లో ఒక అనుభవాన్ని కోల్పోతారంటాడు.

కొత్త తరం పాఠకులు వచ్చారు!
కొత్త తరం పాఠకులు వచ్చారు. నేనంటున్నది కూడా అదే. నవ్య సంపాదకులు అంటున్నది అదే! కవి శివారెడ్డి అంటున్నది అదే. ప్రభాకర్ గారు అన్నది అదే! సీతారాం చెబుతున్నది అదే! గుడిపాటి చెప్పింది అదే! మీరందరూ చదవవలసిన పుస్తకాలు ఇవి.