కధ 2014… కధకులు ముగ్గురూ…మరొకరు

చనుప, నెరవు, తెరువు, దడము, బడిమి, పుంత, నడవ, మయి, జాడ, ఓణి, కంతి, చొప్పు. వీటన్నింటికి ఒకటే అర్ధం, తెలుగులో దారి అని. తెరువు అనే పదాన్ని “అంద చెన్నై మానగరిత్తిలే,” వాళ్ళు వాడగా విన్నాను, నేను వాడాను. వాళ్ళు ఇంకా వాడుతున్నారు. కధ 2014.
కధ 2014…ఇంకో ముగ్గురు కధకులు కాక ఇంకొకరు

కధాసాహితి వారు రానున్న ఆదివారం సెప్టెంబరు 20న, 2015 తెనాలి లో ఆవిష్కరించనున్న కధ 2014 సంపుటిలోని కధకుల వివరాల పరంపరలో ఈ టపా మూడవది. ఈ సంపుటి సంపాదకులు పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్.
కథ 2014 … మరో ముగ్గురు కథకులు

కథ 2014, కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది. ఒక పరంపరగా ప్రతి సంవత్సరం వెలువడుతునే ఉంది. కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో. కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ. ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి. ఆ అధ్యక్షుల వారిది తెనాలి. పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.
కథ 2014…ముగ్గురు కథకులు
నిరంతరాయంగా గత పాతికేళ్ళుగా వార్షిక కధా సంకలనాలన్ని ప్రచురిస్తున్న కథాసాహితి, ఈ సారి తన కథ 2014 ని తెనాలి లో ఆవిష్కరిస్తున్న చారిత్రక సందర్భం. ఆ సందర్భగా ఆ కధ 2014 లో చోటుచేసుకున్న కథకులని సంక్షిప్తంగా పరిచయం చెయ్యడమే ఈ టపా ఉద్దేశం.
కతల గంప – స వెం రమేశ్
నేను పరిగెత్తి తెరువులోకి పొయినాను. ఒక అవ్వ పెద్దగంపను తలమీద
మోస్తా “కతలమ్మా కతలూ…” అని అరస్తా వస్తుండాది. నేను గబ గబ ఆ
అవ్వకు ఎదురుపోయినాను. నన్ను చూసి నిలిసి “అబయా, కతలు కావాల్నా.
మంచి మంచి క్తలుండాయి. అరవళ్ళిసూరవళ్ళి కత, నల్లతంగ కత,
కాంతరాజు కత, కాత్తవరాయని కత, కమ్మపణితి కత, ఈడిగసత్తెమ్మ కత,
కాటమరాజు కత, మదురవీరుడి కత, మాచాలమ్మ కత, రేణిగుంట రామిరెడ్డి
కత… ఇంకా చానా చానా కతలుండాయి. అరపడి వడ్లకు ఒక కత, పడి
తైదులకు ఒక కత. కావాలంటే అవ్వనడిగి వడ్లో తైదులో తేపో కొడుకా”
అనింది ఆ అవ్వ.