వర్క్‌ప్లేస్‌లో ఎలా గెలవ్వోచ్చు…ఇలా

తెలుగులో పర్సనాలిటి డెవలప్మెంట్ పుస్తకాలు చాలా వచ్చినవి కాని వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి లాంటి అన్న పుస్తకం వచ్చినట్టు లేదు. కాబట్టి ఈ పుస్తకం అవసరమైనదే ఉద్యోగస్తులకి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, చిన్న యాజమాన్యాలకి కూడా!
స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

ఓల్గా గారి కథల సంపుటి ‘విముక్త’కు కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడమనేది ఒక వాదాన్ని చెప్పడంతో పాటు, ఆ వాదాన్ని చెప్పడానికి ఎంచుకున్న ఒక సరైన సాహితీ ప్రక్రియ వల్లే సాధ్యమైందని భావిస్తున్నట్లు ఒక అభిప్రాయం వినిపించింది. దాంతో పాటు ఈ సాహితి ప్రక్రియలో మీదైనా ముద్రను తేవడానికి ఎలాంటి కృషి చేశారు? అన్న ప్రశ్నకు ఓల్గా గారు సమాధానమిస్తూ.. “ఒక వాదాన్ని చెప్పేందుకు ఎంచుకునే భాషలో కూడా ప్రయోగం, కొత్తదనం చూపాలి. అప్పుడే అందరికీ ఆ ఆలోచన చేరడంతో పాటు దానికి ఒక అర్థం వస్తుంది. నా వరకూ నేను నా భాష పరంగా ఎదగడం ఎప్పటికప్పుడు సాహిత్యంతో స్నేహం వల్లే సాధ్యమైంది” అన్నారు.
త్రిపురనేని గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం 2015

Sir William Mark Tully receiving the Tripuraneni Gopichand National Literary Award for the year 2015 on the CV birth anniversary of late Gopichand.
కధ 2014… కధకులు ముగ్గురూ…మరొకరు

చనుప, నెరవు, తెరువు, దడము, బడిమి, పుంత, నడవ, మయి, జాడ, ఓణి, కంతి, చొప్పు. వీటన్నింటికి ఒకటే అర్ధం, తెలుగులో దారి అని. తెరువు అనే పదాన్ని “అంద చెన్నై మానగరిత్తిలే,” వాళ్ళు వాడగా విన్నాను, నేను వాడాను. వాళ్ళు ఇంకా వాడుతున్నారు. కధ 2014.
కధ 2014…ఇంకో ముగ్గురు కధకులు కాక ఇంకొకరు

కధాసాహితి వారు రానున్న ఆదివారం సెప్టెంబరు 20న, 2015 తెనాలి లో ఆవిష్కరించనున్న కధ 2014 సంపుటిలోని కధకుల వివరాల పరంపరలో ఈ టపా మూడవది. ఈ సంపుటి సంపాదకులు పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్.
కథ 2014 … మరో ముగ్గురు కథకులు

కథ 2014, కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది. ఒక పరంపరగా ప్రతి సంవత్సరం వెలువడుతునే ఉంది. కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో. కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ. ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి. ఆ అధ్యక్షుల వారిది తెనాలి. పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.
కథ 2014…ముగ్గురు కథకులు
నిరంతరాయంగా గత పాతికేళ్ళుగా వార్షిక కధా సంకలనాలన్ని ప్రచురిస్తున్న కథాసాహితి, ఈ సారి తన కథ 2014 ని తెనాలి లో ఆవిష్కరిస్తున్న చారిత్రక సందర్భం. ఆ సందర్భగా ఆ కధ 2014 లో చోటుచేసుకున్న కథకులని సంక్షిప్తంగా పరిచయం చెయ్యడమే ఈ టపా ఉద్దేశం.
పగలని గోళీ

కుడిచేతి చూపుడు వేలుని ఎడమచేతి చూపుడు వేలుతో పూర్తిగా వెనక్కి లాగి, ఆరు జానలవతలున్న నీలం రంగు గోళీ మీదకి తన పసుపురంగు గోళీని గురిచూస్తున్నా, వాడి చెవులిక్కడ లేవు. అక్క ఫియట్ కారు హార్న్ చప్పుడు వినడం కోసం ఎదురు చూస్తున్నవి. వాడి దృష్టి నీలం రంగు గోళీ మీదున్నా, పక్కన చెవిపోగు గాడి చెమట కంపు నాసికల ద్వారా అందుతున్నా, అక్క పూసుకునే కునేగా సెంటుతో వాడి బుర్ర నిండిపోయింది. వాడి దృష్టికిప్పుడు అక్క కనబడుతోంది! వాడి కుడి భుజం మీద చెలికాడి అరిచేయి స్పర్శ వాడికి అక్క నునువెచ్చని స్పర్శనే గుర్తుచేస్తోంది.
కోపం వచ్చి వ్రాసిన కథ ‘అదితి’

అప్పుడెప్పుడో నేనేదో వ్రాస్తే దాన్ని చదివి ఒకానొక రచయిత “మీరే వ్రాసారా? ఎవరైనా ఎడిట్ చేసారా?” అని అడిగితే ఆ ప్రశ్నకి కోపంవచ్చి వ్రాసుకున్న కథలలో ఈ ‘అదితి’ ఒకటి. “…నట్లు కొట్టకుండా, ఆపకుండా చదివించింది మీ కథ,” చాలా మంది పాఠకులు నాకు తెలియజేసిన అభిప్రాయం ఇది.
మురుగన్ ‘తలుగు’ విదిలించుకున్నాడు!

ప్రొతిమ (గౌరి) బేడి జవాబు, “It is the business of society. It would stop, point out something that catches its attention and then moves on. It has other businesses too on its agenda. It happened the same with me too. I knew it would raise it’s finger at me. It did and then it moved on to the next one. It doesn’t bother me any more.”