Unable to see Telugu letters ?
Click here.
ఇంగ్లిష్ భాషలో పదాలతో ఆడుకొవడానికి ఒక మంచి ఆట ఇది. ఆటతో పాటుగా కొత్త పదాలను నేర్చుకొవడం సులువు. ఆ భాషలో దీనిని “స్క్రా బిల్” అని పలుకుతారు. ఇద్దరు లేదా నలుగురు ఈ ఆటని ఆడవచ్చు. నిలువుగాకాని, అడ్డంగాకాని ఒక వరుసక్రమంలో, అక్షరాలను పేర్చి అర్ధవంతమైన కొత్త పదాలను కూర్చడమే ఈ ఆట ఉద్దేశ్యం. అందుకనే ఈ ఆట నేడు సుమారుగా 120 దేశాలలో, 29 భాషలలో ప్రాచుర్యంపొందింది.
డచ్ భాషలోని పదం – ‘schrabbelen’ నుండి ఇంగ్లిష్ లోకి ఇది వచ్చిచేరింది. ఆ భాషలో దానికి ‘గీకడం’ లేదా “బరకడం” అని అర్ధం . గోళ్ళతో గీకడం, పెచ్చులు గీకడం, నెమ్మదిగా పొరల పొరలను గీకి తీసేయ్యడం ఈ పదానికి ఆ భాషలో అర్ధం.
అలాగే ఎంతో కొంత శ్రమ, ప్రయాస, కొంత పోరాటంతొ (to struggle, scramble) ఏదేని సాధించడం అని కూడా చెప్పుకొవచ్చు. ఈ అర్ధంతో ఈ పదం 1635 ప్రాంతాలలో వాడుకలోకి వచ్చిందని ఒక అంచనా.
1950 ప్రాంతాలలొ ప్రస్తుతం ప్రాచుర్యంలో వున్న ఈ పేరు “స్క్రా బిల్” తో ఈ ఆట బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఆట కొన్ని ప్రాంతాలలో Alfapet, Funworder, Skip-A-Cross and Palabras Cruzadas అన్న పేరులతో కూడా బహుళ జనాదరణ పొందుతు వ్యాపిస్తున్నది. ఈలాంటి ఆట మన తెలుగు భాషలో ఉంటే మనం కూడా చక్కగా ఆడుకుంటూమనకు తెలియని ఎన్నొ కొత్త పదాలను నేర్చుకోగలుగుతాము, కదా?
బ్రహ్మపురము మందేరా
పర్లాకిమిడి మందేరా
కాదనివాదుకివస్తే
కటంకదాక మందేరా!
బస్తరేల్లా మందేరా
జయపూరంతా మందేరా
కాదనివాదుకివస్తే
నాగపురుదాకా మందేరా!
గోలకొండ మందేరా
తెలింగానా మందేరా
కాదనివాదుకివస్తే
నైజామంతా మందేరా!
చెన్నపురము మందేరా
చంగల్ పట్టు మందేరా
కాదనివాదుకువస్తే
తంజావూరు మందేరా!
బెంగుళూరు మందేరా
బళ్ళారి మందేరా
కాదనివాదుకువస్తే
కన్నడ మర్ధం మందేరా!
దేవికోట మందేరా
పుదుక్కోట మందేరా
కాదనివాదుకువస్తే
కాండే దాకా మందేరా!
– “కవిరాజు” త్రిపురనేని రామస్వామి, శతావధాని
– ‘manderaa’ by “Kaviraju” Ramaswamy Tripuraneni
* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.
భాగ్యనగరం హెడ్డ్ ఆఫీసుగా, మిగతా నగరాలాలో, ఇతర రాష్ట్రాలలోను మేనేజ్ మెంట్ కోర్సులను ఆఫర్ చేసె ఒకానొక యునివర్సిటి విద్యార్ధిని, ఉద్యోగార్ధియై మా దగ్గిరకు
వచ్చింది.
అ అప్లికేషన్ క్జెరాక్జ్స్ (Xerox) కాపీ అంటే ఫొటొస్టాట్ అన్నమాట. అసలుదికాదు. నకలు. అంటే ఒక పది సంస్థలకు దరఖాస్తులు పెట్టుకున్న తరువాత ఇంకా ఎమిటిలే ఇంకొక బోడి ఉద్యోగమేగా
దానికి ఈమాత్రం చాలులే అన్న ధోరణి ఆ అప్లికేషన్ చూడగానే కనపడుతుంది. నకలు కదా అందుకని దానినిండా కొట్టివేతలు, తుడుపులు, దిద్దివేతలును. అంతటితో ఐతే ఫరవాలేదు.
దాని నిండా షూ హీల్స్ బురద మరకలు. వాటన్నింటితోనూతోను చక్కగా ముస్తా బై ఉన్నదది.
“అమ్మో, అమ్మో”, అనుకుంటూ (సూర్యకాంతంలా) ఆ అప్ప్లికేషన్ని, సదరు అభ్యర్ధిని నా వరకు రానివ్వకుండానే వెనక్కి పంపించేసాను. ఆ అమ్మాయి భొరున విలపిస్తు బక్కిట్లకొద్ది కన్నీరు కార్చిందంట. అబ్బే, మావాళ్ళు ఏమాత్రము కరగలేదు.
తప్పు ఆ విద్యార్ధినిదికాదు. మరి ఎవరిది ?
మాలవాడలాబాట, మహితభూసురపేట,
నొక్కరీతిగ జిందు తొక్కినావు!
మాలగేస్తునింట, మహితభూసురినింట,
నొకరీతిబదముల నుంచినావు!
మాలపెద్దాలచెవి, మహితభూసురుచెవి,
నొకరీతి సామెతలూదినావు!
కన్నబిడ్డలదెస నొక్క కనికరంబె
చూపి, యెల్లవారికి దారి చూపినావు!
తల్లి! నీ మాట, నీ పాటదలుచుకొన్న
జలదరించుచు మేనెల్ల పులకరించు!
అతిశయభక్తిన్ వినుమా
ప్రతిభాషింపకయె తెనుగుభాష కుమారా!
అతిమధురం బతిపేశల
మతిపేయము కాదే బాసలన్నిటిలోలన్!
– “కవిరాజు” త్రిపురనేని రామస్వామి
– Telugutalli by “Kaviraju” Ramaswamy Tripuraneni
* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.
తెలుగు బావుట కన్నుచెదరగ
కొండవీటను నెగిరినప్పుడు-
తెలుగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు-
తెలుగువారల వేడి నెత్తురు
తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందునున్న సహ్యజ
కత్తినెత్తురు కడిగినప్పుడు-
ఇట్టి సందియమెన్నడేనియు
బుట్టలెదు రవంతయున్;
ఇట్టిప్రశ్నలడుగువారలు
లేకపోయిరి సుంతయున్!
నడుము గట్టిన తెలుగుబాలుడు
వెనుక తిరుగడెన్నడున్!
బాస ఇచ్హిన తెలుగుబాలుడు
పారిపోవడెన్నడున్!
ఇదిగో! యున్నది వీరగంధము
మై నలందుము, మై నలందుము;
శాంతిపర్వము జదువవచ్హును
శాంతిసమరం బైనపిమ్మట!
తెలుగునాటిని వీరమాతను
జేసిమాత్రము తిరిగిరమ్మిక,
పలు తుపాకులు, పలు ఫిరంగులు
దారికడ్డము రాకతప్పవు!
తెలుగుబిడ్డా! మరిచిపోకురా!
తెలుగుదేశము పురిటిగడ్డరా!
కొక్కరకొ పాటపాడరా!
తెలుగువారల మేలుకొల్పర!
– “కవిరాజు” త్రిపురనేని రామస్వామి
– Veeragandhamu by “Kaviraju” Ramaswamy Tripuraneni
* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.
కుప్పుస్వామి శతకము
గొంటరుల దుంటరుల గుమిగూర్చి సృష్టి
జేసి చీటికి మాటికి డాసి వారు
తన్నుకోని చచ్హుచుండగ దనియుచుండు
గొప్పవానికి జేజేలు కుప్పుసామి.
ఏడొ, పద్నాలుగో, మూడొ యెన్నో, జగము
లెల్ల సృష్టించిటువంటి యీశుడొకరో
యిర్వురో ,యెందరో వారికెల్ల నేటి
కోళ్ళ నర్పింతు భక్తితో గుప్పుసామి.
చిన్నపిల్లకును దల్లి చెప్పునటుల
దెలుగు మాటల పొంకంబు దీర్చిదిద్ది
తెలిసి తెలియక యర్ధంబు తెలియునటుల
జెప్పబూనితి గరదలు కుప్పుసామి.
మున్ను పెద్దలు చెప్పినవెన్నో కలవు
ఎన్నకుండిన నీతులు కొన్ని కలవు
పేరుగా గ్రుచ్హి మెడలోన వేతువాని
గుతిలపడకుండ దాల్చుము కుప్పుసామి.
కమ్మ నెత్తావి దెసలెల్ల జిమ్మునట్టి
గంధఫలి చెంతజేరదు గండు తేటి
తేనె లెదన్న సంగతి దెలిసికొనుచు
దప్పకీ నీతి స్మరియింపు కుప్పుసామి.
పూలుతెగబూసినప్పుడు మూగుచుండు
దేనెటీగలు పైబడి తేనె కొరకు
స్నేహితులు కొందరీరీతి జేరుచుందు
రప్పుడప్పుడు కనిపెట్టు కుప్పుసామి.
పండ్లచెట్టుక్రిందకు నెట్టి బాటసారి
యూరకే రాడు ఫలమును గోరివచ్చు
వాని నొకకంట గనిబెట్ట వలసియుండు
గోలకాకుండ సుంతైనా కుప్పుసామి.
ఒకనియెడ గృతఘ్నత జూపి యున్నవాని
నమ్మియుండుట తగదు లేశమ్ము కూడ
దనకు లాభంబు కల్గుచో దత్ క్షణంబ
ముప్పు తప్పక చేకూర్చు గుప్పుసామి.
ఒక్కమానవుండు డొక్కచీల్చినగాని
నారికేళఫలము నీరు నీదు
గొంటుకాని నిట్లు గోరాడకుండిన
నొప్పుకలుగనీడు కుప్పుసామి.
పిలువకుండ వచ్చి పెద్దమాటలు చెప్పు
వాని నెప్పుడు నమ్మవలదు, వలదు
మేలుకలుగబోదు మెరమెచ్చుల కతండు
తప్పుచెప్పుచుండు గుప్పుసామి.
నీతిలేనివాని నిరసించు జగమెల్ల
నీతిశాలికెప్పుడు నెగడు లేదు
నీతిశాలి నెపుడు నీతియే కాపాడు
గుజనుబారినుండి గుప్పుసామి.
నాలిమ్రుచ్చునెపుడు నమ్మరాదాతండు
కొంపదీయగలడు;కుదులకుండ
గొండచిలువ యట్టె గుటుకున దిగమ్రింగు
గుతిలపడగ జీవి గుప్పుసామి.
పరుని నీ ముందు దిట్టేడు వాడు
నిన్నునొరుని మొందట దిట్టక యుండబోడు
చనవు రవ్వంత వాని కొసంగరాదు
ముప్పుపుట్టు వానిని నమ్మ గుప్పుసామి.
* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.
ఆంధ్రజ్యోతి దిన పత్రికలో , దిక్సూచి అనుబంధంలో సెప్టెంబరు 19న ప్రచురించబడ్డ వ్యాసం ఇది. లైఫ్ స్కిల్ అవసరం గురించి నా కెరీర్ కార్నర్ వ్యాస పరంపరలో వెలువడినది. క్రింది బొమ్మ మీద క్లిక్ చెయ్యండి. చదువుకోవడానికి సులువుగా ఉంటుంది.
This is my way of saying ‘thank you‘ to Benerjee, a good friend of mine who had given me immense support when it was needed the most. This is also to tell the whole world ‘yes, he considers me to be one of his good friends”.