మొన్న అంటే జూన్ 15 వ తారిఖున ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి టివి (ABN Andhrajyothy) వారి దిక్సూచి ప్రోగ్రామ్ లో రెజ్యుమె గురించి ఒక అరగంట లైవ్ ప్రోగాం లో పాల్గొన్నాను. ప్రోగ్రాం సాయత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్య జరిగింది.
ఒక్క నిమిషం!
ఓబుళపురం
జమ్మలమడుగు కి ఎవైనా అనగ్రాంస్ (anagrams) ఇవ్వగలరా?
Can you share a few
anagrams
for
J A M M A L A M A D U G U?
స్క్రా బిల్ (Scrabble) Etymology
ఇంగ్లిష్ భాషలో పదాలతో ఆడుకొవడానికి ఒక మంచి ఆట ఇది. ఆటతో పాటుగా కొత్త పదాలను నేర్చుకొవడం సులువు. ఆ భాషలో దీనిని “స్క్రా బిల్” అని పలుకుతారు. ఇద్దరు లేదా నలుగురు ఈ ఆటని ఆడవచ్చు. నిలువుగాకాని, అడ్డంగాకాని ఒక వరుసక్రమంలో, అక్షరాలను పేర్చి అర్ధవంతమైన కొత్త పదాలను కూర్చడమే ఈ ఆట ఉద్దేశ్యం. అందుకనే ఈ ఆట నేడు సుమారుగా 120 దేశాలలో, 29 భాషలలో ప్రాచుర్యంపొందింది.
డచ్ భాషలోని పదం – ‘schrabbelen’ నుండి ఇంగ్లిష్ లోకి ఇది వచ్చిచేరింది. ఆ భాషలో దానికి ‘గీకడం’ లేదా “బరకడం” అని అర్ధం . గోళ్ళతో గీకడం, పెచ్చులు గీకడం, నెమ్మదిగా పొరల పొరలను గీకి తీసేయ్యడం ఈ పదానికి ఆ భాషలో అర్ధం.
అలాగే ఎంతో కొంత శ్రమ, ప్రయాస, కొంత పోరాటంతొ (to struggle, scramble) ఏదేని సాధించడం అని కూడా చెప్పుకొవచ్చు. ఈ అర్ధంతో ఈ పదం 1635 ప్రాంతాలలో వాడుకలోకి వచ్చిందని ఒక అంచనా.
1950 ప్రాంతాలలొ ప్రస్తుతం ప్రాచుర్యంలో వున్న ఈ పేరు “స్క్రా బిల్” తో ఈ ఆట బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఆట కొన్ని ప్రాంతాలలో Alfapet, Funworder, Skip-A-Cross and Palabras Cruzadas అన్న పేరులతో కూడా బహుళ జనాదరణ పొందుతు వ్యాపిస్తున్నది. ఈలాంటి ఆట మన తెలుగు భాషలో ఉంటే మనం కూడా చక్కగా ఆడుకుంటూమనకు తెలియని ఎన్నొ కొత్త పదాలను నేర్చుకోగలుగుతాము, కదా?