ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి

ఫుడ్‌కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ యాభై రూపాయలలో, చపాతి ఒక్కింటికి పది రూపాయల్చొప్పున్న రెండు చపాతీలకి ఇరవై రూపాయలు,
కరికి మరో ఇరవై రూపాయలు వెరసి నలభై రూపాయల్పోను తీసుకుని నాకివ్వాల్సిన పది రూపాయల చేంజ్ చేత్తో పట్టుకుని నా వైపొస్తున్న క్షణంలో…
నేను పప్పున్నసంచి, చపాతిరోలున్న సంచిన్ను అందుకుంటుంటే…

రామములక్కాయ ముక్క…

లెటెక్స్ గ్లవ్స్ అనుకుంటాను. అవితొడుకున్న కుడిచేత్తో, చపాతీలలోఒకటి తీసీ నెమ్మదిగా, నా ముందుంచిన మెలమైన్ ప్లేట్‌లో పెట్టాడు. ఇప్పుడు మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రిని సర్వ్ చెయ్యాలి.

చపాతిని కుడిచేయి చూపుడు వేలు అంచుతో, నా వైపున్న ప్లేట్ అంచుకి లాగాను. చపాతీకి అటువైపు ప్లేట్‌లో కొంచెం స్థలం ఉంది. నా ఉద్దేశం సెర్వర్ స్పూన్‌తో స్కూప్ చేసిన నా మిక్స్‌డ్ వెజ్ కరిని నా ప్లేట్‌లో అక్కడ ప్లేస్ చెయ్యాలని.

ఎడం చెయ్యి అరిచేతిలోకి బౌల్‌ని సర్ధుకున్నాడు.
కుడిచేత్తో స్పూన్ ని అందుకున్నాడు.
స్పూన్ ని బౌల్‌లోకి దూర్చి కర్రిని స్కూప్ చేసాడు.
అతి జాగ్రత్తగా నా ప్లేట్‌…

ఖుదర్దు

ఒక పదిరూపాయలనోటు మీద మరో పది రూపాయలనోటు, వాటి మీద మధ్యలో పెట్టిన ఒక అయిదు రూపాయల నాణెం దానిపైన పెట్టిన ఒక రూపాయ్ బిళ్ళని కాష్ కవుంటరు మీదుంచి నా ముందుకు తోసారు.