ఫైర్ఫాక్స్ (Firefox) ని మరింత శక్తిమంతమైన విహరిణిని (browser) చేసేవి, దానికి వాడే ప్లగ్ఇన్ / ఆడ్ఆన్ లు / ఎక్స్టెన్షన్లు (Plug-ins, Add-on, extensions). తెలుగులో వీటిని ఉపకరణములు అని పిలుచుకోవచ్చు. ఈ ఉపకరణాలలో తెలుగు భాషలో టైప్ చేయ్యాలనుకునే వారికి ఇండిక్ ఇన్పుట్ ఎక్స్ టెన్సన్ అతి ముఖ్యమైనది. తెలుగు పదాన్ని ఇంగ్లిష్ భాషలో టైప్ చేస్తే, ఈ ఉపకరణం మీ విహరిణి లో తెలుగు పదాలను చూపిస్తుంది.
హాట్మైల్, జీమైల్, యహూ మైల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఆర్కుట్ మొదలైన సోషల్ మెడియాలలో తెలుగు ని అంగ్లంలో బదులు, మన తెలుగు భాషలోనే టైపు చేసుకోవడం ఎలా అన్నది ఈ టపా ఉద్దేశం. తెలుగులో టైప్ చేసుకోవడానికి చాల పద్ధతులున్నవి. వాటిలో ఇది ఒకటి.
ఉదాహరణ: నా పేరు: అనిల్. దీనికి ఇంగ్లిష్ స్పెల్లింగ్ Anil. ఇండిక్ ఇన్పుట్ ఎక్స్ టెన్సన్ (Indic Input Extension) అనే అడ్ఆన్ని స్థాపించుకుని (install) ఇంగ్లిష్ లో Anil అని టైప్ చేస్తే అది అనిల్ అని తెలుగులో చూపిస్తుంది.
మరొక ఉదహరణ: రాముడు మంచి బాలుడు అని మీరు తెలుగులో టైప్ చెయ్యాలనుకుంటే Raamudu maMci baaludu అని ఇంగ్లిష్లో టైప్ చేస్తే అది తెలుగులో రాముడు మంచి బాలుడు గా మార్చి చూపిస్తుంది.
దీనికి మీరు చేయ్యవలసినవి:
మొదటి సోపానం (First step) మంట నక్క (Firefox) విహరిణి (browser) ని
ఇక్కడ నుండి దిగుమతి (download) చేసుకుని మీ కంప్యూటర్ మీద స్థాపించుకోండి.
రెండవ సోపానం (Second step) మీ మంటనక్క విహరిణి ని డబల్ క్లిక్ చేసి మొదలుబెట్టండి. ప్రసాద్ సుంకరి గారి ఇండిక్ ఇన్పుట్ ఎక్స్ టెన్సన్ ని ఇక్కడ నుండి దిగుమతి (download) చేసుకోవాలి.
మూడవ సోపానం (Third step)ఇండిక్ ఇన్పుట్ ఎక్స్ టెన్సన్ (Indic Input Extension) ఇన్స్టల్ చేసిన తరువాత మళ్ళీ మంటనక్క ని మొదలు పెడుతుంది. ఇప్పుడు మీ విహరిణి లో క్రింద నున్న స్టేటస్ బార్ మీద కుడి చేతి వైపు మీకు ఒక చిన్న భారత దేశ పతాక చిహ్నం కనపడుతుంది. దానిమీద మళ్ళీ క్లిక్ చెయ్యండి. భారత దేశ భాషలు కొన్ని కనబడుతాయి.
ఆ ఆప్షన్స్ లో (options) తెలుగు – RTS ని ఎన్నుకోండి.
ఇక మీరు తెలుగులో టపాయించడానికి తయారైనట్టే!
మొదలు బెట్టండి ఇక తెలుగులో టైప్ చెయ్యడం.