వ్యాపారస్తుడు దొంగ.

అప్పట్లో ఇంటర్‌నెట్ లేని రోజుల్లో గ్రీటింగ్ కార్డులతో పుట్టిన రోజులకి శుభాకాంక్షలు, గిట్టిన రోజులకి సందేశాలు కూడా పంపుకునేవారు.  ఆ రోజుల్లో కొంచెం చదువుకున్నవారు, మహానగరాలలో ఉండేవారు (భారతదేశంలో)  వకీల్స్ వారి గ్రీటింగ్ కార్డులు కొనుక్కుని పంపేవారు.  చక్కని సందేశాలతో, ముచ్చటైన బొమ్మలతో కళాత్మకంగా ఉండేవి అవి. గ్రీటింగ్ కార్డులు కూడా కళాత్మకంగా ఉంటాయా అని అడిగేవారితో నాకు అస్సలు పేచి లేదు.  అందుకని వారి జోలికి వెళ్ళను.  వకీల్స్, ఎలార్ రోజుల్లో వారికి పోటిగా ఆర్చీస్ అనే సంస్థ  బయలుదేరింది.

ఆనాటి నవతరం, యువతరం కోసం వాళ్ళు కార్డ్లు మొదలుపెట్టారు.  ఆ తరువాత పెన్నులు, గన్నులు, బొమ్మల అమ్మకాలన్నింటిలోకి ప్రవేశించారు.  మొదట్లో ఈ గ్రీటింగ్ కార్డులమీద ధరల వివరాలుండేవి కాదు.  దుకాణందారు తనకిష్టం వచ్చిన ధరకి అమ్మేవాడు.  కొనుక్కునేవాడు..మనసులోనే నిక్కినా నిలిగినా కొనుక్కునేవాడు.  తప్పదు.  కొంత పీర్ ప్రెజర్ కూడా ఉండేది.  రీడర్స్ డైజెస్ట్ చేతిలో లేకపోతే వాడొక వెధవాయ్ అన్నటైపులో అన్నమాట!  ఇప్పుడు “చే” బొమ్మతో ఉన్న కాలర్‌లెస్ టీ వేసుకున్నట్టు.  (“చే” ఎవరు అని ఆడిగితే, “చీ, చీ..నన్నే అడుగుతావా  అని తన తెలియని తనాన్ని దాచుకునే వెధవలున్నట్టు).

వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!
వ్యాపారస్థులందరూ దొంగలు కాదు!

అలాంటి రోజుల్లో బ్రతక నేర్చిన మిత్రుడు (వాడు బ్రతకనేర్చినవాడని అంతకుముందే తెలిసింది..అది మరొక కథ) ఎవరి బర్త్‌డేకో గ్రీటింగ్ కార్డ్ కావాలని రావడం..(నాతో సెలక్ట్ చేయించుకోవాలని అప్పట్లో తాంబరం నుంచి బెసెంట్ నగర్ నుండి, పరశువాక్కం లాంటి దూరప్రాంతలనుండి వచ్చేవారు)  ఒక చక్కని కార్డుని అసలు ధరకే (లాభాలు లేకుండా..మిత్రుడు కదా?) తీసుకోవడం అయిపోయింది.  పాపం డబ్బులిద్దామని పర్సుతీస్తే అందులో అన్ని వంద రూపాయల నోట్లే!

“అలా రా బాస్,  టీ తాగి, దమ్ము కొడదాం. హోటల్ వాడు చిల్లర ఇస్తాడులే” అని నన్ను లాక్కువెళ్ళాడు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్, టెన్స్ పాకెట్ ఆ రోజుల్లో అక్షరాల ముప్పై రూపాయలు.  నా షర్ట్ జేబు ఎప్పుడు దానితో నిండుగా ఉండేది.  (కొందరిలాగా పాంట్ జేబులో పెట్టుకుని దాచుకోవడం నాకు తెలీదు).  సరే, ఒకటి మనవాడికిచ్చాను..నేను ఒకటి అంటిచ్చుకున్నాను.  స్పేషల్ టీ ఆ రోజుల్లో మూడు రూపాయలు.  ఇద్దరికి ఐతే రెండుకప్పుల నిండా వచ్చేది.  ఆ స్పెషల్ టీ తెచ్చిన బేరర్ కి చిల్లరలేక..పావలా టిప్పు.  బిల్లు పే చెద్దామనుకున్న మిత్రుడు మళ్ళీ వంద రూపాయల నోటు ఇస్తే..హోటల్ యజమాన్ నవ్వుతూ నా వంక చూశాడు.  ఆ మూడు రూపాయలు నేనే ఇచ్చాను. (ఇందాకటి పావలా టిప్పు కూడా నాదే!)

ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడి కబుర్లు చెప్పుకున్నాం.  ఒక రెండు నిముషాలు.  గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ కదా అనేమో మిత్ర గురువు  దమ్ము లాగుతున్నాడు..ఫిల్టర్ కూడా కాలిపొయ్యేటట్టుంది.  అప్పుడు దానిని చూపుడు వేలు మధ్యవేలు మధ్యన పెట్టుకుని చమత్కారంగా విసిరేసాడు.  అది హోటల్ పక్కనే ఉన్న బడ్డికొట్టుముందు వీధిలాంతరు స్థంభానికి తగిలి కింద పడింది.

“సరే బాసు, మళ్ళీ కలుద్దాం”, అంటూ నేను రోడ్డు దాటడానికి కదులుతూ..అతనికి షేక్‌హాండిచ్చి రాబోతుంటే..చెయ్య్ పట్టుకుని ఆపేసి అన్నాడు కదా..”బాసు రెండు రూపాయల కార్డు కొని, మూడు రూపాయల సిగరెట్టు, ఒక స్పెషల్ టీ కొట్టేసాడేంటి వీడు అని అనుకుంటున్నావా?”

అతను అనేదాక ఆ ఆలోచన నా ఊహలోకి కూడ రాలేదు.  అప్పుడు వచ్చింది.  కార్డు కొన్నానంటాడు అది కూడా ఫ్రీ గానే తీసుకున్నాడు గా అని.  అదేమి లేదులే అని నవ్వేసి, చెయ్యి వదిలించుకుని వచ్చేసాను.

అఫ్‌కోర్సు..ఏదో ప్రభుత్వ సంస్థలో లంచం ఇచ్చి ఉద్యోగం సంపాయించుకున్నాడు.  ఇద్దరు కూతుళ్ళకి అమెరికా సంబంధాలు చేసాడు.  కోట్ల రూపాయల విలువగల భవంతుల యజమాని ఈ రోజు.

ఇదంతా ఎందుకు చెప్పానంటే..ప్రతి వ్యాపారస్థుడు దొంగ కాదు, చీట్ కాదు. వాడికి స్నేహాలు, బంధువులు, ప్రేమలు, అభిమానాలు, నైతిక విలువలుంటాయి!  నిన్న ఎవరో ఫేస్‌బుక్‌లో వ్యాపారస్థుడుకి అలాంటివి ఉండవన్న అర్ధం వచ్చే మాటన్నారు, అందుకని ఈ ఏడుపు!

ఉద్యోగం కోసం అటు నుండి నరుక్కు రావడం గురించి తెలుసా?

మీ  ముందే ఉంది.  మీరు ప్రతి రోజు వెడుతున్న ఆ రోడ్డులోనే ఉంది.  మీరు  వెళ్ళే గుడిలోకూడా ఉంది. మీరు  రోజు వెళ్ళే భోజనం చేసే మెస్సులో ఉంది ఉద్యోగం.

కుక్కపిల్లలా తోకాడిస్తూ మీ వెంటే..

మీరే  దాని వంక చూడటం లేదు.  దానిని పట్టించుకోవడం లేదు.  పిల్లిని చంకలొ పెట్టుకుని ఊరంత వెదికినట్టు, ఒళ్ళొ ఉన్న ఉద్యోగవకాశాన్ని వదిలేసి దేశం అంతా

తిరుగుతా నంటున్నారు.

మీముందు కూర్చుని మీ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూస్తున్న మీరు  గుర్తించడంలేదు.

ఆ మధ్య వచ్చిన హచ్ పప్పిలా అది మిమ్మల్ని వెంటాడుతోంది.  తోకాడిస్తూ మరి వెంటాడుతుంది.  మీరే దాన్ని పట్టించుకోకుండా ఇంకేటోచూస్తున్నారు.

అబ్బా అపండి, మీ సోది..అసలు విషయం చెప్పండి అంటారా?

“Wanted” కాలం కనబడటం లేదా?

మీ జిమైల్‌ / యాహూ మైల్‌లోనూ కనపడటం లేదా?

గుడిలో ఆ కార్పరేట్ ష్టై‌లో టీ వేసుకున్న పెద్దమనిషిని ఆయన సంస్థలో ఉద్యోగవకాశాలున్నాయా అని అడగలేక పొయ్యారా?

ఫ్రంట్ ఆఫీసులో “సెక్రటరి” గా చేస్తున్న పక్కి ఫ్లాట్ “ఆంటీ” ని అడిగారా? మెస్సులో ఎదురుగా సాంబారుని జుర్రుకుంటున్న ఆయన్ని అడిగారా?

మొదట్లోనే అనుకున్నాము కదా, మనకి తెలియని ఖాళీలు చాలా పూర్తి ఐపోతున్నావని?  మరి వాటిని అందుకోవడాఅనికి ఏం చేసారు?

సరే, మనవైపు నుంచి నరుక్కుంటూ వెడితే ఉద్యోగం ఉందని తెలుస్తుంది..కాని అటువైపు నుండి నరుక్కు రావడం గురించి తెలుసా?

అదేమి పెద్ద బ్రహ్మ విద్యేమి కాదు. మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధి అని వారికి తెలియజేయాలి కదా?  లేకపోతే వారికి ఎలా తెలుస్తుంది, మీకు ఉద్యోగం కావాలని?

ABN ఆంధ్రజ్యోతి టి వి చానెల్‌ల్లో రెజ్యుమె మీద నా ప్రోగ్రామ్

మొన్న అంటే జూన్ 15 వ తారిఖున ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి టివి (ABN Andhrajyothy) వారి దిక్సూచి ప్రోగ్రామ్ లో రెజ్యుమె గురించి ఒక అరగంట లైవ్ ప్రోగాం లో పాల్గొన్నాను.  ప్రోగ్రాం సాయత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్య జరిగింది.

నేపధ్యం

Continue reading “ABN ఆంధ్రజ్యోతి టి వి చానెల్‌ల్లో రెజ్యుమె మీద నా ప్రోగ్రామ్”

తప్పెవరిది (2) ?

ఆ విద్యార్ధి సాఫ్ట్ స్కిల్ల్స్‌లో ట్రైనింగ్ ఇచ్చాను అని చెప్పుకుంటున్న సాఫ్ట్ స్కిల్ల్స్ ట్రైనర్ ది. ఆ ట్రైనర్ ఇచ్చే ట్రైనింగ్, దాని పర్ఫార్మన్స్ని మానిటర్ చెయ్యని మేనజ్‌మెంట్‌ది. “పేరు గొప్ప , ఊరు దిబ్బ” అన్నట్టు ఆ ఆ కాలేజికి, వివిధ నగరాలలో చాలా బ్రాంచెస్ ఉన్నవి. అబ్బొ, సానా లావు పేరు కూడా ఉన్నది. ఫీజుల్స్ గ ట్రా కూడా బానే గుంజుకుంటారు.
అంతేనా అంటే కాదు.

మా కాలేజిలొ చదువుకున్న వారందరికి ” ఉద్యొగాలు గారంటీ “అంటారు. ఎందుకంటే వారి కాలేజిల్లో “కాంపస్ ఇంటెర్వ్యు” లు వచ్చేస్తవి కాబట్టి.

తప్పెవరిది ?

మా కాలేజీ విద్యార్ధికి సగటున 15 వేలు తగ్గకుండా జీతం వస్తుంది అని కాలరెగరేసుకుంటు చెప్తారు.
బేనిఫిట్స్, ఫ్రింజ్ బెనిఫిట్స్ కూడా వుంటాయని ఆకర్షణియంగా చెబుతారు.

అంతటితో ఐపొయిందా అంటే అబ్బే కాదు.
ఒకవేళ ఎవరి ద్వారానో, ఎందుకులేండి, విద్యార్ధి శక్తి యుక్టులకు మెచ్చి ఎవరన్నా ఉద్యొగం ఇస్తే, అందులో చేరనివ్వరు.

అదేందుకు అని అడగండి.

ఎందుకంటే ఒక విద్యార్ధి తక్కువ జీతానికి అంగీకరిస్తే మిగతా సంస్థలు కూడా అదే జీతం ఆఫర్ చెస్తే తమ కాలేజ్ ఉనికికి ప్రమాదం కదా.
అందుకని.
ముందు ఓపికగా నచ్చచెబుతారు. ఒద్దమ్మా అని.
నువ్వు జాఇన్ ఐపోతావు, మరి నీ తొటి వారి సంగతేమిటీని మాట మార్చి ‘సెంటిమెంట్’ని వొదులుతారు, నెమ్మదిగా.
తరువాత, మొదలవుతుంది.
బెదిరింపుల సెక్షను.
నువ్వు జాయిన్ అవ్వకూడదు, అని హుకుం పారేస్తారు.

ఈ మధ్యతరగతి కుటుంబంలోని వారు, తమ పిల్లలకు ఎటూ ఆస్తులివ్వలేము, కనీసం చదువులన్నా ఇద్దామని అనుకోవడంలో తప్పులేదుగా.

అందుకని, వాడి కాళ్ళు, వీడి కాళ్ళు పట్టుకుని, ఆ బాంకు వాడిని, ఈ బాంకు వాడిని దేవిరించి ఎంతొకొంత అప్పు చేసి, వారిని చదువించుకుంటారు. ఆ అప్పు తీచే బాధ్యత తమదని ఎరిగిన పిల్లలు ఎదో ఒక ఉద్యొగంలో జాఇన్అయి, ఆ అప్పు తీర్చుకోవాలనుకొవడం తప్పా?

వారికి తగిన ఉద్యొగాలను వారు ఎంచుకుని జాఇన్ అవుదామనుకుంటే వారిని అందులో జాఇన్ కాకుండా అపే ఈ కాలేజ్ మేనేజ్‌మెంట్‌ని ఏమనాలి?

* * *

“శిలలపై శిల్పాలు చెక్కినారు” అని మనకి ఒక సినిమా పాట ఉంది. “శిలలైతే చెక్కవచ్చు సార్, వీళ్ళు శిలలు కాదు, గులక రాళ్ళు. వీళ్ళని తీర్చి దిద్దడం మా వల్ల కాదు. ఎదో మా బ్రతుకు తెరువు కోసం, ఈ ఉద్యొగం చేసుకుంటున్నాము. ఎదో చూసి , చూడనట్టు నెట్టేయండి సార్”, అన్న ఆ సాఫ్ట్ స్కిల్ల్స్ ట్రైనర్ మాటలు గుర్తొస్తున్నాయి.

తప్పేవరిది?

మారుతున్న కాలంతొ బాటు వస్తున్న మార్పులని గమనించి,జీవనానికి కావలసిన కనీసపు నైపుణ్యాలను అందించలేని ఈ విద్యా వ్యవస్థదా?

కాలేజి చదువులదాకా, బయట ప్రపంచాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న విద్యార్ధులదా?

కనీసపు స్కిల్ల్స్ లేని విద్యార్దులని తీసుకోలేమంటున్న కార్పరేట్ రంగానిదా?

విపరీతమైన పోటీలున్న ఈ జీవితంలో ఈ ఒంటరి విద్యార్ధి ఓటమిని అంగికరించలేక, క్షణికమైన మానసిక దౌర్బల్యంతొ, ఏదేని అఘాయిత్యానికి ఒడిగడితే ఎవరు జవాబుదారి?

ఎవరు ?

టంగ్ ట్విస్టర్స్

గబ గబ చదవండి.

నీ నాన్న నా నాన్న అని నేనన్ననా? నా నాన్న నీ నాన్న అని అన్నానా? నీ నాన్న నీ నాన్నే. నా నాన్న నా నాన్నే అని నేనన్నాను.

ఇలాంట తెలుగు టంగ్ ట్విస్టర్స్ మీకు తెలిసినవి టపా చెయ్యండి.
పదిమందితో పంచుకోవచ్చు.

ఇందులో తప్పులెన్నండి.
చేబితే దిద్దుకుంటాను.

తెలుగు అనగ్రాం. మీరు చెప్పండి..

ఏదేని కొన్ని అక్షరాలను ఒక వరుసక్రమంలో కూర్చితే ఏర్పడే అర్ధవంతమైన పదాన్ని ఇంగ్లిష్ భాషలో అనగ్రాం అని అంటారు.

చిన్న ఉదాహరణ ; William Shakespeare = I’ll make a wise phrase.
మరొకటి ;
William Butler Yeats = Wait, I’m really subtle.
ఇవి English పేర్లు.
మరి మన తెలుగు పేర్లు ఐతే ఎలా వుంటయి?
మచ్చుకి ఒకటి VIJAYAWADA = ?

తొందరగా టపా పంపండి. ఇంకా ఆలోచిస్తున్నారా?

What are Life Skills?

ఆంధ్రజ్యోతి దిన పత్రికలో , దిక్సూచి అనుబంధంలో సెప్టెంబరు 19న ప్రచురించబడ్డ వ్యాసం ఇది.  లైఫ్ స్కిల్ అవసరం గురించి నా కెరీర్ కార్నర్  వ్యాస పరంపరలో వెలువడినది.  క్రింది బొమ్మ మీద క్లిక్ చెయ్యండి. చదువుకోవడానికి సులువుగా ఉంటుంది.

Telugu film artis Benerjee
చలన చిత్ర నటుడు – బెనర్జి

This is my way of sayingthank you‘ to Benerjee, a good friend of mine who had given me immense support when it was needed the most. This is also to tell the whole world ‘yes, he considers me to be one of his good friends”.