మీ ముందే ఉంది. మీరు ప్రతి రోజు వెడుతున్న ఆ రోడ్డులోనే ఉంది. మీరు వెళ్ళే గుడిలోకూడా ఉంది. మీరు రోజు వెళ్ళే భోజనం చేసే మెస్సులో ఉంది ఉద్యోగం.
మీరే దాని వంక చూడటం లేదు. దానిని పట్టించుకోవడం లేదు. పిల్లిని చంకలొ పెట్టుకుని ఊరంత వెదికినట్టు, ఒళ్ళొ ఉన్న ఉద్యోగవకాశాన్ని వదిలేసి దేశం అంతా
తిరుగుతా నంటున్నారు.
మీముందు కూర్చుని మీ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూస్తున్న మీరు గుర్తించడంలేదు.
ఆ మధ్య వచ్చిన హచ్ పప్పిలా అది మిమ్మల్ని వెంటాడుతోంది. తోకాడిస్తూ మరి వెంటాడుతుంది. మీరే దాన్ని పట్టించుకోకుండా ఇంకేటోచూస్తున్నారు.
అబ్బా అపండి, మీ సోది..అసలు విషయం చెప్పండి అంటారా?
“Wanted” కాలం కనబడటం లేదా?
మీ జిమైల్ / యాహూ మైల్‌లోనూ కనపడటం లేదా?
గుడిలో ఆ కార్పరేట్ ష్టైలో టీ వేసుకున్న పెద్దమనిషిని ఆయన సంస్థలో ఉద్యోగవకాశాలున్నాయా అని అడగలేక పొయ్యారా?
ఫ్రంట్ ఆఫీసులో “సెక్రటరి” గా చేస్తున్న పక్కి ఫ్లాట్ “ఆంటీ” ని అడిగారా? మెస్సులో ఎదురుగా సాంబారుని జుర్రుకుంటున్న ఆయన్ని అడిగారా?
మొదట్లోనే అనుకున్నాము కదా, మనకి తెలియని ఖాళీలు చాలా పూర్తి ఐపోతున్నావని? మరి వాటిని అందుకోవడాఅనికి ఏం చేసారు?
సరే, మనవైపు నుంచి నరుక్కుంటూ వెడితే ఉద్యోగం ఉందని తెలుస్తుంది..కాని అటువైపు నుండి నరుక్కు రావడం గురించి తెలుసా?
అదేమి పెద్ద బ్రహ్మ విద్యేమి కాదు. మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధి అని వారికి తెలియజేయాలి కదా? లేకపోతే వారికి ఎలా తెలుస్తుంది, మీకు ఉద్యోగం కావాలని?
నా చిన్నప్పుడు సెలవులకి మా ఊరు వెళ్ళాను. బహుశ ఉహ తెలిసిన తరువాత అదే అనుకుంటా మొదటి సారి నేను వెళ్ళడం. మహానగరం నుండి కుగ్రామానికి వెళ్ళడం కదా, బంధువులందరూ చాలా జాగ్రత్తగా, ప్రేమతో
చూసుకునేవారు. ఏదో పండగ వచ్చింది. సంక్రాంతి అనుకుంట. మా మావయ్య నాకు అప్పుడు ఒక జత బట్టలు కొన్నాడు. ఆ ఊళ్ళో బట్టల కొట్టు లేదండి! నాలుగు మైళ్ళు (mile) అవతల ఉన్న ఊళ్ళో ఒక దుకాణంలో మా మావయ్యకి ఖాతా ఉండేది. ఆది కోసం నావి ఒక జత బట్టలు తీసుకుని ఒక ఉదయం పూట బయలుదేరి నాలుగు మైళ్ళూ నడుచుకుంటూ ఆ ఊరు వెళ్ళాడు. ఆ కొట్టులో టైలర్ (Tailor) దగ్గిరే బట్టలు కుట్టించడం. పాపం మా మావయ్య! మళ్ళీ సాయంత్రం అయ్యింది, వెనక్కి వచ్చేటప్పడికి. ఒక వారంలో వచ్చినవి లెండి ఆ బట్టలు. టెర్లిన్ (Terylene) షర్ట్ ( చొక్క, అంగి), టెర్లిన్ నిక్కర్ (knickers = లాగు, మొకాలు దాటని పంట్లాము). అవి వేసుకుంటే గాలి అడేది కాదు. చమట పట్టినప్పుడు ఒంటికి అతుక్కుని పొయ్యేవి ఆ బట్టలు. చాలా చిరాకు వేసేది. కాని వాళ్ళు ప్రేమతో కుట్టించినవి కదా! అందుకని భరించేవాడిని. అదొక అనుభవం.
తరువాతి రోజులలో టెర్రి కాటన్ (Terry cotton) గుడ్డ అందుబాటులోకి వచ్చింది. అవి బాగానే ఉండేవి. ఆ బట్టలు కూడా టైలర్ కి ఇచ్చి కుట్టించుకోవడమే. మంచి టైలర్ కోసం వెతుక్కుంటూ బట్టలు కుట్టించుకోవడాఅనికి ఊళ్ళూ తిరిగే వారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ లో, హీరో ఎన్.టి.ఆర్ కి కాస్ట్యూమ్ (Costumes) డిజైన్ చేసిన యాక్స్ (Yax) టైలర్స్ ఒక వెలుగు వెలిగారు. యాక్స్ టైలర్స్ బ్రాంచెస్ ఉండేవి. అంత గొప్పగా నడిచింది వాళ్ళ వ్యాపారం.
తరువాత రెడి మెడ్ దుస్తులు ఊపందుకున్నవి. గురు షర్ట్లు, చీజ్ కాటన్ (cheese cotton) షర్ట్స్ వచ్చినవి. వాటితో పాటు డెనిం (denim)పాంట్స్ (pants). 1980 ఆ ప్రాంతల్లో చెన్నై, ఢిల్లీ, ముంబై మహానగరాలలో పేవ్‌మెంట్ మీద గుట్టలుగా పోసి అమ్మేవారు. కావల్సినవి ఏరుకుని కొనుక్కునేవాళ్ళం. మనకి ఇక టైలర్స్‌తో పని తగ్గింది. అన్ని రెడి మేడ్స్. కుమార్ షర్ట్ ఒకవైపు, చెర్మాస్ ఒకవైపు మొదలయ్యారు. పది రూపాయలకి షర్ట్. పాతిక రూపాయలకి పాంట్. అప్పటికి ఇంకా ఐ.టి (IT, Information Technology) ఉద్యోగాల జోరు మొదలవ్వ లేదు. కాబట్టి ఎంతో కొంత తక్కువ ధరలో కొనుక్కునేవారు సామాన్య ప్రజానీకం.
జెన్ట్స్ (gents) టైలర్స్ కి ప్రాముఖ్యత బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా యువతకి. రెడిమేడ్‌లో అన్ని దొరికేస్తున్నవి. కావల్సిన రంగులు, డిజైన్‌లు, కావల్సిన బట్ట, ఖరీదుకి తగ్గ నాణ్యత. ఈ రోజున స్త్రీలు కూడా అదే దోవన వెడుతున్నారు తమ దుస్తుల ఎంపిక విషయంలో. 🙂
ఉద్యోగాలు అంతే! ఒకప్పుడు ఉద్యోగం కావాలనుకుంటే, ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ (employment exchange) కి వెళ్ళాలి. ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుని సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ రోజుల్లో ఉద్యోగం లో చేరితే, దాదాపు జీవితాంతం అదే సంస్థ లో చెయ్యడం అదే సంస్థ లో రిటైర్ (retire) అవ్వడం. ప్రైవేట్ (private) సంస్థలైతే టైపిస్ట్ (typist)తో అప్ప్లికేషన్ (application) టైప్ (type)చేయించుకోవడం, అప్లై (apply) చేసుకోవడం. రికమండేషన్ (recommendation) కోసం వెతుక్కోవడం.
ఒకప్పుడు మంచి టైలర్ కోసం వెతుక్కునేవాళ్ళు. ఈ రోజున ఒక మంచి రెడిమేడ్ (ready made) బట్టల షాప్ (shop) కోసం వెతుక్కుంటున్నారు. మంచి బ్రాండ్ (brand) కోసం వెతుక్కుంటున్నారు. మీకు కావల్సిన రంగు, డిజైన్ (design), సైజ్ (size)లలో బట్టలు లభ్యం అవుతున్నవి. ఇవి కాక డిజైనర్ లెబిల్స్ (designer labels) ఉండనే ఉన్నవి. జేబులో డబ్బుండాలే కాని పాతికవేలకి ఒక పాంటు (pant)కొనుక్కోవచ్చు. లక్ష రూపాయలకి ఒక చీర కొనుక్కోవచ్చు.
ఈ రోజు చదువులు అంతే! ఉద్యోగాల కోసం చదవడమే! ఏడవ తరగతి నుండి ఐ.ఐ.టి (I I T)కి కోచింగ్ (coaching). మంచి ఉద్యోగాలు. షర్ట్‌లు మార్చినంత సులభంగా ఉద్యోగాలు మారడం. ఆదాయం కొద్ది బ్రాండెడ్ డ్రెస్‌లు (branded dress). ఉద్యోగాలు అంతే! టెర్లిన్ ఉద్యోగాలు. ఆ రోజుల్లో ఇష్టం ఉన్నా లేకున్నా చెయ్యడమే! ఒకప్పుడు టైపిస్ట్ లేని ఆఫీసుండేది కాదు. తరువాత ఎలక్ట్రిక్ టైప్‌రైటర్ (Electric Typewriter), ఎలక్ట్రానిక్ టైప్‌రైటర్‌గా (Electronic Typewriter) రూపాంతరం చెందింది. ఈ రోజు మీరే ఒక టైపిస్ట్ ఐపొయ్యారు. కంప్యూటర్ మీద. టైపు చెయ్యకుండా కుదరదు. ఈ రోజున వంట పాత్రలకి కళాయి వేసేవారు కనపడుతున్నారా మీకు? లేని ఉద్యోగం కోసం వెతికితే లాభం ఏమిటి? ఉన్న ఉద్యోగాల గురించి ఆలోచించాలి గాని. మితృడు కృష్ణప్రసాద్ అంటున్నట్టు, జీవనానికి ఉద్యోగాలు లేవు అనడం సబబు కాదు. ఉద్యోగాలున్నవి. మనం చెయ్యగలమా, లేదా అన్నదే ప్రశ్న!
మరి ఆ ఉద్యోగాలేక్కడున్నవా?
మళ్ళీ టపాలో చెబుతా!
* గతంలో ఉన్న ఉద్యోగాలు / వృత్తులు, ఇప్పుడు లేనివి మీకు తెలిసినవి ఏవైనా ఉన్నవా? మీకు గుర్తుంటే క్రింద వ్యాఖ్యల ద్వారా తెలియజేయండి. తెలియని వాళ్ళకి తెలుసుకునే అవకాశం కలిగించిన వారవుతారు. వాటిని గురించి వివరంగా తరువాత మాట్లాడుకుందాం!
హైదరాబాదు నుండి ప్రచురింపబడే ఒక ప్రముఖ దిన పత్రికలో పని చెయ్యడానికి ఒక పర్సనల్ సెక్రటరి కావాలి.
20 – 25 ఏళ్ళ వయసున్న యువతి అప్లై చెయ్యవచ్చు. పట్టభద్రురాలై ఉండాలి. చక్కటి తెలుగు తెలిసిఉండాలి. తెలుగు ఇంగ్లిష్‌లో స్వయంగా ఉత్తరప్రత్యుత్తరాలు జరపగల నైపుణ్యం ఉండాలి. మాములుగా ప్రతి ఆఫీసులోను ఉన్నట్టే ఫోన్లు అందుకోవాలి.అపాఇంట్మెంట్‌లు, వచ్చిన విజిటర్స్‌ని సాదరంగా రిసీవ్ చేసుకోవడం కొన్ని బాధ్యతలు మాత్రమే!
ఉదయం 9-30 నుండి సాయంత్రం 6 ఇంటిదాకా పని వేళలు.
సుమారు గా ఐదువేలవరకు నెలసరి జీతం ఉంటుంది. అనుభవజ్ఞులకి ఇంకా ఎక్కువ జీతానికి అవకాశం ఉంటుంది.
మీకు అసక్తి ఉంటే, మీ రెజ్యుమేని [email protected] కి పంపండి. సబ్జెక్ట్ లైనులో: Secretary – ED అని వ్రాయడం గుర్తుంచుకోండి. మీకు తెలిసినవారేవారెవరన్నా అర్హులని మీరనుకుంటే వారికి కూడా తెలియజేయ్యమని విన్నపం.
జనవరిలో ప్రారంభంకానున్న ఒక దినపత్రికకు అనుబంధంగా ప్రారంభించబడుతున్న web portal కి Assistant Editor కావాలి.
తెలుగు బాగా వచ్చా?
English ఇంకా బాగా వచ్చా?
అరె! మీకొసమే ఎదురుచూస్తున్నాము!
అంతర్జాలం దానికి సంభందించిన విషయాలమీద పూర్తి అవగాహన ఉందా? Portal సు వాటి content మీద మీకంటు కొంత స్వంత అభిప్రాయాలున్నవా? అవి పంచుకోగలరా? అనుభవం కూడా వుందా?
అయ్యొ. మరి ఇంకా అక్కడే నిలబడ్డారేం?
మీకు దాదాపు పాతికేళ్ళ వయసుందా?
ఐతే మీరు అర్హులే!
కనీసం graduation పూర్తి గావించారా?
ఐతే మరి ఇంక ఆలస్యం ఎందుకు?
అప్లై చెయ్యండి!
పగలే నండి ఉద్యోగం. Portal అన్నాంగదా?
జీతం ఎంతంటారా?
మీ ఉత్సాహము, అనుభవాన్నిబట్టి కనీసం నెలకి పది, పదిహేను వేల మధ్య ఉంటుంది?
ఉద్యోగం ఎక్కడంటారా?
భాగ్యనగరంలోనే!
మీకీ ఉద్యోగ అఖర్లేదా?
సరే మీకు తెలిసిన వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి చెప్పి అప్లై చెయ్యమనండి.
ఫొనెందుకండి?
careers AT thus dot in కి
Subject లైన్‌లో Assistant Editor
అని వ్రాసి మీ అప్లికేషన్ పంపండి.
* reference ఇస్తే బాగుంటుంది. మా పనిని సులభంగా చేసుకోగలుగుతాం!
ప్రతి అప్లికెషన్‌కి జవాబు ఉంటుంది.
Waiting లొ పెట్టం.
భాగ్యనగరం హెడ్డ్ ఆఫీసుగా, మిగతా నగరాలాలో, ఇతర రాష్ట్రాలలోను మేనేజ్ మెంట్ కోర్సులను ఆఫర్ చేసె ఒకానొక యునివర్సిటి విద్యార్ధిని, ఉద్యోగార్ధియై మా దగ్గిరకు
వచ్చింది.
అ అప్లికేషన్ క్జెరాక్జ్స్ (Xerox) కాపీ అంటే ఫొటొస్టాట్ అన్నమాట. అసలుదికాదు. నకలు. అంటే ఒక పది సంస్థలకు దరఖాస్తులు పెట్టుకున్న తరువాత ఇంకా ఎమిటిలే ఇంకొక బోడి ఉద్యోగమేగా
దానికి ఈమాత్రం చాలులే అన్న ధోరణి ఆ అప్లికేషన్ చూడగానే కనపడుతుంది. నకలు కదా అందుకని దానినిండా కొట్టివేతలు, తుడుపులు, దిద్దివేతలును. అంతటితో ఐతే ఫరవాలేదు.
దాని నిండా షూ హీల్స్ బురద మరకలు. వాటన్నింటితోనూతోను చక్కగా ముస్తా బై ఉన్నదది.
“అమ్మో, అమ్మో”, అనుకుంటూ (సూర్యకాంతంలా) ఆ అప్ప్లికేషన్ని, సదరు అభ్యర్ధిని నా వరకు రానివ్వకుండానే వెనక్కి పంపించేసాను. ఆ అమ్మాయి భొరున విలపిస్తు బక్కిట్లకొద్ది కన్నీరు కార్చిందంట. అబ్బే, మావాళ్ళు ఏమాత్రము కరగలేదు.