మీరు తప్పకుండా రండి!
త్రిపురనేని గోపిచంద్ తపాళ బిళ్ళ విడుదల
విదేశాలలో ‘కవిరాజు’ త్రిపురనేని 125వ జయంతి కార్యక్రమాలు
విదేశాలలో కూడా ‘కవిరాజు’ 125 జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారని నేటి ఆంధ్రజ్యోతి ద్వారా వారి మనుమడు, త్రిపురనేని గోపిచంద్ గారి పుత్రుడూ, లఘు / చలన చిత్ర నిర్మాత, దర్శకుడు, ప్రముఖ నటుడు త్రిపురనేని సాయిచంద్ తెలియజేస్తున్నారు.
ఈ పత్రికా ప్రకటన మూలంగా కొంత సమాచారం అందినా, సభా వేదిక, సంప్రదించవలసిన వారి వివరాలు తెలియడం లేదు. బహుశ స్థలాభావం వల్ల పత్రికలు ఆ వివరాలను ఇవ్వలేక పోయినవేమో! ఆయా ప్రాంతాలలోని తెలుగు వారికి, ‘కవిరాజు’ అభిమానులకి ఆ వివరాలు అందిస్తే బాగుంటుంది. మీలో ఎవరికైన ఆ వివరాలు తెలిస్తే నాకు అందించ గలరు. అందరికి అందుబాటులో ఇక్కడ పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ పత్రికా ప్రకటనలో ఉన్న వివరాలతో మీరు ప్రయత్నించ గలరు.
వివిధ దేశాలలో కార్యక్రమం వివరాలు
అమెరికాలోని డల్లస్ నగరంలో మే 14 న – శ్రీ తోటకూర ప్రసాద్ ఆధ్వ్యర్యంలో,
న్యూ యార్క్ నగరంలో మే 15న – శ్రీ త్రిపురనేని తిరుమల రావు ఆధ్వర్యంలో,
సెయింట్ లూయి నగరంలో మే 20 న – శ్రీ దండమూడి ఆధ్వర్యంలోను జరగనున్నాయి.
అలాగే,
ఇంగ్లండ్ లో మే 28 న – శ్రీ చదలవాడ సుబ్బారావు ఆధ్వర్యంలోను,
లండన్ నగరం లో మే 28 న – శ్రీ దాసోజు రాములు ఆధ్వర్యంలోను ఈ సభలను నిర్వహించడానికి ఏర్పాటులు జరిగినవి.

నేటి ఆంధ్రజ్యోతిలో పత్రికా ప్రకటన
టొరంటోలో “కవిరాజు” త్రిపురనేని
బోస్టన్లో “కవిరాజు” తో తెలుగు అభిమానులు
కెనడాలో “కవిరాజు” త్రిపురనేని జయంతి ఉత్సవాలు
ఏప్రిల్ 17న కవిరాజు విగ్రహ ఆవిష్కరణ
దుర్దినం
త్రిపురనేని గోపిచంద్ శతజయంతి కి మీకిదే ప్రత్యేక అహ్వనం
త్రిపురనేని గోపిచంద్ సినీ రచనల ఆవిష్కరణ
త్రిపురనేని గోపిచంద్ శతజయంతి సభ
ఈ ప్రత్యేక సంపుటిలో త్రిపురనేని గోపిచంద్ వ్రాసిన మూడు చలన చిత్రాల స్రిప్ట్‌లు ఉన్నవి.
-
రైతుబిడ్డ (1939)
-
గృహ ప్రవేశం (1946)
-
లక్షమ్మ (1950)
లక్షమ్మకి గోపిచంద్ దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం విడుదలై ఈ సంవత్సరానికి (February) అరవై ఏళ్ళు.
ఆ ప్రత్యేక సభ కార్యక్రమం వివరాలకు, ఆహ్వాన పత్రికని ఇక్కడ చూడండి.
ఇదే మీకు మా సాదర స్వాగతం!