ఇంకెవరికేనా తెలుసా యీ పద్యం?

Lalita said…

From an old riddle semi-remembered, రాముడే రీతి రావణు వధియించె? లకోలకోల. The riddle goes on with answers all being palindromes. తోకమూకతో, మందారదామం, వగైరా వగైరా. సీసపద్యం, తేటగీతి. ఇంకెవరికేనా తెలుసా యీ పద్యం? I’ve forgotten most of it.

తెలుగులో “పాలిండ్రోం” అనే “ఇ పదం” (ఇంగ్లిష్ పదం) పోస్ట్‌కి లలితగారి జవాబు ఇది?

మీకేవరికైనా తెలిస్తే చెప్పరూ..

తెలుగులో PALINDROME

A palindrome is a word or phrase that is spelled the same way forwards or backwards.
ఇది పాలిండ్రొం కి ఇంగ్లిష్‌లొ నిర్వచనం.
ఉదాహరణకి, రెండు పదాలు; AMMA, MALAYALAM.
ఒక పాలిండ్రొం phrase: ‘Madam, I’m Adam’.

తెలుగులో పాలిండ్రొం ని ఏమని పిలుస్తారు?

“కిటికి”,

“వికటకవి” కాకుండా ఇంకేవన్నా పదాలు చెప్పండి…

టంగ్ ట్విస్టర్స్

గబ గబ చదవండి.

నీ నాన్న నా నాన్న అని నేనన్ననా? నా నాన్న నీ నాన్న అని అన్నానా? నీ నాన్న నీ నాన్నే. నా నాన్న నా నాన్నే అని నేనన్నాను.

ఇలాంట తెలుగు టంగ్ ట్విస్టర్స్ మీకు తెలిసినవి టపా చెయ్యండి.
పదిమందితో పంచుకోవచ్చు.

ఇందులో తప్పులెన్నండి.
చేబితే దిద్దుకుంటాను.

తెలుగు అనగ్రాం. మీరు చెప్పండి..

ఏదేని కొన్ని అక్షరాలను ఒక వరుసక్రమంలో కూర్చితే ఏర్పడే అర్ధవంతమైన పదాన్ని ఇంగ్లిష్ భాషలో అనగ్రాం అని అంటారు.

చిన్న ఉదాహరణ ; William Shakespeare = I’ll make a wise phrase.
మరొకటి ;
William Butler Yeats = Wait, I’m really subtle.
ఇవి English పేర్లు.
మరి మన తెలుగు పేర్లు ఐతే ఎలా వుంటయి?
మచ్చుకి ఒకటి VIJAYAWADA = ?

తొందరగా టపా పంపండి. ఇంకా ఆలోచిస్తున్నారా?

స్క్రా బిల్ (Scrabble) Etymology

ఇంగ్లిష్ భాషలో పదాలతో ఆడుకొవడానికి ఒక మంచి ఆట ఇది. ఆటతో పాటుగా కొత్త పదాలను నేర్చుకొవడం సులువు. ఆ భాషలో దీనిని “స్క్రా బిల్” అని పలుకుతారు. ఇద్దరు లేదా నలుగురు ఈ ఆటని ఆడవచ్చు. నిలువుగాకాని, అడ్డంగాకాని ఒక వరుసక్రమంలో, అక్షరాలను పేర్చి అర్ధవంతమైన కొత్త పదాలను కూర్చడమే ఈ ఆట ఉద్దేశ్యం. అందుకనే ఈ ఆట నేడు సుమారుగా 120 దేశాలలో, 29 భాషలలో ప్రాచుర్యంపొందింది.

డచ్ భాషలోని పదం – ‘schrabbelen’ నుండి ఇంగ్లిష్ లోకి ఇది వచ్చిచేరింది. ఆ భాషలో దానికి ‘గీకడం’ లేదా “బరకడం” అని అర్ధం . గోళ్ళతో గీకడం, పెచ్చులు గీకడం, నెమ్మదిగా పొరల పొరలను గీకి తీసేయ్యడం ఈ పదానికి ఆ భాషలో అర్ధం.

అలాగే ఎంతో కొంత శ్రమ, ప్రయాస, కొంత పోరాటంతొ (to struggle, scramble) ఏదేని సాధించడం అని కూడా చెప్పుకొవచ్చు. ఈ అర్ధంతో ఈ పదం 1635 ప్రాంతాలలో వాడుకలోకి వచ్చిందని ఒక అంచనా.

1950 ప్రాంతాలలొ ప్రస్తుతం ప్రాచుర్యంలో వున్న ఈ పేరు “స్క్రా బిల్” తో ఈ ఆట బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఆట కొన్ని ప్రాంతాలలో Alfapet, Funworder, Skip-A-Cross and Palabras Cruzadas అన్న పేరులతో కూడా బహుళ జనాదరణ పొందుతు వ్యాపిస్తున్నది. ఈలాంటి ఆట మన తెలుగు భాషలో ఉంటే మనం కూడా చక్కగా ఆడుకుంటూమనకు తెలియని ఎన్నొ కొత్త పదాలను నేర్చుకోగలుగుతాము, కదా?

మందేరా!

బ్రహ్మపురము మందేరా
పర్లాకిమిడి మందేరా
కాదనివాదుకివస్తే
కటంకదాక మందేరా!

బస్తరేల్లా మందేరా
జయపూరంతా మందేరా
కాదనివాదుకివస్తే
నాగపురుదాకా మందేరా!

గోలకొండ మందేరా
తెలింగానా మందేరా
కాదనివాదుకివస్తే
నైజామంతా మందేరా!

చెన్నపురము మందేరా
చంగల్ పట్టు మందేరా
కాదనివాదుకువస్తే
తంజావూరు మందేరా!

బెంగుళూరు మందేరా
బళ్ళారి మందేరా
కాదనివాదుకువస్తే
కన్నడ మర్ధం మందేరా!

దేవికోట మందేరా
పుదుక్కోట మందేరా
కాదనివాదుకువస్తే
కాండే దాకా మందేరా!
– “కవిరాజు” త్రిపురనేని రామస్వామి, శతావధాని

– ‘manderaa’ by “Kaviraju” Ramaswamy Tripuraneni


* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.

తెలుగు తల్లి – Telugu Talli by “Kaviraju”

తెలుగు తల్లి

మాలదాసరి నోట, మహితభూసురనోట,
నొకతీరిమాటాడి యొప్పినావు!

మాలవాడలాబాట, మహితభూసురపేట,
నొక్కరీతిగ జిందు తొక్కినావు!

మాలగేస్తునింట, మహితభూసురినింట,
నొకరీతిబదముల నుంచినావు!

మాలపెద్దాలచెవి, మహితభూసురుచెవి,
నొకరీతి సామెతలూదినావు!

కన్నబిడ్డలదెస నొక్క కనికరంబె
చూపి, యెల్లవారికి దారి చూపినావు!
తల్లి! నీ మాట, నీ పాటదలుచుకొన్న
జలదరించుచు మేనెల్ల పులకరించు!

*0*

అతిశయభక్తిన్ వినుమా
ప్రతిభాషింపకయె తెనుగుభాష కుమారా!
అతిమధురం బతిపేశల
మతిపేయము కాదే బాసలన్నిటిలోలన్!

– “కవిరాజు” త్రిపురనేని రామస్వామి

Telugutalli by “Kaviraju” Ramaswamy Tripuraneni

* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.

వీరగంధము

వీరగంధము

వీరగంధము దెచ్హినారము
వీరులెవ్వరొ దెల్పుడీ!
పూసిపోతము మెడను వైతుము
పూలదండలు భక్తితొ!

తెలుగు బావుట కన్నుచెదరగ
కొండవీటను నెగిరినప్పుడు-
తెలుగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు-

తెలుగువారల వేడి నెత్తురు
తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందునున్న సహ్యజ
కత్తినెత్తురు కడిగినప్పుడు-

ఇట్టి సందియమెన్నడేనియు
బుట్టలెదు రవంతయున్;
ఇట్టిప్రశ్నలడుగువారలు
లేకపోయిరి సుంతయున్!

నడుము గట్టిన తెలుగుబాలుడు
వెనుక తిరుగడెన్నడున్!
బాస ఇచ్హిన తెలుగుబాలుడు
పారిపోవడెన్నడున్!

ఇదిగో! యున్నది వీరగంధము
మై నలందుము, మై నలందుము;
శాంతిపర్వము జదువవచ్హును
శాంతిసమరం బైనపిమ్మట!

తెలుగునాటిని వీరమాతను
జేసిమాత్రము తిరిగిరమ్మిక,
పలు తుపాకులు, పలు ఫిరంగులు
దారికడ్డము రాకతప్పవు!

తెలుగుబిడ్డా! మరిచిపోకురా!
తెలుగుదేశము పురిటిగడ్డరా!
కొక్కరకొ పాటపాడరా!
తెలుగువారల మేలుకొల్పర!

“కవిరాజు” త్రిపురనేని రామస్వామి

Veeragandhamu by “Kaviraju” Ramaswamy Tripuraneni

* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.