నో

“నాన్న”. “ఊ..” “రిటైర్..అయిపోయింతరువాత, ఏం చేద్దామనుకుంటున్నావు?” “ఇక్కడే ఉంటాను”. “అలా కాదు, ఒంటరిగా ఇక్కడెందుకు?  మా దగ్గిరకు వచ్చి ఉండవచ్చుగా?” “ఉహూ”. “ఎందుకని?” “మీ ఇంటికి వస్తే, నేను మీ హౌజ్ రూల్స్ పాటించాలి.  అదే నా ఇంట్లో ఐతే నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను.  ఇన్ని సంవత్సరాలు నేను, మీ అమ్మ అందరం అలానే ఉన్నాం.  మీ ఇంట్లో అలా ఉండటానికి కుదరదు. అందుకని, నో!”

అంగలూరులో త్రిపురనేని గోపిచంద్ శతజయంతి ఉత్సవము

‘కవిరాజు‌’, శతావధాని, బారిస్టర్ త్రిపురనేని రామస్వామి స్వగ్రామమైన అంగలూరులో, వారి తనయుడు త్రిపురనేని గోపిచంద్ శతాబ్ది సభ, ఆగస్ట్ 15 న, లింగం వీరభద్రయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల జరుగుతుంది.

త్రిపురనేని గోపీచంద్ సంపుటాలు వెలువడినవి

సాహిత్యాభిమానులకు శుభ వార్త త్రిపురనేని గోపీచంద్ రచనా సర్వసం – పది సంపుటాలు ఒకే సెట్‌గా అందుబాటులోకి వచ్చాయి. విడిగా కూడ లభ్యం. * బుక్ మార్క్ * అలకనంద ప్రచురణలు Ashok Book Center Opposite Maris Stella College, Ring Road, Vijayawada, Andhra pradesh 520008‎ – పోన్: +91 (0866) 2472096 email:[email protected] * Full-screen Akshara ‎Address: M/s. AKSHARA BOOK STORE , P NO 5, BANJARA […]