బాలాంత్రపు – గోపీచంద్

Balantrapu Rajanikanta Rao

This is a post about a memory shared by Hemachandra Balantrapu, between his late father Rajanikanta Rao and Gopichand Tripuraneni, that appeared in Sakshi, the Telugu daily news paper. The memory was put in words by Anil Atluri.

కవిరాజు – స్వదేశాగమనము

త్రిపురనేని రామస్వామి,    ట్రినిటీ కాలేజ్, డబ్లిన్, ఐర్లాండ్ లో తన న్యాయశాస్త్ర విద్యాభ్యాస్యాన్ని 1917లో ముగించు కున్నారని నా పరిశోధనలో దొరికిన పత్రాలను బట్టి తెలుస్తోంది. ఐతే ఆయన అదే సంవత్సరం నవంబర్ 11న భారతదేశ భూభాగం లో అడుగుపెట్టా రని చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే అది ఆయన బొంబాయికి చేరిన తేదినా, లేక తెనాలి లో అడుగుపెట్టిన తారీఖా అన్నది పరిశోధించి తెలుసుకోవాల్సి ఉంది. ఆయన ఆ రోజుకు అంగలూరు కూడా వెళ్లి […]

మందేరా!

బ్రహ్మపురము మందేరా పర్లాకిమిడి మందేరా కాదనివాదుకివస్తే కటంకదాక మందేరా! బస్తరేల్లా మందేరా జయపూరంతా మందేరా కాదనివాదుకివస్తే నాగపురుదాకా మందేరా! గోలకొండ మందేరా తెలింగానా మందేరా కాదనివాదుకివస్తే నైజామంతా మందేరా! చెన్నపురము మందేరా చంగల్ పట్టు మందేరా కాదనివాదుకువస్తే తంజావూరు మందేరా! బెంగుళూరు మందేరా బళ్ళారి మందేరా కాదనివాదుకువస్తే కన్నడ మర్ధం మందేరా! దేవికోట మందేరా పుదుక్కోట మందేరా కాదనివాదుకువస్తే కాండే దాకా మందేరా! – “కవిరాజు” త్రిపురనేని రామస్వామి, శతావధాని – ‘manderaa’ by “Kaviraju” Ramaswamy […]

వీరగంధము

వీరగంధము వీరగంధము దెచ్హినారము వీరులెవ్వరొ దెల్పుడీ! పూసిపోతము మెడను వైతుము పూలదండలు భక్తితొ! తెలుగు బావుట కన్నుచెదరగ కొండవీటను నెగిరినప్పుడు- తెలుగువారల కత్తిదెబ్బలు గండికోటను కాచినప్పుడు- తెలుగువారల వేడి నెత్తురు తుంగభద్రను గలిసినప్పుడు దూరమందునున్న సహ్యజ కత్తినెత్తురు కడిగినప్పుడు- ఇట్టి సందియమెన్నడేనియు బుట్టలెదు రవంతయున్; ఇట్టిప్రశ్నలడుగువారలు లేకపోయిరి సుంతయున్! నడుము గట్టిన తెలుగుబాలుడు వెనుక తిరుగడెన్నడున్! బాస ఇచ్హిన తెలుగుబాలుడు పారిపోవడెన్నడున్! ఇదిగో! యున్నది వీరగంధము మై నలందుము, మై నలందుము; శాంతిపర్వము జదువవచ్హును శాంతిసమరం బైనపిమ్మట! […]