కోపం వచ్చి వ్రాసిన కథ ‘అదితి’

అదితి - aditi - telugu short story by Anil Atluri

అప్పుడెప్పుడో నేనేదో వ్రాస్తే దాన్ని చదివి ఒకానొక రచయిత “మీరే వ్రాసారా? ఎవరైనా ఎడిట్ చేసారా?” అని అడిగితే ఆ ప్రశ్నకి కోపంవచ్చి వ్రాసుకున్న కథలలో ఈ ‘అదితి’ ఒకటి. “…నట్లు కొట్టకుండా, ఆపకుండా చదివించింది మీ కథ,” చాలా మంది పాఠకులు నాకు తెలియజేసిన అభిప్రాయం ఇది.

ఇంద్రజాలికుడు

మళ్ళీ నాకు ఏవో కబుర్లు చెప్పాడు. తల నిమిరాడు. బుగ్గలు నిమిరాడు. కళ్ళు తుడిచాడు. నా స్నేహితుడి లాగా బుజ్జగించాడు.

వెండి తెర నవలలు – అట్లూరి పిచ్చేశ్వరరావు

సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు.  వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేష‌న్‌లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు. అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద చిత్రాలే గతి.  ఒకటికి పది సార్లు చూడటానికి అవకాశం లేని వారు,  ఎన్టీవోడి డవిలాగు, ఏ ఎన్ ఆర్ ఎస్‌వీఆర్ […]

నాలుగు అక్షరాలు – మూడు కథలు

ఆ మధ్య ఒక రచయితని అడిగాను, “మీరు ఎందుకు వ్రాస్తున్నారు?” అని. ఠకీమని చెప్పాడాయన “డబ్బుల కోసం” అని. మరొకరిని అడిగాను.  “అయ్ ఆమ్ ఎక్స్‌ప్రెసివ్” అని జవాబు. ఆంధ్రులు కాదు తెలుగు వారందరూ అభిమానించే (సినవారు కూడా ఉన్నారు) జవాబు, “రాయక పోతే చచ్చిపోతా”. సముద్రంలోనుంచి బయటపడి, చెట్టుమీదకి ఎక్కి కిందకి దిగాడు. అన్ని వందల వేల సంవత్సరాలలో, వాడికి శబ్దం చెయ్యడం వచ్చింది.  దానికి ఒక లయ ఏర్పచుకున్నాడు.  భాష అయ్యింది అది.  కథలు […]

అన్వర్ కి ధాంక్స్‌తో..

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్, ఐపోయ్యిందా? డిక్లేర్ చేసేద్దామా”? అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది. మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

ప్రశ్న

పోయిన సంవత్సరం అంటే 2013 లో ఒక పెద్ద రచయిత (“మాకు తెలియకుండా ఎప్పుడు పెద్దవాడైపొయ్యాడు” అని ఒక మరో పెద్దాయన సభాముఖంగానే అడిగాడు అనుకొండి, అది వేరే విషయం!) నన్నో ప్రశ్న అడిగాడు. “సార్, మీరేప్పుడు ఇలా అందరితోను నవ్వుతూ, ఫ్రెండ్లిగానే ఉంటారా?” అని. వ్యంగంగా అన్నాడో, వెట ‘కారం’ గా అడిగాడో, స్నేహంగా అనేసాడో, నవ్వు పులుముకుని అడిగాడో నేనైతే అర్ధాలు, కారాలు, మిరియాలు వెతుక్కోలేదు. కాని నా జవాబు మాత్రం, “నాకు మరో […]

పాఠకుడే రారాజు

కా రా మాస్టారు ని అడిగాను, “చదవగలుగుతున్నారా?” అని. “ఇబ్బందిగానే ఉంది.  ఇదివరకటిలాగా ఏకధాటిగా చదవలేక పోతున్నాను.  ఐనా మధ్య మధ్య ఆపి కళ్ళకి కాస్త విశ్రాంతినిస్తూ చదువుతూనే ఉన్నాను. చదవకపోతే ఎలా? ఊపిరి ఆడదుగా?! మీకు తెలియందేముంది ?” అని అన్నారు.  అప్పటికి వారికి సుమారు 86 ఏళ్ళు అనుకుంటాను.  ఐనా చిన్న స్టూలు లాక్కుని దానిమీద కెక్కి నిలబడి, అటక మీదున్న కొన్ని పుస్తకాలని అందుకుని, దిగి తీసుకువచ్చి మీరు చదవాలని నాకు అందజేసారు.  […]

గెస్ట్‌కాలం – ఈ రీడింగ్

ఈ రీడింగ్ – ఈజీ రీడింగ్ ఈ వ్యాసం నిన్న సాక్షి దినపత్రిక,  ఫామిలీ లో మొదలైన గెస్ట్‌కాలం లో వచ్చింది.  పుస్తకాలతో మొదలుపెడితో బాగుంటుందని అని వారనుకుని నన్ను వ్రాయమని కోరారు.  ఆ సందర్భంగా వ్రాసిని వ్యాసం ఇది.  అన్నట్టు ఈ గెస్ట్‌కాలం ప్రతి బుధవారం వస్తుంది.  ఆయా రంగాలలో నిష్ణాతుఁలు వారనికొకరు మీకు అందిస్తుంటారు.  ఇక వ్యాసం ఇది.  స్థలాభావం వల్ల వ్యాసం కొంత “సంపాదకుల కోత” కి గురైంది.  పూర్తి పాఠం తరువాత […]