మందేరా!

బ్రహ్మపురము మందేరా పర్లాకిమిడి మందేరా కాదనివాదుకివస్తే కటంకదాక మందేరా! బస్తరేల్లా మందేరా జయపూరంతా మందేరా కాదనివాదుకివస్తే నాగపురుదాకా మందేరా! గోలకొండ మందేరా తెలింగానా మందేరా కాదనివాదుకివస్తే నైజామంతా మందేరా! చెన్నపురము మందేరా చంగల్ పట్టు మందేరా కాదనివాదుకువస్తే తంజావూరు మందేరా! బెంగుళూరు మందేరా బళ్ళారి మందేరా కాదనివాదుకువస్తే కన్నడ మర్ధం మందేరా! దేవికోట మందేరా పుదుక్కోట మందేరా కాదనివాదుకువస్తే కాండే దాకా మందేరా! – “కవిరాజు” త్రిపురనేని రామస్వామి, శతావధాని – ‘manderaa’ by “Kaviraju” Ramaswamy […]

కుప్పుస్వామి శతకము

కుప్పుస్వామి శతకము గొంటరుల దుంటరుల గుమిగూర్చి సృష్టి జేసి చీటికి మాటికి డాసి వారు తన్నుకోని చచ్హుచుండగ దనియుచుండు గొప్పవానికి జేజేలు కుప్పుసామి. ఏడొ, పద్నాలుగో, మూడొ యెన్నో, జగము లెల్ల సృష్టించిటువంటి యీశుడొకరో యిర్వురో ,యెందరో వారికెల్ల నేటి కోళ్ళ నర్పింతు భక్తితో గుప్పుసామి. చిన్నపిల్లకును దల్లి చెప్పునటుల దెలుగు మాటల పొంకంబు దీర్చిదిద్ది తెలిసి తెలియక యర్ధంబు తెలియునటుల జెప్పబూనితి గరదలు కుప్పుసామి. మున్ను పెద్దలు చెప్పినవెన్నో కలవు ఎన్నకుండిన నీతులు కొన్ని కలవు […]