బాలాంత్రపు – గోపీచంద్

Balantrapu Rajanikanta Rao

This is a post about a memory shared by Hemachandra Balantrapu, between his late father Rajanikanta Rao and Gopichand Tripuraneni, that appeared in Sakshi, the Telugu daily news paper. The memory was put in words by Anil Atluri.

కవిరాజు – స్వదేశాగమనము

త్రిపురనేని రామస్వామి,    ట్రినిటీ కాలేజ్, డబ్లిన్, ఐర్లాండ్ లో తన న్యాయశాస్త్ర విద్యాభ్యాస్యాన్ని 1917లో ముగించు కున్నారని నా పరిశోధనలో దొరికిన పత్రాలను బట్టి తెలుస్తోంది. ఐతే ఆయన అదే సంవత్సరం నవంబర్ 11న భారతదేశ భూభాగం లో అడుగుపెట్టా రని చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే అది ఆయన బొంబాయికి చేరిన తేదినా, లేక తెనాలి లో అడుగుపెట్టిన తారీఖా అన్నది పరిశోధించి తెలుసుకోవాల్సి ఉంది. ఆయన ఆ రోజుకు అంగలూరు కూడా వెళ్లి […]

బాటసారి – వెండితెర నవల – అట్లూరి పిచ్హేశ్వరరావు

బాటసారి_baaTasaari

తెలుగువారికి వెండితెర నవలలను పరిచయం చేసింది అట్లూరి పిఛ్హేశ్వర రావు. ఆ కోవలోనే ‘బాటసారి’ చలనచిత్రాన్ని వెండితెర నవలగా తెలుగువారికి అందించింది అట్లూరి పిఛ్హేస్వర రావు. శతావధాని .’కవిరాజు’ త్రిపురనేని రామస్వామి కి అల్లుడు.

వెలగా వెంకటప్పయ్య

మొన్న మళ్ళీ కాళీపట్నం నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం. అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్‌నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది. శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”

వేనరాజు “ఖూనీ”

“ఆంధ్రా బెర్నాడ్ షా త్రిపురనేని” అని అన్నది కట్టమంచి రామలింగారెడ్డి.  ఆయన అనడానికి ఒక కారణం ఉంది.  “కవిరాజు” త్రిపురనేని రామస్వామి తన రచనలకి సుధీర్ఘమైన పీఠికలు వ్రాసాడు, ఐరిష్ రచయిత జార్జ్ బెర్నాడ్ షా లాగ. పీఠికలు ఎందుకు వ్రాస్తారు?  తను చెప్పదలుచుకున్నదానికి ఉపోధ్ఘాతం.  ఆ రచనకి పూర్వాపరాలు.  నేపధ్యం.  ఎందుకు వ్రాయవలసి వచ్చింది.  రచనకి ఉపయోగపడ్డ వస్తు సామగ్రి గురించి. ఇత్యాదులన్నింటి గురించి.  ఒక వివరణ అని అనుకోవచ్చు.  పీఠిక చదవడం మూలంగా రచయిత […]

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

మరో తరం వెళ్ళిపోవడం మొదలయ్యింది. మద్రాసులో బాల్యంలో మా నాన్న గారితో వారింటికి వెళ్ళడం కుటుంబరావు గారు, నాన్న గారు సాహిత్యం, రాజకీయం మీద చర్చోపచర్చలు కబుర్లు చెప్పుకుంటూవుంటే ప్రసాద్ గారితో ఏదో కాలక్షేపం చెయ్యడం లీలగా గుర్తుంది. వారి సాహిత్యం గురించి, వారి సంగీతం గురించి, వారి శాస్త్రీయ రచనల గురించి నా కంటే వివరంగా చెప్పేవాళ్ళూ, విశదీకరించే వారున్నారు కాబట్టి నేను వాటి జోలికి వెళ్లడం లేదు. దాసరి సుబ్రహ్మణ్యం గారు ఒకరోజు సాయంత్రం  […]

కవి స్వరాలు

మొన్న అంటే, ౨౩ మే, రవింద్ర భారతి లో కిన్నెర వారి తెలుగు కవిత మహోత్సవాలు లో భాగంగా రాళ్ళబండి కవితా ప్రసాద్ రూపొందించిన ‘తెలుగు వెన్నెల‘ లో “అనువాద కవిత్వం – దశ – దిశ‘ అనే అంశంపై వాడ్రేవు చిన వీరభద్రుడు చేసిన కీలకోపన్యాసం సభికులను విశేషంగా ఆకర్షించింది.అంతే కాకుండా అంతకు క్రితం రోజున విశిష్ట కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రత్యేకత ఏమిటంటే వేదిక నెక్కిన ప్రతి కవి తన […]