క్లుప్తంగా ఇడ్లి, వడ, సాంబార్ కధ ఇది!

కొంత మంది పాఠకులకి నేను వ్రాసిన ఇడ్లి, వడ, సాంబారు కధ పూర్తిగా అర్ధం కాలేదన్నారు. ఈ టపా వారికోసం. ఈ క్రింద ఇఛ్హినవి సారంగ లో వఛ్హిన కధ ఇడ్లి, వడ,సాంబార్ లోని వాక్యాలు. ఇవన్ని అంతర్గతంగా కధాంశానికి సంబంధించిన సూచినలిస్తాయి. వీటన్నింటిని ఒక క్రమంలో చదువుకుంటే కధ అర్ధం కావాలి. ఈ వాక్యాలు చదివిన తరువాత, కధని మళ్ళీ ఒకసారి చదువుకోండి. దానికి లంకె ఈ కింది వాక్యాల తరువాత చివర ఇఛ్హాను. – […]
ఇది జీవితమే…కథ కాదు
చదివిన కొన్ని వేల పుస్తకాలనుండి, అక్కడొక అధ్యాయం, ఇక్కడొక పేజి, మరెక్కడినుండో ఒక పేరా, మరో చోట నుండి ఒక పదబంధం తో అద్భుతమైన అనుభవాలతో ఏర్చి కూర్చిన పూలదండ కాదిది. శిల్పం, శైలి, ప్రక్రియలతో కథనంకు కావల్సిన దినుసులతో పాఠకులను అలరించాలని వండి వార్చినది అంతకంటే కాదు. వారేవరో అడిగినట్టు..ఒక మంచి సంపాదకుడు చెక్కిన శిల్పం అసలే కాదు. జీవితం అలవోకగా, నిర్లక్షంగా, విదిల్చిన గాజుపెంకులు హృదయపు మాంసపు ముద్దలమీద గీసిన గాట్లనుండి, స్రవిస్తున్న రక్తపుబొట్లతో […]