బాలాంత్రపు – గోపీచంద్

This is a post about a memory shared by Hemachandra Balantrapu, between his late father Rajanikanta Rao and Gopichand Tripuraneni, that appeared in Sakshi, the Telugu daily news paper. The memory was put in words by Anil Atluri.
కవన శర్మ జ్ఞాపకాలతో…ఒక సాయంత్రం

మొన్న (ఆదివారం, 4 నవంబరున, Hyderabad Study Circle లో ) జరిగిన కవన శర్మ జ్ఞాపకాల సభలో సాహితీ మిత్రులందించిన మూడు సందేశాలు వ్యవధి లేక జారిపొయ్యాయి. ఒక నిర్వాహకుడిగా అది నా తప్పిదమే. మిత్రులను క్షమాపణలు కోరుకుంటూ, వాటిని ఇక్కడ అందరితో పంచుకుంటున్నాను. … రావు, వేమూరి – University of California, Davis విశ్రాంత ఆచార్యులు (అమెరికా) వేమూరి వెంకటేశ్వర రావు గారి సందేశంః ఏనాటి మాటో! కవన శర్మ గారుట. బోస్టన్ […]
అసిఫా! అసిఫా!

ఆ మధ్య ఒక సాయంత్రం జుబిలీ హిల్స్, మహాప్రస్థానం లో ఎవరికో వీడ్కోలు పలికి వస్తుంటే, దారిలో ఆ పాప, తమ్ముడు, వాళ్ళ నాన్నతో కనిపించారు. చలాకిగా నవ్వుతూ, తుళ్ళుతూ, హుషారుగా, సంతోషంగా దాదాపుగా పరిగెడుతున్నారు. వాళ్ల వెనుక వాళ్ళ నాన్న అనుకుంటా, భుజం నుంచి వాటర్ బాటిల్ తగిలించుకుని వాళ్ళ అడుగులో అడుగు వేసుకుంటూ హాయిగా నవ్వుతూ వెళ్తున్నాడు. అమీర్ పేట మెట్రో స్టేషన్. నేను వాళ్లతో పాటే, స్టేషన్ వైపుకి అడుగేసాను. ఆ పాప […]
ఆ ఉగాది రోజున…

“ఉగాది రోజండి. ఎప్పుడు ఇల్లు వదిలి లేమండి. అమ్మ చెత్తో ఉగాది పఛ్హడి తినేవాళ్ళం. ఈ సంవత్సరం ఆ గతి లేదు. ఇక్కడెక్కడా ఉగాది పఛ్హడి పెట్టేవాళ్ళెవరూ కనపడలేదు. ఇంక ఇలా ఉండక ఎలా ఉంటామండి?” అని అన్నాడు అందులో ఒకడు చెమర్చిన కళ్ళతో.
స్త్రీ వాదంతో ఓ సాయంత్రం!

ఓల్గా గారి కథల సంపుటి ‘విముక్త’కు కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడమనేది ఒక వాదాన్ని చెప్పడంతో పాటు, ఆ వాదాన్ని చెప్పడానికి ఎంచుకున్న ఒక సరైన సాహితీ ప్రక్రియ వల్లే సాధ్యమైందని భావిస్తున్నట్లు ఒక అభిప్రాయం వినిపించింది. దాంతో పాటు ఈ సాహితి ప్రక్రియలో మీదైనా ముద్రను తేవడానికి ఎలాంటి కృషి చేశారు? అన్న ప్రశ్నకు ఓల్గా గారు సమాధానమిస్తూ.. “ఒక వాదాన్ని చెప్పేందుకు ఎంచుకునే భాషలో కూడా ప్రయోగం, కొత్తదనం చూపాలి. అప్పుడే అందరికీ ఆ ఆలోచన చేరడంతో పాటు దానికి ఒక అర్థం వస్తుంది. నా వరకూ నేను నా భాష పరంగా ఎదగడం ఎప్పటికప్పుడు సాహిత్యంతో స్నేహం వల్లే సాధ్యమైంది” అన్నారు.
నీ సాహిత్యానికి అదే ఎక్కువ!

పిచ్చాపాటి మాటల్లో, ఆ రచయిత “ఆయ్యా, ప్రస్తుతం వెలువడుతున్న పత్రికలలో, నా కథ గాని, నవలగాని, సీరియల్ గాని, ప్రచురించనివి ఒకటి కూడ లేవు. మరి నన్ను గుర్తించదేమి ఈ ప్రభుత్వం?” అని తన అవేదనని, ఆక్రోశాన్ని, అక్కస్సుని వెళ్లబుచ్చాడు.
వెలగా వెంకటప్పయ్య
మొన్న మళ్ళీ కాళీపట్నం నవతీతరణం అభినందన ప్రత్యేక సంచిక చదివినప్పుడు వెలగా వారి వ్యాసం చదివాను. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారి వయస్సుకి అంతర్జాలం గురించి ఆ మాత్రం అవగాహన ఉండటం. అంతే కాదు ఆ ఏడు పేజీల సాహితీ వ్యాసం చివరి పేరగ్రాఫ్ లో వారన్న మాట: “ఇంటర్నెట్ ఉంటే ప్రతి ఇల్లు ఒక కథానిలయం అవుతుంది…కారా మాస్టారు సేకరించిన అపూర్వ కథా సంపదను అధికంగా ఉపయోగించినా, అసలు ఉపయోగించకపోయినా శిధిలమౌవుతుంది. శిధిలం మాట మరిపించేది, మురిపించేది అంతర్జాల మాయాజాలం.”
…అమెరికా పుస్తకాల మీద బ్రహ్మాండమైన దాడిని ప్రారంభించింది!
‘అక్కడాహుతౌతున్నది వట్టి కాగితాల కట్టలు కాదు. మానవజాతి కష్టించి ఆర్జించుకున్న సంస్కృతీ, సంస్కార, సంప్రదాయాలు దగ్ధమౌతున్నాయి. మానవజాతి సంపాదించుకున్న మధుర స్మృతులన్నీ మసైపోతున్నాయి’ అని అక్రోశిస్తాడు ధియోడాటస్.
‘నువ్వేమి చెయ్యకుండా కూర్చుంటే రాబొయ్యే తరాలవారు నిన్ను పుస్తకాల విలువ కూడా తెలుసుకోలేని మూర్ఖుడిగాను, ఆటవిక సైనికుడిగాను జమ కడతారు సుమా!’ అని సీజర్ని హెచ్చరిస్తాడు. అట్లూరి పిచ్చేశ్వరా రావు ‘విన్నవి – కన్నవి’ నుంచి.
అలికిడి
మరో రెండు అడుగులు.
అతను పేపర్ని పక్కన పడేసాడు.
చేతులు చాపాడు.
గబ, గబ, గబ, గబ వచ్చి చేతుల్లో వాలిపోయింది.