లో మనం ఉద్యోగంలో చేరుదాం అనుకున్నప్పుడు ఆ కార్పరేట్ సంస్థ గురించి ఎలా తెలుసుకోవచ్చు అన్నది ప్రస్తావన. దానికి గతంలోనే వివరంగా వెబ్ సైట్స్ తో బాటు చాలా సమాచారం ఇచ్చాను. ఇక్కడ అవి కాకుండా గూగుల్ శోధనతో ఎలా తెలుసుకోవచ్చు అన్నవాటికి రెండు ఈ-బుక్స్‌ని ఇచ్చాను. ఈ కిటుకుల ద్వారా మీరు గూగుల్‌ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకుని లాభిస్తారని అశిస్తున్నాను.
గూగుల్ సెర్చ్‌ని శక్తివంతంగా ఉపయోగించడానికి (తెలుగులొ) ఇక్కడ చూడండి.
దీనిని అందించిన వారు: శ్రీధర్ చందుపట్ల
శ్రీధర్ చందుపట్ల గారికి కృతజ్ఞతలు.
గూగుల్లో వెదకడానికి గూగుల్‌వారి గైడ్ (ఇంగ్లిష్‌లో) ఇక్కడ చూడండి.
ఇక్కడ పై రెండు ఫైల్సు మీరు డవున్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
రెండు ఉచితమే!
Assistant Editor – వెంటనే కావాలి
జనవరిలో ప్రారంభంకానున్న ఒక దినపత్రికకు అనుబంధంగా ప్రారంభించబడుతున్న web portal కి Assistant Editor కావాలి.
తెలుగు బాగా వచ్చా?
English ఇంకా బాగా వచ్చా?
అరె! మీకొసమే ఎదురుచూస్తున్నాము!
అంతర్జాలం దానికి సంభందించిన విషయాలమీద పూర్తి అవగాహన ఉందా? Portal సు వాటి content మీద మీకంటు కొంత స్వంత అభిప్రాయాలున్నవా? అవి పంచుకోగలరా? అనుభవం కూడా వుందా?
అయ్యొ. మరి ఇంకా అక్కడే నిలబడ్డారేం?
మీకు దాదాపు పాతికేళ్ళ వయసుందా?
ఐతే మీరు అర్హులే!
కనీసం graduation పూర్తి గావించారా?
ఐతే మరి ఇంక ఆలస్యం ఎందుకు?
అప్లై చెయ్యండి!
పగలే నండి ఉద్యోగం. Portal అన్నాంగదా?
జీతం ఎంతంటారా?
మీ ఉత్సాహము, అనుభవాన్నిబట్టి కనీసం నెలకి పది, పదిహేను వేల మధ్య ఉంటుంది?
ఉద్యోగం ఎక్కడంటారా?
భాగ్యనగరంలోనే!
మీకీ ఉద్యోగ అఖర్లేదా?
సరే మీకు తెలిసిన వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి చెప్పి అప్లై చెయ్యమనండి.
ఫొనెందుకండి?
careers AT thus dot in కి
Subject లైన్‌లో Assistant Editor
అని వ్రాసి మీ అప్లికేషన్ పంపండి.
* reference ఇస్తే బాగుంటుంది. మా పనిని సులభంగా చేసుకోగలుగుతాం!
ప్రతి అప్లికెషన్‌కి జవాబు ఉంటుంది.
Waiting లొ పెట్టం.
ఒక్క నిమిషం!
ప్రైవేటు రంగంలొ రిజర్వేషన్లు ఉండాలా?
యూ.పి ముఖ్యమంత్రి మాయావతి ప్రైవేట్ రంగంలొ కూడా రిజర్వేషన్లను అమలుపరచడానికి తగిన పనులన్ని పూర్తి చేసుకుంది. (ఈ వార్త ఇక్కడ).
* ఏవరేవరికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తున్నయి?
వెనుకబడ్డ కులావారికి, ఆర్ధికముగా వెనుకబడివున్నవారికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
* ప్రైవేటు రంగంలొ ఏయే సంస్థలు ఈ రిజర్వేషన్లు పాటించాలి?
1 – కొత్తగా స్థాపించే సంస్థలకు మాత్రేమే ఇది వర్తిస్తుంది.
2 – ప్రభుత్వంలోని ఏ శాఖనుండిగాని, భూమిగాని, ఏదేని గ్రాంట్ గాని, కట్టే శిస్తులలో రాయితిగాని మరేవిధంగానైన సహాయంగాని పొందిన సంస్థలు ఈ రిజర్వేషన్లను అమలు పరచాలి.
* మరి ఏమేరకు ఈ సంస్థలు రిజర్వేషలని అమలు చెయ్యాలి?
30 శాతం దాక అమలు చెయ్యాలి.
సంభందిత శాఖా, రాష్త్ర కార్మిక శాఖ, ఆ సంస్థ యాజమాన్యం రిజర్వేషన్ని సరిగ్గా అమలుపరుస్తుందాలేదా అన్నది పర్యవేక్చ్చిస్తుంటయి.
మన ముఖ్యమంత్రిగారు కూడా దానిని మన రాష్త్రంలో కూడా ప్రయోగించి పాటించడానికి కసరత్తులు మోదలుపెట్టారు.
(ఈ వార్త ఇక్కడ).
యూ.పి వారి పాలసి విధి విధానలని తెప్పిస్తున్నారు. కూలంకషంకా దానిని పరిశీలించి బహుశ
ఈ రాష్ట్రానికి కావల్సిన, చేయాల్సిన మార్పులు చేర్పులు చేసి తగిన చట్టాన్ని అమలులోకి తీసుకువస్తారు.
దీనికి మరి మీరు ఏమంటారో తెలియజేయగలరా?
కార్టూన్లు
అందులో ఒకటి ఇది.
రెడ్డేమంటున్నాడు?
గోదావరి వరద బాధితులకి సహాయం చెయ్యండి.
మా కర్నూలికా వరదలు రావు.
దొడ్డిగుమ్మం గొళ్ళెం వూడదు.
నా సీమ రాయలసీమ కాదండి.
ప్రకాశం అవుతాడంటారా?
దిడ్డిగం వేసి ముడ్డితొ దాటే వారుంటారు.
ఏమో లెండి. బట్టతలలు బట్టతలలే మొకాళ్ళూ,
మోకాళ్ళే
ఎన్ని చెప్పినా ఆయన రాజాకీయనుభవాని
కున్నంత వయసుగూడా లేదాయె వీళ్ళకి.
అబ్బో! మా మంచి విగ్రహం!
ఎంత మంచి కాకపొతే అంతమంది పోలీసులు
కాపలా కాయవలసి వచ్చిందంటారు.
విగ్రాహాలకి ఆగ్రహం వుండదు. ఒకటే
నిగ్రహం.
అదే మృగ్యం.
మీసాలు లేనివరికి రోసాలు మిక్కుటం.
ఆర్డినెన్సులు పెట్టడంలో అగ్రతాంబూలం మనదే చూడండి.
* * *
ఓబుళపురం
జమ్మలమడుగు కి ఎవైనా అనగ్రాంస్ (anagrams) ఇవ్వగలరా?
Can you share a few
anagrams
for
J A M M A L A M A D U G U?
ఇంకెవరికేనా తెలుసా యీ పద్యం?
Lalita said…
From an old riddle semi-remembered, రాముడే రీతి రావణు వధియించె? లకోలకోల. The riddle goes on with answers all being palindromes. తోకమూకతో, మందారదామం, వగైరా వగైరా. సీసపద్యం, తేటగీతి. ఇంకెవరికేనా తెలుసా యీ పద్యం? I’ve forgotten most of it.
తెలుగులో “పాలిండ్రోం” అనే “ఇ పదం” (ఇంగ్లిష్ పదం) పోస్ట్‌కి లలితగారి జవాబు ఇది?
మీకేవరికైనా తెలిస్తే చెప్పరూ..
తెలుగులో PALINDROME
వీటికి అనగ్రాంలు…
SUNITA WILLIAMS = ?
TAJ MAHAL = ?
NARKETPALLI = ?
* ఒక పదంలొ” కనీసం నాలుగు అక్షరాలు ఉంటే బాగుంటుంది.