నేను రాసిన కధలు, వ్యాసాలు, కాలంలు వివిధ తెలుగు, ఆంగ్ల అచ్చు పత్రికలలో జాల పత్రికలలో (web magazines) ప్రచురణకు నోచుకున్నాయి. Published author, storyteller, columnist,
నిన్న రవీంద్ర భారతిలో జరిగిన కిన్నెర వారి తెలుగు వెన్నెల కవిత మహోత్సవాల సందర్భంలో కొందరు కవులు తమ తమ కవితలతో సదస్యులను రంజింపజేసారు. నిన్నటి సభలో కీలకోన్యాసం ఇచ్చిన శ్రీ కె. శివారెడ్డి గారి ఉపన్యాసం కూడా మీరు ఇక్కడ విన వచ్చు.
మనవాళ్ళు వొట్టి వెధావాయలోయ్
ఇది నా దగ్గిర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో స్ప్రీకర్ అనే అప్ తో రికార్డ్ చేసింది. మధ్యలో వచ్చిన ఫోన్ కాల్సు మూలంగా రికార్డింగ్ దెబ్బతిన్నది. సాంకేతిక కారణాలు నా నియంత్రణలో లేవు. అందుకని ప్రసంగంలో కొన్ని భాగాలు మీకు అందివ్వలేక పోతున్నాను. మిగతా కవులందరి కవితలను వారి గొంతులతోనే మీకు వినిపించే అవకాశం కలిగించాలి అన్నది కూడ నా ఉద్దేశం. ఈ రెండు మూడు రోజులలో ఆ పని కూడా ముగిస్తాను.
With the then President of India, Giani Zail Singh at Rashtrapathi Bhavan, New Delhi. The occasion – The president released the Postal Stamp honoring Kavirju Tripuraneni Ramaswamy. That is my mother Chouda Rani. She is holding the postal album that is issued by the President and autographed by him. The year 1987.
20th, శుక్రవారం2012 రోజున,
Rainbow (Radio channel) AIR FM 101.9 లో
Spreading Lights
కార్యక్రమం గురించి శ్రోతలతో
సరదాగా కాసేపు
పంచుకుంటారు.
మధ్యహ్నాం
1.30 కి
ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
సరే. ఇక ఈ డా. వింజమూరి ఎవరు?
డాక్టరు గారు. వైద్యం చేసే డాక్టరు గారు. కాని వైద్యం కాదు మన సంఘానికి కావల్సింది విజ్ఞానం. అది పుస్తకాలలో ఉంది కాబట్టి దానిని ముందు ప్రజల మస్తిష్కాలలోకి ఇంజెక్ట్ చేస్తే సంఘం బాగు పడుతుంది అని నమ్మి డాక్టరిని వదిలేసి ఇదిగో ఈ పస్తకాల పూజతో ప్రజలని సేవించుకుంటున్నారు. ఒక్క రూపాయి అడగరు. నిస్వార్ధంగా చేస్తున్నారు ఈ డాక్టరు వింజమూరి గారు.
Spreading Lights
వారు మొదలుపెట్టిన “Spreading Lights” కార్యక్రమలో ఒక భాగమే పుస్తకాలను చదువుకోవడం. రచయిత తన పుస్తకాన్ని కాని, పాఠకుడు తనకు నచ్చిన పుస్తకాన్ని కాని పది మంది తో ను పంచుకోవడం ఈ కార్యక్రమం విశేషం. భాగ్యనగరం లో ఐతే ప్రకాశ్ చొరవ,కృషి, పట్టుదల పుణ్యమా అంటూ ఇప్పుడు కనీసం పది చోట్ల ప్రతి వారం ఏదో ఒక దరోజున ఈ Spreading Lights కార్యక్రమం జరుగుతున్నది. నేను కూడా వీటిలో పాల్గొన్నాను.
మీరు కూడా మీ ప్రాంతంలో ఈ Spreading Lights కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. మీరు ముగ్గురే ఐనా ఫరవాలేదు. ముప్పై మంది ఐతే మరీ సంతోషం. 🙂
సరదాగా కాసేపు
ఇక రేపటి సరదాగా కాసేపు ప్రతి సాహిత్యాభిమాని తప్పక వినదగ్గ రేడియో కార్యక్రమం. నిజమే,ఏ సాయంత్రమో ఐతే బాగుండేది, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళకి ఇబ్బందే.
ఐనా వినడానికి ప్రయత్నించండి.
ఇక్కడ పైన ఉన్న చాయచిత్రంలో మీ ఎడమవైపు నుండి రెండో వారు శ్రీ వింజమూరి సూర్య ప్రకాశ్ గారు. (భుజానికి సంచీ తగిలించుకుని ఉన్నారే వారే)
ఏప్రిల్ నెలలో విడుదలైన మిసిమి లో వెలగా వెంకటప్పయ్య గారు ఒక వ్యాసం వ్రాసారు. దాని మకుటం “విదేశీయులు ప్రచురించిన తెలుగు గ్రంధాలు“. (పుట 58 – 62). అందులో బ్రౌన్ దొర గారి ప్రస్తావన కూడా ఉంది. 1825 లోనే దొర ” I found Telugu literature dead ” అని వ్యాఖ్యానించాడు. దాదాపు 30 సంవత్సరాల తరువాత ” In thirty years raised it to life” అని కూడా అన్నాడు.
Charles Philip Brown
చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్, ఒక ఇంగ్లిష్ దొర మన భాష కోసం పడ్డ కష్టం ముందు, మనదెంత. మనకున్న వనరుల ముందు ఆ దొరకున్నదెంత? ఆయన చేయగాలేనిది, మనం ఈ రోజున ఉమ్మడిగా నైనా చెయ్యలేమా?
పిలల్ల నామకరణానికి నేమ్స్ కోసం నెట్‌ని ఆశ్రయిస్తాం.
వాళ్ళ సందేహలు తీర్చడానికి జాలంలో జవాబులు వెదుక్కుంటాం.
అర్ధాలు చెప్పడానికి ఆన్‌లైన్ డిక్షనరీలు చూసుకుంటాం.
ఆ పిల్లల పరిక్షా ఫలితాలని ఇంటర్నెట్ లో తెలుసుకుంటాం.
ఉద్యోగాలకి ఇంటర్నెట్‌లో అప్ప్లై చేసుకుంటాం.
ప్రేమలేఖలు, ఊస్టింగ్ ఆర్డర్లు, గ్రీంటిగ్‌లు ఆన్‌లైన్‌లో అందుకుంటాం.
ఫేస్‌బుక్కులోను, జీప్లస్సులోను స్నేహాలు చేస్తాం.
కోడల్లని, అళ్ళుళ్ళని నెట్‌లో వెతుక్కుంటాం.
బస్సు టికెట్లు, రైలు టికెట్లని, సినిమా టికెట్లని ఇంటర్‌నెట్‌లో కొనుక్కుంటాం.
పాన్ కార్డ్లు, వోటర్ కార్డులకి ఫారాలు ఆన్‌లైన్లో నింపుతాం.
RTI రా భయ్, అని వాడ్ని ఆన్‌లైన్‌లో నిలదీస్తాం.
పత్రికలని, కథలని, కవితలని ఆన్‌లైన్‌లో చదువుకుంటాం.
స్టోరిని, ఫీచర్‌ని, కవరింగ్‌ని, ఐటంని ఈమైల్‌లో పంపుకుంటాం.
EBook
ప్రింట్ బుక్ ని, డివిడిని, ఈబుక్ ని ఆన్‌లైన్‌లో కొనుక్కుంటాం.
కొనుక్కున్న ఈబుక్‌ని కిండిల్ లోను, ఐపాడు లోను అందరూ గమనించేలా చూసుకుంటాం. లాప్‌టాప్‌లోనూ, డెస్క్‌టాప్‌లోను అప్పుడప్పుడూ చదువుకుంటాం.
ఉచితం గా పుస్తకాలని అందుకుంటాం, స్వీకరిస్తాం, రివ్యూ చేస్తాం, సమీక్షిస్తాం. పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో దొరుకుతుంది అని కూడ పాఠకులకి చెబుతాం. తన ఈ బుక్ గురించి రచయిత తెలియజేస్తే, అది మాకూ తెలుసన్నట్టుగా బుర్ర ఊపుతాం.
కాని.. కాని
ఈబుక్ గా వెలువడిన సాహిత్యాన్ని గుర్తించం. ఒకవేళ గుర్తించినా స్వీకరించం. స్వీకరించినా రివ్యూ చెయ్యం, సమీక్షించం, ఆన్‌లైన్‌లో ఎక్కడ దొరుకుతుందో అని కూడా పాఠకుడికి తెలియజేయం. అదేమిటంటే ఈబుక్స్ గురించి అందరికి తెలిదుగా అని అనేస్తాం. స్పేసు లేదండి అని అంటాం. పైగా మిగతావాళ్ళేవరూ, ఈ భాషలోను చెయ్యటం లేదుగా అని కూడా అనేస్తాం. మరీ ఐతే, టెక్నికల్ సమస్యలున్నాయని దాటేస్తాం.
అదే మా వాడేతే భుజాలమీదకెక్కించుకుని ఊరేగిస్తాం.
కాని మా సాహిత్యాభిమాన్నాన్ని శంకింస్తే మాత్రం ఊరుకోం!
కొసమెరుపుప్రాసారమధ్యమాలలో పనిచేస్తున్నవారి పుస్తకాలు కూడా kinige.com లో ఉన్నవి. కనీసం ఇప్పుడైనా ఈ సాహిత్యాన్ని ఈ ప్రసార మాధ్యమాలు గుర్తిస్తాయని, దానికి సముచిత స్థానాన్ని కలిపిస్తుందని ఆశిస్తాను.
ఆరేళ్ళో అరవై ఏళ్ళో బ్రతుకుతాం. ఆరేళ్ళముందెలా పుట్టామో ఎవడికి తెలీదు. అరవై తర్వాత ఎలా చస్తామో మనకి తెలీదు. తీసుకు తీసుకుని తడిసిన నులక మంచానికి తప్ప ఆరు నుంచి అరవైదాక ఈలోపల బేరామాడ్తాం. చివరకు గిట్టుబాటవుతుంది తప్పక.
ఒకే కవితకు ఆరు అర్థాలు ఒస్తాయని ఒకడు అమ్మ చూపుతాడు. ఆరూ అనర్థాలే. అసలు అర్థం అమ్మేవాడికే తెలీదు. కొనేవాడు నూరర్థాలు అడుగుతాడు – ఓ శతాధిక గ్రంధకర్తని. శతపత్ర సుందరిని అరవై ఏళ్ళ ఆంధ్ర కవిత్వాన్ని ఆరు రూపాయలకే అచ్చెయ్యమంటాడు అరసున్నాలకి అమ్ముడు పోయేవాడు.
…
మో వీటిని ‘పద మూర్చన’ లన్నాడు. చచ్చిన తర్వాత చెప్పే మొదటి మాటలంట! పైగా అంటాడు..”వాస్తవాన్ని అధివాస్తవికంగా మలుచుకునే ప్రయత్నంలో వచనం విరిగి ముక్కలయ్యి ఆ గాజు పెంకులు పద్యానికి గుచ్చుకొంటాయి”ట.
“ప్రతి నేనుకి ఒక మేనుంటుంది. నేను లోంచి మేము, మనం అవటానికే ఏ రచన అయినా. తారీఖులూ, దస్తావేజులూ ఏమిలేని అనామక స్వీయ జీవన చిత్రణ ఈ ‘బతికిన క్షణాలు’. దృశ్యం అదృశ్యంగాను శబ్దం నిశ్శబ్దంగానూ రంగులు పులుముకుని మాటలుగా మ్రోగుతాయ్.
అంతాలో ఎంతో కొంత యిది.
ఎక్కువ మాట్లాడే వాడు ఏది చెప్పడు.
నిశ్శబ్ద క్షణంలో శాశ్వత శబ్దాన్ని పట్టుకోవాలని
ఈ నూత్న యత్నం”.
వెతకండి..ఎక్కడన్నా దొరికితే, దొరకబుచ్చుకుని చదవండి. చదివి ఆ “బతికిన క్షణాలు” మళ్ళీ బతకడానికి ప్రయత్నించండి.
ఎందుకంటే “మో” ఆ “బతికిన క్షణాలు” అన్నింటిని ఐదు వందల ప్రతులకి మాత్రమే పరిమితం చేసాడు..అది ఒక దశాబ్దం క్రితం!
మో “బ్రతికిన క్షణాలు” తొలి ముద్రణ 1990 – మలి ముద్రణ 2000