శివయ్య, పద్మావతి కి కలిగిన సంతానమే భారతి. ఆమె చిన్నప్పుడే తండ్రి తాగుడికి అలవాటు పడి అనారోగ్యం తో చనిపోయాడు. భారతికి అప్పుడు ఐ దారు ఏళ్లు ఉంటాయేమో. పద్మావతి కూలీ నాలీ చేసుకుంటూ బ్రతికుని వెళ్ళదీసుకుందామనుకునేది. ఒంటరి ఆడది. కడుపు మాడ్చుకోవడం కష్టం గా ఉండేది. దానికి తోడు పిల్లదాని కడుపు కూడా చూడాలి. సూరి దృష్టి లో ఆమె పడింది. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు వేసిన తప్పటడుగు ఆమె జీవితాన్ని మార్చేసింది. సూరి చేతులు మార్చుకున్నాడు. పద్మావతి ఇప్పుడు డబ్బుతో సుఖం కొనుకోవచ్చు అనే ఆలోచనతో డబ్బు వెమ్మట పరిగెత్తడం మొదలయ్యింది. ఆ క్రమంలో భారతిని నిర్లక్షం చేసింది.
తల్లి చేసిన తప్పులన్నింటిని భారతి చెయ్యలేదు.
(ఈ బొమ్మలోని వ్యక్తి భారతి కాదు)
చదువుకుంది. కాపీలు కొట్టింది. మార్కులు సంపాదించింది. మాల్సుకెళ్ళింది. ఉద్యోగాలు చేస్తూన్న షాపులలోనే దొంగతనాలు చేసింది. బస్సులెక్కింది. మగవాడి బలహీనతతో ఆడుకోవడం నేర్చింది. స్కూటర్లెక్కింది. బైకులెక్కింది. కారులెక్కింది. సుఖమయ జీవితాన్ని ప్రేమించింది. సుఖాలు లేని జీవితాన్ని అసహ్యించుకుంది. లేమిని చూసి భయపడింది. డబ్బుకోసం వెంపర్లాడింది. కొత్త అలవాట్లు నేర్చుకుంది. తన విలువలంటు కొత్త భాష్యాలు చెప్పుకుంది. వాటినే ఆచరించండం మొదలు పెట్టింది.
బస్ స్టాపులో కనపడింది. స్టేషన్ ప్లాట్ ఫారం మీద వల విసురుతూ కనపడింది. చివరకు నా ఆఫీసుకే ఉద్యోగం అంటూ వచ్చింది. ఉద్యోగం కోసం ఏ పనైనా చేస్తానని నొక్కి వక్కాణించింది.
తాడుని తెగేదాకా లాగింది. కట్టు తెగింది. మరి ఇప్పుడు ఏమయ్యిందో? ఎక్కడుందో?
* ఇది వ్రాస్తున్నప్పుడు..ఓ హెన్రి కథ ది గిల్టీ పార్టీ లో లిజ్జీ గుర్తోస్తోంది.