మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి

మొన్న జనవరి లో కలిసాను మాలతీ చందూర్ గారిని. వారింట్లోనే. కచేరి రోడ్డు లో, మైలాపూర్‌లో శాంధోమ్ చర్చి కి దగ్గిర్లో. వారింటి పక్కనే ఒక కేరళ వైద్యశాల ఉంటుంది. శ్యామలాంబ గారు వారి సోదరి. నేను, ఆరుద్ర గారి పిల్లలు, దాశరధి గారి పిల్లలందరం కలిసి చదువుకున్న చిల్డ్ర్‌న్స్ గార్డెన్ స్కూలో లో వారు ఉపాధ్యాయురాలు. దాదాపు మా కుంటుబాలు అన్ని కూడా 4 దశాబ్దాలుగా కలుస్తునే ఉన్నాయి.